Eggs side Effects: ప్రతిరోజూ ఒక గుడ్డు తింటున్నారా? దీనివల్ల లాభాలే కాదు, కొన్ని సైడ్ ఎఫెక్టులు కూడా ఉన్నాయి
Eggs side Effects: ప్రతిరోజూ గుడ్డు తినడం వల్ల శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు అందుతాయి. ఇంతవరకు నిజమే, కానీ ప్రతిరోజూ గుడ్డు తినేవారిలో కొన్ని సైడ్ ఎఫెక్టులు కనిపించే అవకాశం ఉంది.
Eggs side Effects: సంపూర్ణ భోజనం అనగానే ప్రతి ఒక్కరికి గుడ్డు గుర్తుకొస్తుంది. ఎందుకంటే దానిలో మనం శరీరానికి కావలసిన అన్ని పోషకాలు లభిస్తాయి. అన్ని పోషకాలను దట్టించి చిన్న గుడ్డును ప్రతిరోజు తినమని వైద్యులు కూడా సిఫారసు చేస్తారు. ప్రతిరోజూ ఉడకబెట్టిన గుడ్డు తినే వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇది ఎంతోమందికి ఆరోగ్యాన్ని అందిస్తుంది. అయితే కొందరిలో చిన్న చిన్న సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం ఉంది. అందరికీ ఇదే విధంగా అవ్వాలని లేదు. వ్యక్తి వ్యక్తికి ఫలితాలు మారుతూ ఉంటాయి. రోజూ గుడ్డు తినే వారిలో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయేమో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఈ సైడ్ ఎఫెక్టులు కనిపిస్తే ప్రతి రోజూ కాకుండా రెండు రోజులకోసారి గుడ్లు తినడం అలవాటు చేసుకోండి.

రెండు గుడ్లతో బరువు
రోజుకో గుడ్డు తినడం మంచిదే, కానీ కొంతమంది రెండు గుడ్లు తింటూ ఉంటారు. దీనివల్ల కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. గుడ్డులో ఉండే పోషకాలు మనకి కావాల్సినవి. కానీ పచ్చసొనలో మాత్రం కొవ్వు అధికంగా ఉంటుంది. ప్రతిరోజు రెండు గుడ్లు తినడం వల్ల కొంతమందిలో కొలెస్ట్రాల్ చేరిపోతుంది. దీనివల్ల కార్డియోస్కులర్ సమస్యలు వస్తాయి.
గుడ్డుతో అలెర్జీ
తెల్ల సొనలో అవిడిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది బయోటిన్ శోషణను అడ్డుకుంటుంది. గుడ్డులోని తెల్ల సొన అధికంగా తింటే బయోటిన్ లోపం వచ్చే అవకాశం ఉంది. అయితే అందరిలో ఈ సమస్య రావాలని లేదు. కొంతమందిలో మాత్రం ఈ సమస్య కనిపించవచ్చు. గుడ్లులో మంచి కొలెస్ట్రాల్ ఉంటుందని చెబుతారు, అది నిజమే. అయితే గుడ్లు ఎక్కువగా తింటే మాత్రం అదనపు కొవ్వు చేరిపోతుంది. సంతృప్త కొవ్వు వినియోగం తక్కువగా మారి, అది పేరుకు పోతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. కొంతమందికి గుడ్లు తీసుకోవడం వల్ల అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది. గుడ్డు తినగానే దద్దుర్లు వంటి సమస్యలు కనిపిస్తే మీకు అలెర్జీ ఉన్నట్టు లెక్క. అలాంటివారు గుడ్డుకు దూరంగా వెళ్లాల్సిన అవసరం ఉంది.
ప్రతిరోజూ గుడ్డు తినే వారిలో కొంతమందిలో కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇది అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటివి రావచ్చు. గుడ్డు తిన్న వెంటనే ఇలా అవుతుందంటే మీకు గుడ్డు పడడం లేదని అర్థం.
గుడ్డును పూర్తిగా ఉడికించాకే తినాలి. కొంతమంది పచ్చి గుడ్డును తినడం లేదా సరిగా ఉడికించకుండా తినడం చేస్తారు. దీని వల్ల సాల్మోనెల్లా వంటి బ్యాక్టీరియా శరీరంలో చేరవచ్చు. కాబట్టి గుడ్లను పూర్తిగా ఉడికించాకే తినాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, పాలిచ్చే తల్లులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలవారు... గుడ్లను పూర్తిగా వండాకే తినడం ముఖ్యం.
పైన చెప్పిన సమస్యలేవీ మీకు కనిపించకపోతే ఎంచక్కా మీరు రోజూ కోడిగుడ్డును తినవచ్చు. అయితే రోజుకో గుడ్డుతోనే ఆపేయాలి. కొంతమంది రెండు, మూడు గుడ్లు తింటూ ఉంటారు.. అలా తింటు మాత్రం సులువుగా బరువు పెరిగిపోతారు.