Tomato Dosa : కరకరలాడే టొమాటో దోసె.. చేయడం సులభం.. రుచి సూపర్
Tomato Dosa Recipe : దోసెలో చాలా రకాలు ఉంటాయి. అయితే ఎప్పుడైనా టొమాటో దోసె ట్రై చేశారా? ఇది చాలా రుచిగా ఉంటుంది.
దోసె అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. వారంలో కచ్చితంగా ఒకట్రెండు సార్లు దోసె చేసుకుని తింటారు. కొందరైతే దోసె తినేందుకే బయటకు వెళ్తారు. అయితే దోసెను ఎప్పుడూ ఒకేలాగా తింటే బోర్ కొడుతుంది కదా. అందుకే అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేయండి. అందులో భాగంగా టొమాటో దోసె తయారుచేయండి. అందరికీ నచ్చుతుంది. తయారు చేసేందుకు సమయం కూడా ఎక్కువగా పట్టదు.
ఇడ్లీ, దోస దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన అల్పాహారం. చాలా ఇళ్లలో అల్పాహారంగా దోసె చేసుకుంటారు. ముఖ్యంగా పిల్లలకు ఇడ్లీ కంటే దోసె అంటే చాలా ఇష్టం. దోసెలో చాలా రకాలు ఉన్నాయి. ఎగ్ దోస, ఉల్లిపాయ దోస.. మొదలైనవి.. మనం టొమాటోతో దోసెను కొద్దిగా భిన్నంగా చేయవచ్చు. ఇది తినేందుకు బాగుంటుంది. కరకరలాడుతుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
టొమాటో దోసె అని మీరు ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ దోసెను కచ్చితంగా ట్రై చేయాల్సిందే. మీ పిల్లలు దీన్ని ఇష్టపడతారు. సాధారణంగా టొమాటోతో చట్నీ, గ్రేవీ, కూర వంటివి ఎక్కువగా చేస్తుంటాం. అయితే ఈరోజు టమోటాలతో కరకరలాడే దోసె ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం.
టొమాటో దోసెకు కావాల్సిన పదార్థాలు
టొమాటోలు - 5 (బాగా పండినవి)
దోసె పిండి - 1 కప్పు
మినపప్పు - 1/2 కప్పు
ఎండు మిరపకాయలు - 8
ఇంగువ - 1 చెంచా
ఉప్పు, నూనె - అవసరం
టొమాటో దోసె తయారు చేసే విధానం
ఈ దోస చేయడానికి, ముందుగా పప్పు, బియ్యాన్ని బాగా కడిగి ఒక పాత్రలో నీరు పోసి సుమారు 2 గంటలు నానబెట్టండి.
తర్వాత నీరు లేకుండా బాగా వడకట్టి విడిగా ఉంచుకోవాలి. ఇప్పుడు గ్రైండర్ లేదా మిక్సీ జార్‌లో నానబెట్టిన బియ్యం, ఉడకబెట్టిన పప్పు, ఇంగువ, ఎండు మిరపకాయలు, టమోటాలు, ఉప్పు వేసి దోస వేసుకునేందుకు పిండిని మెత్తగా చేయాలి.
తర్వాత ప్రత్యేక పాత్రలో ఉంచండి. సుమారు 2 గంటల తర్వాత నూనె పోసి దోసె వేసి వేయించాలి. అంతే కరకరలాడే టొమాటో దోసె రెడీ..
దోసెలో చాలా రకాలు ఉన్నాయి. కానీ టొమాటో దోసె రుచి భిన్నంగా ఉంటుంది. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. దీనిని ఏదైనా చట్నీలో కలుపుకొని తినవచ్చు. లేదంటే.. నేరుగా కూడా తినవచ్చు. ముఖ్యంగా పిల్లలు మాత్రం ఈ కొత్త రకం రుచి నచ్చుతుంది. ఆలస్యం చేయకుండా ఈరోజే టొమాటో దోసెను మీ ఇంట్లో ప్రయత్నించండి.