Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి
Green mirchi powder: పచ్చిమిర్చి ఎప్పటికప్పుడు దొరకకపోతే వీటిని పొడిలా చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కారం లాగే కాస్త పొడిని చల్లుకుంటే సరిపోతుంది.
Green mirchi powder: కూర, పచ్చడి, చారు, సాంబారు ఏదైనా పచ్చిమిర్చి ఉండాల్సిందే. పచ్చిమిర్చి వాసనకు ఆ వంటకం రుచి అదిరిపోతుంది. అయితే ఒక్కొక్కసారి పచ్చిమిర్చి ధర పెరిగిపోవడం, అవి దొరక్కపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు వాటిని పొడి రూపంలో ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటే వాటి ధర పెరిగినా కూడా ఈ పచ్చిమిర్చి పొడిని వాడుకోవచ్చు. పచ్చిమిర్చి పొడిని చేయడం వల్ల ఇగుర్లు చాలా టేస్టీగా వస్తాయి. మంచి రంగు కూడా వస్తాయి. పచ్చిమిర్చి పొడి ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.
పచ్చిమిరపకాయల పొడి రెసిపీ
1. పచ్చిమిరపకాయలను అధికంగా తీసుకోవాలి.
2. వాటి తొడిమెలు తీసేసి శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి.
3. ఒక్కో పచ్చిమిరపకాయను నిలువుగా నాలుగు చీలికలుగా కోయాలి.
4. తర్వాత వాటిని ఒక పొడవాటి వస్త్రం పైన విడివిడిగా ఆరబెట్టాలి.
5. ఇంట్లోనే ఫ్యాన్ కిందే వీటిని ఆరబెట్టాలి.
6. ఎండలో ఆరబెడితే రంగు మారిపోయే అవకాశం ఉంది.
7. అవి విరగకుండా అలా చక్కగా ఎండుతాయి.
8. ఇవి ఎండడానికి కనీసం మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది.
9. ఆ తర్వాత వీటిని మెత్తగా గ్రైండ్ చేస్తే పచ్చిమిర్చి కారం రెడీ అవుతుంది.
10. ఆ కారాన్ని ఒక సీసాలో వేసుకొని భద్రపరచుకోవాలి.
11. ఇలా చేస్తే ఎర్ర కారంలాగే ఏడాది పాటు నిల్వ ఉంటుంది.
12. పచ్చిమిర్చికి బదులుగా వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు.
13. పచ్చిమిర్చిలో ఉండే పోషకాలు కూడా ఏమాత్రం తగ్గిపోవు.
14. ఒకసారి ఇలా పచ్చిమిర్చి పొడిని వాడి చూడండి
పచ్చిమిరపకాయల్లో కూడా ఎన్నో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా తినాల్సిన అవసరం ఉంది. ఎండుమిర్చితో పోలిస్తే పచ్చిమిర్చిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ పచ్చిమిరపకాయలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా మగవారిలో ప్రోస్టేట్ సంబంధిత సమస్యలు రావు. ప్రొస్టేట్ క్యాన్సర్ ను తగ్గించే అడ్డుకునే శక్తి కూడా పచ్చిమిరపకాయలకు ఉంది.