Mango For Skin and Hair : మామిడితో హెయిర్, ఫేస్ మాస్క్‌లు.. ఎలా చేయాలి? -hair and face masks with mangoes here are some home remedies for you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mango For Skin And Hair : మామిడితో హెయిర్, ఫేస్ మాస్క్‌లు.. ఎలా చేయాలి?

Mango For Skin and Hair : మామిడితో హెయిర్, ఫేస్ మాస్క్‌లు.. ఎలా చేయాలి?

HT Telugu Desk HT Telugu
Apr 04, 2023 04:10 PM IST

Mango For Skin and Hair : మామిడి సీజన్‌ వచ్చింది. మామిడి పండుతో ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించి.. మీ జుట్టు, మీ ముఖాన్ని అందంగా తయారు చేసుకోవచ్చు. మామిడి పండ్లలో అధిక స్థాయిలో విటమిన్లు సి, నేచురల్ ఫ్రూట్ యాసిడ్ ఉంటాయి. ఇవి మృదువైన చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడతాయి.

మామిడితో చిట్కాలు
మామిడితో చిట్కాలు

వేసవిలో వచ్చే.. మామిడి పండ్లను తినడం చాలా మందికి ఇష్టం. అయితే ఇది ఆరోగ్యంతోపాటుగా అందానికి(Beauty) కూడా ఉపయోగపడుతుంది. మీ ముఖం లేదా జుట్టు(Hair) మీద ఈ మామిడిని ఉపయోగించవచ్చు.

మామిడి పండ్ల(Mango Fruits)లో అధిక స్థాయిలో విటమిన్ సి, సహజ పండ్ల ఆమ్లాలు ఉంటాయి. ఇవి మీకు మృదువైన చర్మాన్ని(Smooth Skin) పొందడంలో సహాయపడతాయి. ఇందులోని పొటాషియం, కాల్షియం, ఇతర పోషకాలు మీ జుట్టు సమస్యలను(Hair Problems) ఎదుర్కోవటానికి సహాయపడతాయి. కొన్ని హెయిర్ మాస్క్‌లు(Hair Mask), ఫేస్ మాస్క్‌లు(Face Mask) ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి.

హెయిర్ మాస్క్‌లు

కొన్ని తరిగిన మామిడికాయలను తీసుకుని వాటిని ఫోర్క్ ఉపయోగించి మెత్తగా చేసి, రెండు కలబంద ఆకుల జెల్‌ను తీసి మామిడితో కలపండి. ఒక టేబుల్ స్పూన్ కాస్టర్ ఆయిల్ మిక్స్ చేసి మీ జుట్టు(Hair)కు అప్లై చేయండి. ఒక గంట పాటు అలాగే ఉంచి తేలికపాటి షాంపూతో కడగాలి. వారానికి ఒకసారి ఈ మాస్క్‌ను అప్లై చేయండి. మంచి ఫలితం ఉంటుంది.

ఒక గిన్నెలో తరిగిన మామిడికాయను వేసి రెండు తరిగిన అరటిపండ్లను(Banana) కలపండి. రెండు పండ్లను బాగా కలపండి. టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ కొన్ని చుక్కలను కలపండి. ఈ మిశ్రమాన్ని మీ స్కాల్ప్‌కి అప్లై చేసి ఒక గంట పాటు అలాగే ఉంచండి. తేలికపాటి షాంపూ ఉపయోగించి శుభ్రం చేసుకోండి. వారానికి రెండు సార్లు అప్లై చేయండి.

ఒక గిన్నెలో ఒక పండిన మామిడికాయ గుజ్జును తీసుకోండి. ఇంకో గిన్నెలో గుడ్డు(Egg) సొన, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు(Curd) కలపాలి. ఇప్పుడు మెత్తని మామిడికాయలో పెరుగు మిశ్రమాన్ని పోసి బాగా కలపాలి. డ్రై హెయిర్‌లో మాస్క్‌ను సున్నితంగా మసాజ్ చేసి, షవర్ క్యాప్‌తో కప్పండి. మీ తలని వెచ్చని టవల్‌తో చుట్టి గంటసేపు అలాగే ఉంచండి. గోరువెచ్చని నీరు, తేలికపాటి షాంపూతో కడగాలి.

ఫేస్ మాస్క్‌లు

ఒక గిన్నెలో నాలుగు టేబుల్ స్పూన్ల మామిడిపండు గుజ్జు, రెండు టీస్పూన్ల తేనె, ఒక టేబుల్ స్పూన్ బాదం నూనె వేసి కలపాలి. ముఖానికి మాస్క్ వేయండి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఒక గిన్నెలో పండిన మామిడికాయ గుజ్జును పోసి అందులో రెండు టీస్పూన్ల ముల్తానీ మిట్టి(multani mitti), రెండు టీస్పూన్ల రోజ్ వాటర్, ఒక టీస్పూన్ పెరుగు వేసి కలపాలి. మాస్క్‌ని అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఒక గిన్నెలో నాలుగు టేబుల్ స్పూన్ల మామిడికాయ గుజ్జు, రెండు టేబుల్ స్పూన్ల బేసన్, ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ పెరుగు కలపాలి. మీ ముఖానికి మాస్క్‌ను పూయండి. ఎండిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

Whats_app_banner