Friday Motivation : ప్రతిరోజూ మీకో కొత్త అవకాశాన్ని ఇస్తుంది.. ట్రై చేయండి సక్సెస్ మీదే
Friday Motivation : మనం అనుకున్నది సాధించకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఆ సమయంలో చాలా ప్రెజర్ ఉంటుంది. గోల్ రీచ్ అవుతామా? లేదా? అని. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనకు ఒక అవకాశం పోయిందంటే.. మరొక అవకాశం ఉంటుంది. ఈరోజు సాధించలేకపోయామంటే దాని అర్థం కోల్పోయామని కాదు... రేపు మళ్లీ ప్రయత్నించే అవకాశం దొరికిందని.
Friday Motivation : పట్టు వదలని విక్రమార్కుడిలా సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి. అలా చేస్తే కచ్చితంగా ఏదొక రూపంలో మీరు సక్సెస్ అవుతారు. ఈరోజు సక్సెస్ కాలేదని బాధపడకండి. రేపు అనేది మీ లైఫ్‌లో ఉంది అంటే.. మీకు మరో ఛాన్స్ ఉన్నదనే అర్థం. మీ లైఫ్‌లో ఉండే ప్రతి రోజు.. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికే ఉందని మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి రోజూ మీకో కొత్త అవకాశాన్ని ఇస్తుంది. దానిని మీరు ఎలా ఉపయోగించుకున్నారనేదే ఎండ్ ఆఫ్ ద డే మ్యాటర్.
జీవితంలో ఎలా అయినా అనుకున్నది సాధించాలని మీకు ఉంటే.. వచ్చిన ప్రతి ఛాన్స్‌ని వాడుకోవాల్సిందే. మీరు సక్సెస్ కావాలి అనుకుంటే.. ఏ చిన్నా అవకాశాన్ని కూడా చేయి జార్చుకోకూడదు. ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు అన్నట్లు.. ఏ చిన్న అవకాశంతో మీ సక్సెస్ లింక్ అయి ఉందో ఎవరూ చెప్పలేము. సక్సెస్ అనేది మీరు అనుకున్న దారిలో వస్తుంది అనుకోకండి. మీరు కష్టపడుతూ ఉంటే.. అది ఏ వైపునుంచైనా.. మిమ్మల్ని చేరుకుంటుంది.
ఒక్కోసారి అనుకోని మార్గాల నుంచి.. అస్సలు మీరు ఊహించని దారిలో మీకు సక్సెస్ అవుతుంది. నేను వన్ నైట్‌లో స్టార్ అవ్వడానికి.. పది సంవత్సరాలు వేచి చూశాను అని ఓ వ్యక్తి చెప్పాడు. అలాగే ఆ సక్సెస్ రావాలంటే ఎన్నో ఏళ్ల శ్రమ ఉంటుంది. అందరికీ ఈజీగా వచ్చేస్తే అది సక్సెస్ ఎందుకు అవుతుంది. ఈ పూట మీది కాదా.. అయితే రేపు కచ్చితంగా మీదే. రేపు మీరు అనుకున్న ఫలితం రాలేదా? అయితే ఎల్లుండి మీదే. ఎప్పటికైనా మీరు అనుకున్నది మీదే అని ఫిక్స్ అయిపోండి. కచ్చితంగా మిమ్మల్ని అది వరిస్తుంది. రావడం ఆలస్యం అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్కా.
ఆలస్యం అవుతుంది కదా అని.. ఎప్పుడూ ఆగిపోకండి. ఎందుకంటే.. మీరే గివ్ అప్ ఇచ్చేస్తే.. ఇంక సక్సెస్ మీ దగ్గరికి ఎలా వస్తుంది. దానికోసం మీరు ఎంతగా తాపత్రయపడతారో.. దానిని పొందాలని మీరు ఎంతగా ఆరాటపడుతున్నారో.. సక్సెస్ రుచి చూడాలని ఎంత కష్టపడుతున్నారో.. చూసి.. ఆ సక్సెస్ మీ దగ్గరకు వస్తుంది. వాళ్ల మాటలు, వీళ్ల మాటలు విని.. లేదా మీరే ఇంక నాతోని కాదు అని వదిలేస్తే.. అది మీ దగ్గరకు ఎందుకు వస్తుంది. వేరే వాళ్ల దగ్గరికి వెళ్లిపోతుంది. మనం చేస్తాము. సాధించగలము. మనము కాకుంటే ఎవరూ చేస్తారు.. మనవల్ల అవుతుంది.. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. నేను కచ్చితంగా విజయాన్ని సాధిస్తాను అని మీకు మీరైనా చెప్పుకోండి. పాజిటివ్‌గా ఆలోచిస్తూ.. పాజిటివ్‌గా మాట్లాడుతూ.. పాజిటివ్‌గా ఉంటే.. మీరు అనుకున్నది కచ్చితంగా మీకు దగ్గరవుతుంది. ఒకవేళ మీరు అనుకున్నది సాధించలేకపోయారా.. అయినా నిరుత్సాహపడకండి. అంతకు మించినది ఏదో మీకు రాసిపెట్టి ఉందని నమ్మండి. మీరు కచ్చితంగా.. అస్సలు ఊహించని విధంగా మీకు విజయం వరిస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్