ఎక్కువ వేడిగా ఉండే నీటితో తలస్నానం చేస్తున్నారా? జుట్టుకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ రావొచ్చు

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Feb 14, 2024

Hindustan Times
Telugu

వాతావరణం చల్లగా ఉన్న సమయాల్లో ఎక్కువ వేడిగా ఉండే నీటితో తలస్నానం చేయడాన్ని చాలా మంది ఇష్టపడతారు. 

Photo: Pexels

వేడి నీటితో స్నానం చేయడం వల్ల రిలాక్స్‌గా అనిపిస్తుంది. మంచి నిద్ర వస్తుంది. అయితే, ఎక్కువ వేడిగా ఉండే నీటితో తలస్నానం చేయడం జుట్టుకు అంత మంచిది కాదు. 

Photo: Pexels

అధికంగా వేడిగా ఉండే నీటితో తలస్నానం చేస్తే.. జట్టు ఎక్కువగా పొడిబారుతుంది. అలాగే, వెంట్రుకలు బ్రేక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

Photo: Pexels

వేడి నీటితో తలస్నానం చేస్తే కుదుళ్ల రంధ్రాలకు ఇబ్బందిగా ఉంటుంది. దీని ద్వారా వెంట్రుకలు రాలే రిస్క్ ఉంటుంది. జుట్టు కుదుళ్లు వీక్ అవుతాయి. 

Photo: Pexels

వేడి నీటితో తలస్నానం చేస్తే వెంట్రుకల్లోని కెరటీన్ ప్రొటీన్‍కు ఇబ్బందిగా మారుతుంది. దీని వల్ల హెయిర్ డ్యామేజ్ అవొచ్చు. 

Photo: Pexels

ఎక్కువ వేడిగా ఉండే నీటితో తలంటు పోసుకుంటే కొందరిలో దురద, డాండ్రాఫ్ సమస్యలు కూడా పెరుగుతాయి. 

Photo: Pexels

అందుకే, తలస్నానం గోరువెచ్చటి నీటితో చేస్తే బాగుంటుంది. చన్నీళ్లతో చేసే ఇంకా మంచిది. 

Photo: Pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels