Gardening Lowers Cancer । తోటపని చేసే వారికి క్యాన్సర్ వచ్చే ముప్పు తక్కువ, తేల్చిన తాజా సర్వే!-gardening can help lower cancer risk and boost mental health says study ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gardening Lowers Cancer । తోటపని చేసే వారికి క్యాన్సర్ వచ్చే ముప్పు తక్కువ, తేల్చిన తాజా సర్వే!

Gardening Lowers Cancer । తోటపని చేసే వారికి క్యాన్సర్ వచ్చే ముప్పు తక్కువ, తేల్చిన తాజా సర్వే!

HT Telugu Desk HT Telugu
Jan 16, 2023 06:18 PM IST

Gardening Helps Lower Cancer Risk: తోటపని చేయడం ద్వారా క్యాన్సర్ ముప్పు తక్కువ ఉంటుంది, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఎందుకో తెలుసుకోండి.

Gardening Helps Lower Cancer Risk
Gardening Helps Lower Cancer Risk (Getty Images)

మీ మొక్కలు పెంచడం, తోటపని చేయడం ఇష్టమా? అయితే మీకొక శుభవార్త, అదేమిటంటే తోటపని చేయడం వలన చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ముప్పు నుంచి కూడా బయటపడవచ్చునని తాజా పరిశోధనలో తేలింది.

చాలా మందికి గార్డెనింగ్ ఒక అలవాటుగా ఉంటుంది, కొంతమంది వ్యాయామం చేయడం, మరికొందరికి నిరంతరం కొత్త వ్యక్తులను కలవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం వంటివి అలవాట్లుగా ఉంటాయి. నిజానికి ఇవన్నీ ప్రతి వ్యక్తి అలవర్చుకోవాల్సిన మంచి అలవాట్లు. అయితే ఇవన్నీ అలవాట్లు కూడా ఒక్క తోటపని చేయడంలో భాగంగా ఉంటాయని పరిశోధకుల అభిప్రాయం.

ఇటీవల నిర్వహించిన CU బౌల్డర్ పరిశోధన ప్రకారం, తోటపని వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర మానసిక ఆరోగ్య రుగ్మతలను నివారించడంలో కమ్యూనిటీ గార్డెనింగ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని CU బౌల్డర్‌లోని పర్యావరణ అధ్యయనాల విభాగంలో ప్రొఫెసర్ అయిన సీనియర్ జిల్ లిట్ అన్నారు.

Gardening Helps Lower Cancer Risk- తోటపని చేస్తే క్యాన్సర్ ముప్పు తక్కువ

అమెరికన్ క్యాన్సర్ సొసైటీ తరఫున CU బౌల్డర్‌లోని ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ విభాగం ప్రొఫెసర్ జిల్ లిట్ పరిశోధన చేశారు. కొంతమంది 40 ఏళ్లు దాటినప్పటికీ ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండటం గమనించారు. వారంతా తోట పనిచేసే వారు. వారి ఆరోగ్య రహస్యాన్ని తెలుసుకునేందుకు ఆ పరిశోధకురాలు 291 మంది మధ్య వయస్కులను తన అధ్యయనం కోసం నిర్మించుకున్నారు. అందులో సగం మందికి తోటపని అప్పజెప్పగా, మిగతా సగం మందికి వారి మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పజెప్పారు. అలా ఒక సంవత్సరం పాటు అధ్యయనం చేయగా, తోటపని చేసే సగం మంది ఆరోగ్యం చాలా మెరుగుపడింది, వారి అనారోగ్య సమస్యలు నయం అయ్యాయి. క్యాన్సర్ ప్రమాదం కూడా చాలా వరకు తగ్గిపోయింది, అంతేకాకుండా వారిలో ఒత్తిడి, ఆందోళన స్థాయిలు గణనీయంగా తగ్గడం కూడా గమనార్హం. ఈ పరిశోధన ఫలితాలు లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

కారణాలు ఇవే..

కమ్యూనిటీ గార్డెనింగ్ ప్రారంభించిన వారిలో శారీరక శ్రమ పెరిగింది. అంతేకాకుండా పరిశోధన కాలంలో ఏడాది పాటు వారు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవనం సాగించారు. అలాగే వారు పండించిన కూరగాయలు, శాకాహారం ఎక్కువ తినగలిగారు. అంటే వారి ఆహారంలో ఫైబర్ కంటెంట్ పెరిగింది. ఈ రకంగా వారికి ఆరోగ్యకరమైన ఆహారం, తోటపని శారీరక శ్రమతో కూడుకున్నది కాబట్టి క్రమం తప్పని వ్యాయామం జరిగింది. ఈ రకంగా వారి శారీరక ఆరోగ్యం మెరుగుపడింది.

ఇకపోతే, గార్డెనింగ్ పని అనేది ఎంతో ఆహ్లాదకరమైనది, రోజూ ఎంతో మందిని కలుస్తుంటారు. చాలా మందితో కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది, ఇలా వారి మధ్య సామాజిక సంబంధాలు కూడా బలపడ్డాయి. ఈ అంశాలు వారిలో ఒత్తిడి, ఆందోళనలు తగ్గించాయి, వారి శరీరాకృతి మెరుగుపడింది, ఇవన్నీ వారి మానసిక స్థితిగతులను మెరుగుపరిచాయి, మొత్తంగా వారి శ్రేయస్సు పెరిగిందని పరిశోధకురాలు జిల్ లిట్ అభిప్రాయపడ్డారు.

సంబంధిత కథనం