Dosa In 5 Minutes : 5 నిమిషాల్లో ఫటాఫట్ దోసె చేసేయండి.. చట్నీ కూడా-make dosa in 5 minutes for breakfast with chutney ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dosa In 5 Minutes : 5 నిమిషాల్లో ఫటాఫట్ దోసె చేసేయండి.. చట్నీ కూడా

Dosa In 5 Minutes : 5 నిమిషాల్లో ఫటాఫట్ దోసె చేసేయండి.. చట్నీ కూడా

Anand Sai HT Telugu
Mar 19, 2024 06:30 AM IST

Dosa In 5 Minutes : ఉదయం బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయకూడదు. ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అయితే సమయం లేనప్పుడు 5 నిమిషాల్లో దోసే చేసేయండి.

దోసె తయారీ
దోసె తయారీ (Unsplash)

ఉదయం అల్పాహారం చేయడం ప్రతి ఒక్కరికీ పెద్ద పని. ప్రతిరోజూ ఏం చేయాలో అర్థంకాదు. దీంతో ఏదో ఒకటి చేసేద్దామనుకుంటారు. ఉదయం తక్కువ సమయంలో అల్పాహారం కోసం ఏమి చేయాలనే ఆలోచన ఉంటే... దోసె ట్రై చేయండి.

ఉదయాన్నే రుచికరంగా చేయగలిగే దోసె రెసీపిని కేవలం 5 నిమిషాల్లో కొన్ని పదార్థాలను ఉపయోగించి ఫటాఫట్‌గా తయారు చేసుకోవచ్చు. ఈ గోధుమ పిండి దోసె చాలా రుచికరమైనది, తయారు చేయడం చాలా సులభం. ఉదయం అల్పాహారం చేయడానికి మీకు సమయం లేకపోతే 5 నిమిషాల్లో ఈ దోసెను తయారు చేసుకోవచ్చు.

దోసె ఎలా చేయాలి?

కావాల్సిన పదార్థాలు : గోధుమ పిండి - 2 కప్పులు, చిరోటి రవ్వ - 1/4 కప్పు, జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిపాయలు (అవసరమైతే) ఉప్పు,

ఒక పాత్రను తీసుకుని అందులో గోధుమపిండి వేసి పిండితో పాటు పైన పేర్కొన్న పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. నీరు కలిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. బాగా కలపండి, పిండి చాలా నీరుగా ఉండకూడదు. ఎక్కువ మందంగా కూడా ఉండరాదు.

దీని తర్వాత స్టౌవ్ వెలిగించాలి. పాన్ కు కాస్త నూనె వేయండి. తర్వాత ఈ పిండిని కలపండి. దోసె చాలా మందంగా ఉండకుండా చేయండి.

దోసెలో ఒక వైపు కరకరలాడుతూ మరో వైపు మెత్తగా ఉండేలా చేయాలి. ఇప్పుడు మెత్తటి గోధుమ దోసె సిద్ధం.

ఈ దోసె కేవలం 5 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది.

చట్నీ తయారీ విధానం

ఈ దోసె కోసం చట్నీ కూడా ఈజీగా చేసేయెుచ్చు. అది ఎలాగో చూద్దాం.. బాణలిలో చెంచా నూనె వేసి వేడయ్యాక అందులో అల్లంవెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండు మిరియాలను వేయించుకోవాలి. తర్వాత కొబ్బరి తురుము వేసి వేయించాలి. కాస్త చింతపండు రసం పోయాలి. ఎర్రగా మారగానే స్టవ్ మీద నుంచి దించాలి. కాసేపు చల్లారనివ్వండి. తర్వాత మిక్సీ బ్లెండర్ లో వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా నీళ్లతో మెత్తగా రుబ్బుకోవాలి.

Whats_app_banner