Gardening | మొక్కలకు కేవలం నీరు పోయడమే కాదు, కొద్దిగా మీ ప్రేమనూ పంచండి! -not just watering the plants give your love and care too ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Not Just Watering The Plants, Give Your Love And Care Too

Gardening | మొక్కలకు కేవలం నీరు పోయడమే కాదు, కొద్దిగా మీ ప్రేమనూ పంచండి!

Manda Vikas HT Telugu
Feb 28, 2022 02:19 PM IST

మనుషుల్లాగే మొక్కలకు కూడా సరైన పోషణతో పాటు, కొద్దిగా ప్రేమ అవసరం.చల్లని స్వచ్ఛమైన గాలి, కనువిందు చేసే పచ్చదనం, కమ్మని ఫలాలు, మధురమైన సువాసనలు అందించే మొక్కలు మన ఇంట్లో ఉంటే వాటి ద్వారా లభించే ఒకరకమైన సంతృప్తి, మానసిక ప్రశాంతత మాటల్లో చెప్పలేనిది.

Gardening
Gardening (Shutterstock)

ఎంతపెద్ద ఇల్లు ఉన్నా కూడా ఇంటి చుట్టూ ఒక్కమొక్క లేకపోతే ఆ ఇంటికి ఎలాంటి జీవకల ఉండదు. చల్లని స్వచ్ఛమైన గాలి, కనువిందు చేసే పచ్చదనం, కమ్మని ఫలాలు, మధురమైన సువాసనలు అందించే మొక్కలు మన ఇంట్లో ఉంటే వాటి ద్వారా లభించే ఒకరకమైన సంతృప్తి, మానసిక ప్రశాంతత మాటల్లో చెప్పలేనిది. అందుకే మొక్కల కోసం మన ఇంటి వద్ద కొద్ది స్థలం అయినా కేటాయించుకోవాలి.

నేటి కాలంలో, చాలా మంది తమ ఇంట్లో మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. తమకున్న కొద్దిపాటి స్థలంలో కూడా మొక్కలు నాటి తమ ఇంటిని మరింత అందంగా, ప్రశాంత నిలయంగా తీర్చిదిద్దుకుంటున్నారు.

 అయితే కొన్నిసార్లు ఎన్ని మొక్కలు నాటినా కూడా వాటి పెరుగుదల సరిగ్గా ఉండదు. ఎంత నీరు పోసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మొక్క బ్రతకదు. మరేం చేయాలి? మనుషుల్లాగే మొక్కలకు కూడా సరైన పోషణతో పాటు, కొద్దిగా ప్రేమ అవసరం. మొక్కల సంరక్షణ కోసం ఇక్కడ కొన్ని చిట్కాలు అందిస్తున్నాం. వాటిని పాటించి చూడండి.

వేర్లను వదులుగా చేయండి

మీరు మొక్కను నాటేముందు దాని వేర్లను కూడా పరిశీలించండి. ఆ వేర్లు చిక్కుపడి ఉంటే వాటిని వదులుగా చేయండి. అలాగే ముదిరిపోయిన భాగాలు లేదా కుళ్లిపోయిన భాగాలను నిదానంగా కత్తిరించండి. వేర్లకు ఎలాంటి హాని చేయకూడదు. ఆ తర్వాత మొక్కను నాటండి. ఇలా చేస్తే మొక్కలు వేగంగా, బలంగా నాటుకునే పరిస్థితి కల్పించిన వారవుతారు.మొక్కలు నాటినా కూడా వాటి పెరుగుదల సరిగ్గా ఉండదు. ఎంత నీరు పోసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మొక్క బ్రతకదు. మరేం చేయాలి? మనుషుల్లాగే మొక్కలకు కూడా సరైన పోషణతో పాటు, కొద్దిగా ప్రేమ కూడా అవసరం. మొక్కల సంరక్షణ కోసం ఇక్కడ కొన్ని చిట్కాలు అందిస్తున్నాం. వాటిని పాటించి చూడండి.

