Rose Day Wishes : హ్యాపీ రోజ్ డే.. ప్రియమైనవారికి శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి-happy rose day 2024 greetings quotes whatsapp status facebook messages love quotes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rose Day Wishes : హ్యాపీ రోజ్ డే.. ప్రియమైనవారికి శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి

Rose Day Wishes : హ్యాపీ రోజ్ డే.. ప్రియమైనవారికి శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి

Anand Sai HT Telugu
Feb 06, 2024 03:00 PM IST

Rose Day Wishes : ప్రేమికుల వారం మెుదలైంది. ఈ వాలెంటైన్స్ వీక్‌లో మెుదటి రోజు అంటే ఫిబ్రవరి 7న రోజ్ డే. మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు చెప్పండి.

రోజ్ డే విషెస్
రోజ్ డే విషెస్ (Unsplash)

ఫిబ్రవరి నెల ప్రపంచ ప్రజలందరికీ ఒక వేడుక. ఎందుకంటే ప్రేమే ప్రజలను నడిపిస్తుంది. ఈ ప్రపంచం ప్రేమతో నడుస్తుంది. ఫిబ్రవరి నెలలోనే లవ్ వీక్, వాలెంటైన్స్ డేగా పెద్దగా జరుపుకొంటారు. తమ ప్రియమైనవారి పట్ల కలిగి ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే అయితే, ఫిబ్రవరి 7న రోజ్ డేతో వాలెంటైన్స్ వీక్ ప్రారంభమవుతుంది. దాని తర్వాత ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే, చివరగా వాలెంటైన్స్ డే ఉంటాయి.

వాలెంటైన్ వీక్ దగ్గరకు వచ్చింది.. కొందరు ప్రేమ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటే.. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు మాత్రం అందుకు భిన్నంగా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నారు. అయితే దీనికి తొలి అడుగు రోజ్ డే. ఈ రోజు మీ ప్రియమైన వారికి విషెస్ చెప్పండి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పువ్వుల అందానికి సమానమైన అందం నీది.. ఎందుకంటే నువ్వు నా ప్రేమ గులాబీ కాబట్టి.. హ్యాపీ రోజ్ డే

గులాబీలు ఎరుపు, పసుపు, తెలుపు అనేక రంగులు కావచ్చు.. కానీ నా జీవితంలో నీ ప్రేమ ఒక్కటే.. ప్రియతమా! హ్యాపీ రోజ్ డే

ఒంటరిగా ఉన్న నా హృదయంలో మెుక్కవై మెులిచావు.. గులాబీవై పూశావు.. సువాసనతో ఆనందపరిచావు.. నవ్వుతూ ఆనందపరిచావు.. Happy Rose Day 2024

కాచే వెన్నెల్లో నీ రూపాన్ని ఆస్వాదిస్తున్నా..

పూచే గులాబీల్లో నీ చిరునవ్వులే గమనిస్తున్నా..

వీచే గాలిలో నీ పరిమళాలను శ్వాసిస్తున్నా..

నీ జత కోసం ప్రేమ పిపాసిలా విహరిస్తున్నా..

అందమైన నీకు Happy Rose Day

నీ గురించి..

ఏదో రాయలని మెుదలు..

ఏదీ రాయలేక దిగులు..

పేజీల నిండా పిచ్చి గీతలు..

వాటిలోనే పలుకుతా నా భావ కవితలు

ఈరోజు అందుకో ఈ ఎర్ర గులాబీలు

Happy Rose Day

నా కంటికి ఎంతో ఆశ.. నీ కనుపాపగా మారిపోవాలని..

నా నీడకి ఎంతో ఆశ.. నీ నీడగా తోడు నడవాలని..

నా చేతికి ఎతో ఆశ.. నీ చేతిలో చేయిగా ఉండిపోవాలని..

నా మనసుకు ఎంతో ఆస.. నీ మనసుతో ముడిపోవాలని..

నా దగ్గర ఉన్న గులాబీకి పువ్వుకు ఎంతో ఆశ.. నీ నవ్వుగా మారిపోవాలని..

Happy Rose Day 2024

ఈ రోజు నుండి నా హృదయం నీకే చెందుతుందని ఈ గులాబీ సాక్షిగా ప్రకటిస్తున్నాను. నేను నీతో అందమైన గులాబీలాంటి జీవితాన్ని కోరుకుంటున్నాను. రోజ్ డే శుభాకాంక్షలు

ఈ గులాబీ ప్రేమకు చిహ్నం. కష్టాలు, సుఖాలు కలిసి ఉన్నప్పుడే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఈ గులాబీ ఆనందం, దుఃఖానికి కూడా చిహ్నం. హ్యాపీ రోజ్ డే

గులాబీ పువ్వు చుట్టు ముల్లు ఉంటాయి. నీ జీవితంలో ఏ కష్ట సమయంలోనైనా నీతో ఉంటానని హామీ ఇస్తున్నా.. Happy Rose Day

నా జీవితాన్ని గులాబీలా రంగులమయం చేసిన మీకు రోజ్ డే శుభాకాంక్షలు

ప్రేమ అనేది ముళ్ళ మధ్యలో పువ్వు లాంటిది, చీకటి మధ్యలో సూర్యకాంతి లాంటిది. నీ నుంచి నాకు ఆ ప్రేమ కావాలి Happy Rose Day 2024

ప్రేమలో ప్రయాణం అందమైన గులాబీ లాంటిది. ఆ గులాబీ దొరకాలంటే ముందుగా కష్టాలనే ముళ్లను దాటాలి. నా ప్రేమకు గులాబీ దినోత్సవం శుభాకాంక్షలు

ఈ గులాబీతో నా హృదయం నుండి నీకు ప్రేమను పంపుతున్నాను.. హ్యాపీ రోజ్ డే

గులాబీల కింద ఉండే ముళ్ళు ప్రేమలో పడే కష్టాలను గుర్తుచేస్తాయి. కానీ చివరికి గులాబీ లాంటి ప్రేమ దక్కుతుంది.. హ్యాపీ రోజ్ డే