Heart Shape Biscuits : ఈ వాలెంటైన్స్ డేకి హార్ట్ షేప్ బిస్కెట్స్ తయారు చేయండి-how to prepare heart shape biscuits in home for this valentines day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Heart Shape Biscuits : ఈ వాలెంటైన్స్ డేకి హార్ట్ షేప్ బిస్కెట్స్ తయారు చేయండి

Heart Shape Biscuits : ఈ వాలెంటైన్స్ డేకి హార్ట్ షేప్ బిస్కెట్స్ తయారు చేయండి

Anand Sai HT Telugu
Feb 11, 2024 03:30 PM IST

Heart Shape Biscuits : వాలెంటైన్స్ డే వచ్చేస్తుంది. మీ ప్రియమైన వారికి ఇష్టమైన రెసిపీలు తయారు చేసి ఇవ్వండి. అందులో భాగంగా హార్ట్ షేప్ బిస్కెట్ తయారు చేయండి.

హార్ట్ షేప్ బిస్కెట్స్ తయారీ
హార్ట్ షేప్ బిస్కెట్స్ తయారీ (Unsplash)

వాలెంటైన్స్ డే దగ్గర పడింది. మీకు ఇష్టమైన వ్యక్తికి ఏదైనా సర్ ప్రైజ్ ఇస్తే చాలా సంతోషపడతారు. మార్కెట్లో దొరికే వాటిని కొని ఇవ్వడం కంటే మీ చేతులతో చేసి ఇచ్చిన రెసిపీ ఏదైనా హ్యాపీగా తింటారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే. ఆ రోజు కోసం చాలా మంది ఎదురుచూస్తూ ఉంటారు. తమ ప్రియమైన వారి పట్ల తమ భావాలను వివిధ మార్గాల్లో వ్యక్తపరుస్తారు. ప్రత్యేక బహుమతి ఇవ్వడం కావచ్చు, విందు ఇవ్వడం చేస్తుంటారు. మీరు హార్ట్ షేప్ బిస్కెట్స్ తయారు చేసి ఇవ్వండి.

భిన్నంగా ఆలోచించే వారు తమకు ఇష్టమైన రెసిపీలను చేసి ఇవ్వొచ్చు. మీ ప్రియమైన వారికి ఇంట్లో తయారుచేసిన హార్ట్ షేప్ బిస్కెట్లను అందించండి. మీ గర్ల్‌ఫ్రెండ్ లేదా బాయ్‌ఫ్రెండ్‌ని హోటల్‌కి తీసుకెళ్లి పార్టీ ఇచ్చే బదులు ఇంట్లోనే రెసిపీ తయారు చేయండి. మీ ప్రేమను ఇలా కూడా వ్యక్తపరచండి. చాలా సంతోషంగా ఫీలవుతారు. హార్ట్ ఆకారంలో ఉండే ఈ బిస్కెట్లు చూడ్డానికి ఎంత అందంగా ఉంటాయో రుచికి కూడా అంతే బాగుంటాయి. హార్ట్ షేప్ బిస్కెట్లు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

వెన్న బిస్కెట్ల రుచిని మరింత మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బిస్కెట్లను మీ నోటిలో కరిగిపోయేలా చేస్తుంది. ఇందు కోసం మీరు సాధారణ సాల్టెడ్ వెన్నని ఉపయోగించవచ్చు. రెసిపీని తయారు చేసేముందు ఒక గిన్నెలో చక్కెరతో బాగా కలపాలి.

చక్కెర హార్ట్ షేప్ బిస్కెట్లకు తీపి రుచిని ఇస్తుంది. సాధారణ గ్రాన్యులేటెడ్ చక్కెర లేదా ఐసింగ్ చక్కెరను ఉపయోగించడం ఉత్తమం. వెన్నతో బాగా కలిపితే రెండూ బాగా పనిచేస్తాయి.

వెన్న, పంచదార కలిపిన తర్వాత మీరు జోడించాల్సిన తదుపరి పదార్థం ఏంటంటే.. గుడ్లు. మీరు గుడ్డు పచ్చసొనను జోడించాలి, గుడ్డు నుండి తెల్లసొనను వేరు చేసి మిగిలిన పచ్చసొనను మాత్రమే ఉపయోగించాలి. ఇది బిస్కట్‌కు రుచిగా ఉండటమే కాకుండా మంచి ఆకారాన్ని కూడా ఇస్తుంది. కాస్త బేకింగ్ పౌడర్ వేసుకోవాలి.

అన్ని పదార్థాలను కలిపిన తర్వాత, చిన్న పరిమాణంలో మైదా పిండిని జోడించాలి. పిండిని కలిపే ముందు పిండిని జల్లెడ పట్టాలి. ఇది పిండిని అతుక్కోకుండా చేస్తుంది.. తర్వాత అన్ని పదార్థాలను కలుపుకోవాలి. పిండిని ఎక్కువగా పొడి పొడిగా లేదా ఎక్కువ మెత్తగా తడపకూడదు.

ఈ కలిపిన పిండిని ప్లేట్‌పై వృత్తాకారంలో వేయాలి. గుండె ఆకారాన్ని ఏర్పరచడానికి బిస్కెట్‌పై మీ బొటనవేలుతో నొక్కాలి. ఈ గుండె ఆకారం లోపల స్ట్రాబెర్రీ జామ్ ఉంచండి. ఇది ఎర్రగా హార్ట్ షేప్ లో కనిపిస్తుంది. తర్వాత వీటిని ఓవెన్‌లో బేక్ చేయాలి. వాలెంటైన్స్ డే రోజున మీ ప్రియమైన వారికి రుచి చూసేందుకు ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు.

వాలెంటైన్స్ డేకి మీ ప్రియమైన వారికి ఇలా ఇంట్లోనే రెసిపీలు చేసి ఇవ్వండి. చాక్లెట్ రెసిపీలు కూడా తయారు చేసుకోవచ్చు. మీరు ప్రేమించే వ్యక్తులు మీరు చేసే రెసిపీని తప్పకుండా ఇష్టంగా తింటారు. మార్కెట్లో దొరికేవాటికంటే మీ చేతి వంట అయితే ఈ వాలెంటైన్స్ డేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు.

Whats_app_banner