ఎప్సమ్ సాల్ట్‌తో ఉపశమనం

మొక్కను ఒక చోట నుంచి తీసుకొచ్చి మరొక చోట నాటుతున్నప్పుడు కొన్నిసార్లు ఆ మొక్కకు ఆ కొత్తచోటు పరిస్థితులు అనుకూలించపోవచ్చు. దీంతో ఆ మొక్క ఆకులు వాడిపోయి, రంగు తేలిపోతాయి. ఇలాంటి సందర్భంలో ఎప్సమ్ సాల్ట్‌ను ఉపయోగించాలి. ఇద్ది మొక్కను మారిన పరిస్థితుల నుంచి కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా మొక్క ఆహారాన్ని తయారుచేసుకునే విధంగా క్లోరోఫిల్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో మొక్క కఠిన పరిస్థితుల నుండి వేగంగా కోలుకోవడంతో పాటు పోషకాలను గ్రహించగలుగుతుంది.

దీనికి మీరు తీసుకోవాల్సిన మోతాదు ఎంత ఉండాలి అంటే.. రెండు లీటర్ల నీటిలో 1/2 టేబుల్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్‌ను కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ మొక్కలు ఉంటే ఈ పరిమాణాన్ని రెండింతలు చేసుకోవాలి.

స్ఫటికాలతో చల్లదనం

మొక్కకు ఒకేసారి బాగా నీరుపెట్టి చేతులు దులుపుకోవద్దు. మనం దాహం వేసినపుడు ఎలా అయితే నీరు తాగుతామో దానికి అవసరమైనపుడే నీరు అందించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఒక్కోసారి మనం మన పనులతో బిజీగా ఉంటూ మొక్కల నీటి విడుదలకు సమయం కేటాయించడం కుదరకపోవచ్చు. అలాంటపుడు మొక్కను నాటిన మట్టిలో హైడ్రోజెల్ స్ఫటికాలను కూడా కలపండి. ఈ స్ఫటికాలు నీటిని శోషించుకుంటాయి, మొక్కలకు అవసరమయ్యే తేమను గ్రహిస్తాయి. కాబట్టి మొక్క తనకు అవసరమైనపుడు నీరు అందుబాటులో ఉంటుంది. వాటి పెరుగుదల మెరుగ్గా ఉంటుంది.

వర్మీకంపోస్ట్ 

ఇంట్లో మొక్కలను నాటడానికి ముందు ఆ మట్టిలో కొద్దిగా వర్మీకంపోస్ట్‌ను కలపాలి. ఇది మొక్కలకు మంచి ఎరువుగా పనిచేసి, వాటిని ఆరోగ్యకరంగా పెరిగేలా చేస్తుంది. ఫిలోడెండ్రాన్, పోథోస్ వంటి మొక్కలను నాటేటప్పుడు వర్మీకంపోస్ట్ వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వర్మీ కంపోస్ట్ మట్టిలో సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, నీటి పారుదల బాగుంటుంది.

పూలకుండీని క్రిమిసంహారం చేయండి

మొక్కల కోసం కుండీలు ఉపయోగిస్తుంటే, నాటడానికి ముందుగా ఆ కొత్త మొక్కకు ఎలాంటి ఛీడపీడలు వ్యాపించకుండా కుండీని పూర్తిగా క్రిమిసంహారం చేయాలి. బ్లీచింగ్ పౌడర్ లేదంటే డిటర్జెంట్ పౌడర్ తో కుండీని బాగా కడిగి ఆ తర్వాత మంచి నీటితో శుభ్రం చేయాలి. అప్పుడు మొక్కలను నాటుకోవాలి.

మొక్కలు నాటేముందు ఈ చిట్కాలు పాటించి చూడండి, మీ ఇల్లు పచ్చని మొక్కలతో కళకళలాడుతుంది.

WhatsApp channel