Exam tips: పరీక్షల కాలం.. ఈ 12 టిప్స్‌తో ఒత్తిడికి టాటా చెప్పేయండి
Exam tips: పరీక్షల కాలంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకుని ఫోకస్ పెంచేందుకు ఈ 12 టిప్స్ తెలుసుకోండి.
ఎగ్జామ్స్ వస్తూనే విద్యార్థులకు ఒత్తిడిని వెంట తెస్తాయి. అయితే భయపడాల్సిన పని లేదు. కొద్దిగా ప్లాన్ చేసుకుంటే మీరు పరీక్షల్లో విజయవంతంగా పూర్తిచేస్తారు. విద్యార్థులకు ఎగ్జామ్స్ విషయంలో దైనందిన ప్రణాలిక అవసరం. దీని వల్ల విద్యార్థులకు వారి చదువు తేలికవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ప్రతి సబ్జెక్టుకూ తగినంత సమయమూ కేటాయిస్తారు. మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. చదువు, వ్యాయామం, ఇతర యాక్టివిటీలను బాలెన్స్ చేసుకోవడం వీలవుతుంది.
ఎగ్జామ్స్‌లో సక్సెక్స్‌కు రోజువారీ ప్రణాళిక ఇలా
1. ఎర్లీగా నిద్ర లేవండి
త్వరగా నిద్ర లేస్తే మీ చదువులో సక్సెస్ సాధించేందుకు సరైన అడుగు వేసినట్టే లెక్క. ఇందుకు అలారం పెట్టుకుని ప్రశాంతంగా నిద్ర పోండి. సమయానికి లేచి ఉదయం పూట కాలకృత్యాలు తీర్చుకుని కార్యరంగంలోకి దూకండి.
2. రోజు ఎలా గడపాలో ప్లాన్ చేసుకోండి
ఎగ్జామ్స్ కోసం చదవడం ప్రారంభించే ముందు కొన్ని నిమిషాలు మీరు ఆ రోజు ఏం చేయాలనుకుంటున్నారో ప్లాన్ చేయండి. చదువు, వ్యాయామం, ఇతర బాధ్యతలు అన్నీ ఈ ప్లాన్‌లో చేర్చండి. తద్వారా మీ కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా జరిగిపోతాయి.
3. వ్యాయామం చేయండి
పరీక్షలు ఉన్నాయని వ్యాయామం చేయడం మానొద్దు. వ్యాయామం వల్ల శారీరకంగానే కాకుండా మీరు మానసికంగా స్ట్రాంగ్‌గా ఉంటారు. సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. కొద్దిసేపు నడక, లేదా యోగా కూడా మీ మనసును తేలికపరుస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. చదువుకునేందుకు తగిన శక్తినిస్తుంది. ఏకాగ్రతకు వీలవుతుంది.
4. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అవసరం
పరీక్షల సమయంలో తప్పనిసరిగా ఉదయం పూట అల్పాహారం మంచి పోషకాల కూడినది తీసుకోవాలి. అది మీకు తగిన శక్తినిస్తుంది. మీరు ఫోకస్ చేసేందుకు వీలవుతుంది.
4. విరామం తీసుకోవడంలో తప్పులేదు
మీ చదువు మీ మెదడుకు ఎక్కాలంటే మధ్యమధ్య బ్రేక్ కూడా తీసుకోవాలి. ఈ బ్రేక్స్ సమయంలో వీలైతే మ్యూజిక్ వినడమో, వ్యాయామం చేయడమో లేదా రిలాక్స్ అవడమో చేయండి.
5. ఉదయం పూట చదవండి
ఉదయం పూట మీ బ్రెయిన్ చాలా చురుగ్గా పనిచేస్తుంది. సవాలుతో కూడుకున్న సబ్జెక్టులను మీ బ్రెయిన్ ఫ్రెష్‌గా ఉన్నప్పుడు ఉదయం పూటే రివిజన్ చేసుకోండి.
6. ప్రాధాన్య క్రమాన్ని ఎంచుకోండి
పరీక్షల సమయంలో అన్ని సబ్జెక్టులకు సమానంగా సమయం కేటాయించలేం. కొన్ని సబ్జెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. అవి అర్థం చేసుకోవడంలో సవాలుతో కూడుకున్నవై ఉండొచ్చు. ఈ సబ్జెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడం, తగిన సమయం కేటాయించడం అవసరం.
7. తగినంత నిద్ర అవసరం
పరీక్షల సమయంలో మీ బ్రెయిన్ సరిగ్గా తన విధులు నిర్వర్తించాలంటే నిద్ర చాలా అవసరం. రాత్రి కనీసం 8 గంటలు నిద్ర కోసం కేటాయించండి.
8. వాయిదాలు వద్దు
రాత్రి చదువుకోవచ్చులే, రేపు చదువుకోవచ్చులే అంటూ వాయిదాలు వేస్తే మీపై చివరి నిమిషంలో తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది. చాలా మంది విద్యార్థులు రేపు పరీక్ష అనేవరకూ చదవరు. దీని వల్ల మీ ఫోకస్ మిస్ అవుతుంది. పరీక్షల్లో మంచి మార్కులు పొందడంలో కష్టమవుతుంది.
9. స్థిరత్వం అవసరం
చివరి కొన్ని రోజుల్లో చదివేద్దాంలే అనుకోవద్దు. పరీక్షలకు ముందు నుంచీ ప్రణాళికాబద్ధంగా స్థిరంగా చదువుతూ ఉండాలి. అప్పుడే విజయవంతంగా పరీక్షలు పూర్తిచేస్తారు.
10. గత ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేయండి
ప్రాక్టీస్ మేక్స్ పర్‌ఫెక్ట్ అన్న నానుడి తెలిసిందే కదా. పాత ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు పరీక్ష రాయడంపై పట్టు సాధిస్తారు. ప్రశ్నావళి ఎలా ఉంటుందో మీకు అర్థం అవుతుంది. ఎలాంటి అప్రోచ్ అవసరమో కూడా తెలుస్తుంది.
11. కనెక్ట్ అయి ఉండండి
పరీక్షలనగానే స్నేహితులు, క్లాస్‌మేట్స్‌కు టాటా చెప్పేయకండి. వారితోపాటు టీచర్లు, కుటుంబ సభ్యులకు నిత్యం టచ్‌లో ఉంటే విలువైన సలహాలు, సపోర్ట్, ప్రోత్సాహం లభిస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
12. రివార్డు ఇచ్చుకోండి
రోజంతా చదివి అలసిపోయి ఉంటారు. మీరు తగిన విరామాలు తీసుకుంటూ ఉల్లాసంగా ఉండడం కూడా అవసరం. మీ కఠోర శ్రమకు మీరు రివార్డు ఇచ్చుకోండి.