Diabetes: ముందు ఇవి తింటే షుగర్ తగ్గుతుందంటున్న వైద్యులు, అదెలాగో చూడండి-how eating protein and vegetables before carbohydrated decreases diabetes doctor explains ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetes: ముందు ఇవి తింటే షుగర్ తగ్గుతుందంటున్న వైద్యులు, అదెలాగో చూడండి

Diabetes: ముందు ఇవి తింటే షుగర్ తగ్గుతుందంటున్న వైద్యులు, అదెలాగో చూడండి

Koutik Pranaya Sree HT Telugu
Aug 30, 2024 07:00 PM IST

Diabetes: కార్బోహైడ్రేట్లను తీసుకునే ముందు ప్రోటీన్, కూరగాయలు ఎందుకు తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ విధానం వల్ల నిజంగా ఎలాంటి ఫలితాలుంటాయో తెల్సుకుని పాటించండి.

డయాబెటిస్ మీద ఆహార క్రమం ప్రభావం
డయాబెటిస్ మీద ఆహార క్రమం ప్రభావం (Unsplash)

డయాబెటిస్ ఒక అనేది దీర్ఘకాలిక అనారోగ్యం. క్లోమం శరీరానికి అవసరమైనంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోతుంది. లేదా కొన్నిసార్లు, శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ను ఉపయోగించలేకపోతుంది. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇన్సులిన్ అవసరం.

డయాబెటిస్‌లో ఉండే అత్యంత సాధారణ లక్షణాలు అలసట, బరువు తగ్గడం, దృష్టిలో అస్పష్టత, అధిక దాహం, తరచుగా మూత్రవిసర్జన వెళ్లడం. కొన్ని సార్లు, ఎటువంటి లక్షణాలూ ఉండకపోవచ్చు కూడా. డయాబెటిస్‌లో రెండు రకాలు ఉన్నాయి. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. అయినప్పటికీ, సరైన జీవనశైలి, ఆహార మార్పులతో డయాబెటిస్ లక్షణాలను నియంత్రించుకోవచ్చు. ఫ్రీడమ్ ఫ్రమ్ డయాబెటిస్ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రమోద్ త్రిపాఠి హెచ్టి లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనం తినేటప్పుడు పాటించే ఆహార క్రమంలో మార్పు డయాబెటిస్ లక్షణాలను ఎదుర్కోవడంలో ఎలా సహాయపడుతుందో వివరించారు.

ప్రొటీన్లు, కూరగాయలు ముందు తినడం:

సాధారణంగా భారతీయ ఆహార విధానం ప్రకారం ముందు కార్బోహైడ్రేట్లుండే అన్నం లేదా రోటీ తిన్న తర్వాత సలాడ్లు, ప్రొటీన్లు తీసుకుంటారు. భోజనాన్ని కూరగాయల ముక్కలతో మొదలు పెట్టరు. "చక్కెర స్థాయులను నియంత్రించడంలో మనం తినే ఆహార క్రమం గణనీయమైన పాత్ర పోషిస్తుంది. కార్బోహైడ్రేట్లకు ముందు ప్రోటీన్, కూరగాయలు తినడం వల్ల ప్రయోజనం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రోటీన్, కూరగాయలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి, ఇవి రక్త ప్రవాహంలోకి గ్లూకోజ్ విడుదలను నెమ్మది చేస్తాయి. కార్బోహైడ్రేట్లుండే భోజనం తిన్న తర్వాత రక్తంలో వచ్చే గరిష్ఠ చక్కెర స్థాయులను ఇలా చేసి కాస్తైనా అదుపులో ఉంచుకోవచ్చు " అని డాక్టర్ ప్రమోద్ త్రిపాఠి వివరించారు.

ఆహారం తినే క్రమం ప్రభావం

ఇలా తినే ఆహార క్రమాన్ని మార్చడం వల్ల ఎలాంటి ఉపయోగాలుంటాయో తెల్సుకోండి.

మెరుగైన గ్లూకోజ్ నియంత్రణ: కూరగాయలు , ప్రొటీన్ జీర్ణం అవ్వడానికి సమయం పడుతుంది. నెమ్మదిగా జీర్ణక్రియ జరుగు జరగడం అంటే.. రక్తంలో చక్కెర స్థాయులు అమాంతంగా పెరిగే ప్రమాదం తగ్గుతుంది. ఇది మెరుగైన గ్లూకోజ్ స్థాయుల నియంత్రణకు సాయపడుతుంది.

కడుపు నిండుగా ఉండటం: ప్రోటీన్, ఫైబర్ మీకు ఎక్కువసేపు కడుపు నిండినట్లున్న అనుభూతిని కలిగించడంలో సహాయపడతాయి. దీంతో అతిగా తినడం లేదా అనారోగ్యకరమైన ఆహారాల జోలికి పోయే అవకాశాలు తగ్గుతాయి.

పోషక సమతుల్యత: ప్రోటీన్, కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మినరళ్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో సహా అవసరమైన పోషకాల సమతుల్యతను శరీరానికి ఇవ్వగలుగుతారు. దీంతో డయాబెటిస్ తో పాటే పూర్తి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

టాపిక్