Crime: మామిడికాయ పచ్చడి పెట్టిన మంట.. ఓ ఇల్లాలి ప్రాణమే పోయింది…
మామిడికాయ పచ్చడి విషయంలో దారి తీసిన గొడవ.. ఓ ఇల్లాలి ప్రాణం పోయేందుకు కారణమైంది. ఈ విషాద ఘటన కరీనంగర్ జిల్లా రామడుగు మండల పరిధిలో జరిగింది.
భార్య, భర్త.. వీరికి ఇద్దరు కుమారులు. భర్త ఆటో నడిపితే.. భార్య బీడీలు చేస్తుంది. సీన్ కట్ చేస్తే ఇద్దరి మధ్య చిన్న గొడవ వచ్చింది. అదేదో డబ్బులు, ఇతర సమస్యలు కాదు.. జస్ట్ మామిడికాయ పచ్చడి కొసం మాత్రమే.! మాటామాట పెరిగింది.. కానీ ఆ ఇల్లాలి అంతలోనే మేటర్ ను సీరియస్ గా తీసుకుంది. ఇంకేముంది వంటింట్లోకి వెళ్లి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన కరీనంగర్ జిల్లా రామడుగు మండలంలోని గోపాల్‌రావుపేట జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం...
రామడుగు మండలంలోని గోపాల్‌రావుపేటకు చెందిన సాయిప్రియ(28), తిరుపతి దంపతులు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. భర్త తిరుపతి ఆటో నడుపుతాడు. సాయిప్రియ బీడీలు చేస్తోంది. గురువారం సాయంత్రం మామిడికాయ పచ్చడి విషయంలో దంపతుల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో క్షణికావేశంలో సాయిప్రియ వంట గదిలోకి వెళ్లి కిరోసిన్ పొసుకుని నిప్పు అంటించుకుంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.
మంటలు ఆర్పివేసే క్రమంలో భర్త తిరుపతి, తోటి కోడలు కూడా గాయపడ్డారు. సాయిప్రియను కరీంనగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
టాపిక్