Banana Dosa Reicpe : రుచికరమైన అరటిపండు దోసె.. చాలా సింపుల్‌గా చేయెుచ్చు
Banana Dosa : అరటిని చాలా రకాల వంటల్లో వాడుతుంటారు. దీని రుచి కూడా బాగుంటుంది. అయితే అరటి పండుతో చేసిన దోసెలు ఎప్పుడైనా తిన్నారా?
అరటిపండు మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు చాలా సహాయపడుతుంది. దీన్ని రోజూ తింటే శరీరానికి మరింత శక్తి వస్తుంది. అరటిని వివిధ రకాల వంటకాల్లో వాడుతుంటారు. అరటితో చేసే వంటలు చాలా రుచిగా ఉంటాయి. అయితే ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలోనూ అరటిని తినొచ్చు. నేరుగా తినకుండా రెసిపీ రూపంలో లాగించేయెుచ్చు. అందుకోసం అరటితో దోసెను తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉదయం రోజూ ఒకేలాగా బ్రేక్ ఫాస్ట్ తిని తిని బోర్ కొడితే అరటి దోసెను చేసుకోవచ్చు. అరటి దోసెను చేయడం కూడా చాలా సింపుల్. నిమిషాల్లో అరటి దోసెను తయారు చేయవచ్చు. అరటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. దీనిని అనేక వంటకాల్లో వాడుతారు.
మనం అరటితో బనానా అల్వా, బనానా మిల్క్ షేక్, బనానా కేక్, బనానా దోస, బనానా బోండా వంటివి చేసుకోవచ్చు. ఇప్పుడు అరటి అరటి దోసె ఎలా చేయాలో తెలుసుకుందాం..
అరటి దోసెకు కావాల్సిన పదార్థాలు
దోసె పిండి - 1 కప్పు,
పాలు - 1/2 కప్పు,
అరటి - 3 లేదా 4 ముక్కలు,
తురిమిన కొబ్బరి
తరిగిన బెల్లం
జీడిపప్పు
యాలకుల పొడి,
ఉప్పు
బేకింగ్ పౌడర్-కొద్దిగా
మంచి సువాసన కోసం నెయ్యిని జోడించవచ్చు. అవసరమైన మొత్తంలో నెయ్యి ఉంచండి.
బనానా దోసె తయారీ విధానం
ఒక గిన్నెలో అరటిపండు ముక్కలను ఉంచండి. తరిగిన బెల్లం, తురిమిన కొబ్బరి, యాలకుల పొడి, జీడిపప్పు, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి.
అందులో చిటికెడు ఉప్పు, దోసె పిండి, పాలు వేసి బాగా కలిపి 10 నిమిషాలు నానబెట్టాలి.
10 నిమిషాల తర్వాత పొయ్యి మీద దోసె పాన్ పెట్టాలి. ఆ తర్వాత అందులో నెయ్యి పోయాలి.
ముందుగా కలుపుకొన్న పిండిని దోసెలా పోసుకోవాలి. రెండు వైపులా బాగా ఉడికిన తర్వాత దింపితే రుచికరమైన బనానా దోసె రెడీ.
పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలనుకుంటే అరటిపండు దోసె వేసి ఇవ్వవచ్చు. వారు తినడానికి ఇష్టపడతారు.