Pregnant Sleeping Tips : గర్భిణులు ప్రశాంతమైన నిద్రపోయేందుకు ఈ టిప్స్ పాటించండి
Pregnant Sleeping Tips In Telugu : గర్భిణులకు సరైన నిద్ర ఉండాలి. లేదంటే కడుపులోని బిడ్డకు కూడా సమస్యే. కొన్ని రకాల టిప్స్ పాటిస్తే ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
గర్భధారణ సమయంలో నిద్రపోవడం చాలా కష్టం. నిద్ర సమస్యలకు ప్రధాన కారణం కడుపు ఉబ్బరం. పొట్ట పెద్దగా అవుతుంటే.. ఇరువైపులా తిరగడం, పడుకోవడం అసాధ్యం. నిద్రపోయే సౌకర్యం ఉండదు. అంతే కాకుండా మరికొన్ని కారణాలు కూడా నిద్రకు ఇబ్బంది కలిగిస్తాయి.
తరచుగా మూత్రవిసర్జన, మూడ్ స్వింగ్స్, పగటిపూట నిద్రపోవడం, కండరాల తిమ్మిరి కొన్ని కారణాలు. కానీ గర్భిణీ స్త్రీలకు తగినంత నిద్ర అవసరం. ఇది కడుపులో పెరుగుతున్న బిడ్డకు, తల్లికి మంచిది. మీరు ఎంత ప్రయత్నించినా ప్రెగ్నెన్సీ సమయంలో నిద్రలేకపోతే, కింద ఇచ్చిన కొన్ని చిట్కాలను ఫాలో అవ్వండి. కచ్చితంగా మంచి ప్రశాంతమైన నిద్రను పొందుతారు.
గర్భధారణ సమయంలో మీరు మెత్తగా ఉండే 2 లేదా 3 దిండ్లు కొనుగోలు చేయాలి. మీ వెనుక వీపుకు మద్దతుగా పెట్టుకోవాలి. వాటిని నిద్రించడానికి ఉపయోగించాలి.
సాధారణంగా మొదటి త్రైమాసికంలో అధిక అలసట కారణంగా, పగటిపూట నిద్రపోవడం జరుగుతుంది. కానీ అలా పడుకుంటే రాత్రి నిద్ర పోతుంది. పగటిపూట నిద్రకు దూరంగా ఉండాలి.
మీరు గర్భధారణ సమయంలో ఒత్తిడి లేదా మానసిక కల్లోలం అనుభవించవచ్చు. ఇది నిద్రలేమికి దారి తీస్తుంది. మానసిక స్థితిలో మార్పులలో ఒకటైన ఒత్తిడి ఎదురైనప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి యోగా, వాకింగ్ వంటివి చేస్తే కచ్చితంగా ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. దీనివల్ల మంచి నిద్ర కూడా వస్తుంది.
పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగితే మంచి నిద్ర వస్తుంది. అంతే కాకుండా బ్రెడ్ వంటి కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల బాగా నిద్ర పడుతుంది. ప్రొటీన్ ఫుడ్స్ కూడా తీసుకుంటే తలనొప్పి, హాట్ ఫీలింగ్, చెడు కలలు వంటివి కూడా దూరమవుతాయి.
బిడ్డ, తల్లి ఆరోగ్యంగా ఉండటానికి నీరు, ద్రవాలు చాలా అవసరం. కానీ అలాంటి పానీయాలు రోజులో పెద్ద పరిమాణంలో తీసుకోవాలి. సాయంత్రం మోతాదును తగ్గించడం ద్వారా మీరు రాత్రి తరచుగా మూత్రవిసర్జనను నివారించవచ్చు. దీని వల్ల మంచి నిద్ర వస్తుంది.
గర్భిణీ స్త్రీలు కండరాల తిమ్మిరిని ఎదుర్కొనే అవకాశం ఉంది. దీని వల్ల చాలా మందికి నిద్ర పోతుంది. పగటిపూట మీరు వేడి నీటి ప్యాక్‌తో మీ పాదాలకు వ్యాయామం చేయాలి. ముఖ్యంగా వ్యాయామం చేసే సమయంలో నిద్రపోకండి. లేదంటే రాత్రి నిద్ర పోతుంది.
రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం వల్ల రాత్రి బాగా నిద్ర పడుతుంది. అయితే గోరువెచ్చని నీరు కండరాలను సడలించి, తిమ్మిరిని నివారిస్తుంది. మీకు మంచి నిద్ర కావాలంటే వెచ్చని నీటితో స్నానం చేయండి.
శరీరం నిరంతరం ఒక పనిని చేయడం ప్రారంభించినప్పుడు, బయోలాజికల్ క్లాక్ అలవాటు అవుతుంది. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోండి. మంచి నిద్ర కూడా ఇస్తుంది.
జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం వల్ల మంచి నిద్ర పోవచ్చు. ముఖ్యంగా రాత్రిపూట మానుకోండి. నిజానికి గర్భిణులు జంక్ ఫుడ్ కు పూర్తిగా దూరంగా ఉంటేనే బిడ్డకు మంచిది. అలా కాకుండా పండ్లు, కూరగాయలు తినడం వల్ల పెరుగుతున్న బిడ్డకే కాదు తల్లికి కూడా మేలు జరుగుతుంది.
ఈ రోజుల్లో మహిళలు కూడా పొగతాగుతున్నారు. మహిళలు గర్భంతో ఉన్నప్పుడు ఈ అలవాటుకు దూరంగా ఉండాలి. అలాగే ధూమపానం చేసేవారి దగ్గర ఉండకుండా ఉండండి. ఎందుకంటే దీనివల్ల నిద్ర కూడా పట్టదు. పైన చెప్పిన చిట్కాలు పాటిస్తే గర్భిణులు హాయిగా నిద్రపోవచ్చు.