Tender Coconut Dosa : కొబ్బరితో దోసె.. కొత్త రుచి.. ఎంతో ఆరోగ్యం!-how to prepare tender coconut dosa for breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tender Coconut Dosa : కొబ్బరితో దోసె.. కొత్త రుచి.. ఎంతో ఆరోగ్యం!

Tender Coconut Dosa : కొబ్బరితో దోసె.. కొత్త రుచి.. ఎంతో ఆరోగ్యం!

Anand Sai HT Telugu
Apr 21, 2024 06:30 AM IST

Tender Coconut Dosa : దోసె ఆరోగ్యానికి మంచిది. అయితే దీనిని కొబ్బరితో కలిపి చేస్తే ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఇది ఆరోగ్యానికి కూడా మంచిది.

కొబ్బరితో దోసె తయారీ విధానం
కొబ్బరితో దోసె తయారీ విధానం

కొబ్బరితో దోసె ఎప్పుడైనా తిన్నారా? మంచి రుచిగా ఉంటుంది. కొబ్బరితో 2 రకాల దోసె రెసిపీ చేయవచ్చు. ఈ దోసె చాలా రుచితోపాటుగా ఆరోగ్యానికి కూడా మంచిది. కొబ్బరితో దోసెను ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ రెసిపీ చేసేందుకు టైమ్ కూడా ఎక్కువగా పట్టదు. ఈజీగా తయారు చేయవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా లాగించేస్తారు.

రెసిపీ 1 తయారీ విధానం

బియ్యం 2 కప్పులు, తురిమిన కొబ్బరి 1/2 కప్పు, కొబ్బరి నీరు 1 కప్పు, చక్కెర 2 టేబుల్ స్పూన్లు, 1/4 టేబుల్ స్పూన్ ఉప్పు

బియ్యాన్ని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే నీళ్లను వడకట్టి బియ్యాన్ని జాడీలో వేసి అందులో కొబ్బరి తురుము వేసి కాస్త కొబ్బరి నీరు, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తరవాత పిండిని ఒక గిన్నెలో వేసి, దోసె చేయడానికి కావలసినంత కొబ్బరి నీరు పోసి, పంచదార వేసి కలపాలి. తరువాత దోసె పాన్ వేడి చేసి, నూనె వేసి, అందులో దోసెను కొద్దిగా మందంగా వేయాలి. పాన్ మూసివేసి 2-3 నిమిషాలు అలాగే ఉంచండి. ఉడికిన తర్వాత దోసెను పాన్ నుంచి తీసేయాలి.

రెసిపీ 2 తయారీ విధానం

1 కప్పు బియ్యం, 2 కప్పుల కొబ్బరి నీరు, 1 టేబుల్ స్పూన్ పంచదార, కొద్దిగా ఉప్పు

బియ్యాన్ని రాత్రంతా నానబెట్టాలి. ఆపై కొబ్బరి నీరు, బియ్యం వేసి గ్రైండ్ చేసుకోవాలి. దోసెకు కావాల్సిన పదార్థాలు కలుపుకోవచ్చు. తర్వాత ఒక చిన్న పాన్ తీసుకొని, దానిని వేడి చేసి, నూనె వేయాలి. తర్వాత దోసె మిశ్రమాన్ని వేసుకోవాలి. తరువాత పాన్ మూసివేసి దోసె ఉడికించాలి. ఈ దోసె తినడానికి చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరి నీరు వాడటం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ దోసెను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.

ఈ దోసెలను అందరూ ఇష్టంగా తింటారు. కొబ్బరితో చేసే దోసెలకు టైమ్ కూడా ఎక్కువగా అవసరం లేదు. ఈజీగా తయారు చేసుకోవచ్చు. అయితే దోసెల్లో చాలా రకాలు ఉంటాయి. రోజూ ఒకేలాగా తిని బోర్ కొట్టేవారు. ఇలా కొత్తగా ట్రై చేయవచ్చు. పైన చెప్పిన దోసెలు నేరుగా తినేయవచ్చు. లేదు అనుకుంటే కొబ్బరి చట్నీ కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఇవి మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒకేలాగా తినడం బోర్ కొట్టినవారు ఈ దోసెలను తినండి. రుచి సూపర్ గా ఉంటుంది. ఈ దోసెలను ఓసారి ట్రై చేసి చూడండి.