UP rape case : 17ఏళ్ల బాలికను గర్భవతిని చేసి.. పసికందును అడవిలో పడేసి!-up man held for raping teen throwing their newborn in forest area ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Up Man Held For Raping Teen, Throwing Their Newborn In Forest Area

UP rape case : 17ఏళ్ల బాలికను గర్భవతిని చేసి.. పసికందును అడవిలో పడేసి!

Sharath Chitturi HT Telugu
Feb 20, 2023 06:32 AM IST

UP rape case : 17ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఆమెను గర్భవతిని చేశాడు. ఆడబిడ్డ పుట్టగా.. పసికందును అడవిలో పడేశాడు. ఈ ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లో చోటుచేసుకుంది.

17ఏళ్ల బాలికను గర్భవతిని చేసి.. పసికందును అడవిలో పడేసి..!
17ఏళ్ల బాలికను గర్భవతిని చేసి.. పసికందును అడవిలో పడేసి..!

UP man rapes teenager : ఉత్తర్​ ప్రదేశ్​లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. 17ఏళ్ల బాలికపై అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పసికందును.. ఆ కిరాతకుడు.. అడవిలో పడేసి పారిపోయాడు!

ట్రెండింగ్ వార్తలు

పెళ్లి చేసుకుంటానని.. గర్భవతిని చేసి..

UP crime news : ఉత్తర్​ ప్రదేశ్​ సహరన్​పూర్​కు చెందిన 17ఏళ్ల బాలికకు సల్మాన్​ అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. కాగా.. ఆ బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి లొంగదీసుకున్నాడు సల్మాన్​. ఈ క్రమంలోనే అనేక మార్లు రేప్​ చేశాడు!

సల్మాన్​ కారణంగా ఆ బాలిక గర్భం దాల్చింది. కొన్ని రోజుల క్రితం ఆమెకు ఆడబిడ్డ పుట్టింది. ఇది తెలుసుకున్న సల్మాన్​.. ఆ పసికందును.. బాలిక నుంచి లాగేసుకున్నాడు. అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పసికందును నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. అనంతరం అక్కడి నుంచి జారుకున్నాడు.

UP rape case : మరోవైపు.. సల్మాన్​పై బాలిక డియోబంద్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని మోసం చేసి, తనను సల్మాన్​ అనేకసార్లు రేప్​ చేశాడని పేర్కొంది. ఫలితంగా తాను గర్భం దాల్చినట్టు ఫిర్యాదులో పేర్కొంది.

ఘటనపై సెక్షన్​ 376, 377, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని ఆదివారం అరెస్ట్​ చేశారు.

మరోవైపు అడవిలో పడేసిన పసికందు.. స్థానికంగా నివాసం ఉండే ఓ రైతుకు కనిపించింది. ఆ పసికందును ఆయన పోలీసులకు అప్పగించాడు. పోలీసులు ఆ ఆడబిడ్డను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బిడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. త్వరలోనే పసికందును శిశు సంక్షేమ కమిటీకి అప్పగించనున్నారు.

14ఏళ్ల బాలికపై తాంత్రికుడు అత్యాచారం..

Tantrik rapes minor : దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. 14ఏళ్ల బాలికపై ఓ తాంత్రికుడు అనేక మార్లు అత్యాచారానికి పాల్పడి, ఆమెను గర్భవతిని చేసిన ఘటన తాజాగా కలకలం సృష్టించింది.

14ఏళ్ల బాలికకు కొన్ని నెలలుగా ఆరోగ్యం బాగుండటం లేదు. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ఆ బాలిక తల్లి.. ఆమెను తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లింది. అక్కడ అతను మాయమాటలు చెప్పాడు.

Delhi crime news : ఆ తర్వత కొన్ని రోజులకు.. ఆ తాంత్రికుడు ఆమె ఇంటికి వెళ్లాడు. తల్లిని బయటకు పంపించాడు. తలపులు వేసి, బిడ్డపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి అనేకమార్లు ఇదే విధంగా చిత్రహింసలకు గురిచేశాడు.

ఇటీవలే.. ఆ బాలిక అనారోగ్యం పాలైంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. బాలిక 2 నెలల గర్భవతి అని తేలింది. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Delhi rape case : ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకునన పోలీసులు.. దర్యాప్తును చేపట్టారు.

IPL_Entry_Point