Wednesday Motivation : అవకాశం చూసుకుంటూ.. ఆటంకాలొడుపుగా దాటుకుంటూ.. వాటంగా ముందుకు సాగిపోండి..-wednesday motivation on don t be afraid of change because it is leading you to a new beginning ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday Motivation : అవకాశం చూసుకుంటూ.. ఆటంకాలొడుపుగా దాటుకుంటూ.. వాటంగా ముందుకు సాగిపోండి..

Wednesday Motivation : అవకాశం చూసుకుంటూ.. ఆటంకాలొడుపుగా దాటుకుంటూ.. వాటంగా ముందుకు సాగిపోండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 23, 2022 06:45 AM IST

Wednesday Motivation : కొన్నిసార్లు లైఫ్లో అనుకోని మార్పులు ఎదురవుతాయి. వాటి గురించి ఆలోచించి భయపడతాము కానీ.. అవి కొత్తదనానికి శ్రీకారం చుడతాయి. కాబట్టి మార్పులు గురించి ఆలోచించి.. ఎప్పుడూ ఆగిపోకండి. జీవితం కొత్తగా నడవాలి అనుకుంటే.. కొత్తగా ఏదైనా ట్రై చేయండి.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Wednesday Motivation : జీవితంలో మనం బెటర్ పొజిషన్​కు వెళ్లడానికి.. వ్యక్తిగతంగా, ఆర్థికంగా బెటర్ అవ్వడానికి కొన్ని అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలు మన జీవితంలో మార్పులు తీసుకొస్తాయని మనకి తెలుసు. కానీ వాటి ధైర్యంగా ఎదుర్కోగలిగితే.. మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ. మార్పునకు భయపడి ఆగిపోతే.. మీకు ఆ అవకాశాలు మళ్లీ వస్తాయో లేదో చెప్పలేము. మీ జీవితంలో కొత్తగా ఏదైనా ప్రారంభించాలంటే.. మార్పులు తప్పనిసరి అని గుర్తించుకోండి.

లైఫ్​లో ఏమి కొత్తగా జరగట్లేదు అంటే.. మీరు మార్పులకు భయపడుతున్నారని అర్థం. మీరు ఒక్కసారి దానికి సిద్ధమైతే.. మీరు కచ్చితంగా లైఫ్​ని ఇంట్రెస్టింగ్​గా లీడ్ చేసే అవకాశముంది. ఏంటి అలా అయితేనే హ్యాపీగా ఉంటామా అంటే కాదు. ఒక కంఫర్ట్ లైఫ్​కి అలవాటు పడిపోయి.. కొత్తగా వచ్చే అవకాశాలను దూరం పెడితే.. మీరు జీవితంలో కొన్నింటిని చాలా ఆలస్యంగా పొందుతారు. మీతో ఉన్నవారు పరుగెడుతున్నా.. మీరు నడుచుకుంటూ.. వెళ్తూ.. వాళ్లకి ఎందుకు సక్సెస్ ముందే వస్తుంది.. నాకెందుకు రావట్లేదు ఆలోచించుకుంటూ.. ఆగిపోయే అవకాశం కూడా ఉంది.

ఏ ప్రారంభానికైనా మార్పులు అనివార్యం. వాటిని అంగీకరిస్తేనే.. మీరు జీవితంలో ఎదుగుతూ ఉంటారు. కనీసం మంచో, చెడో ట్రై చేశామనే సంతృప్తి ఉంటుంది. ఈరోజు మీరు చేసే పనిలో మీకు సంతృప్తి ఉండొచ్చు. కాదనట్లేదు.. కానీ.. మీరు రేపు కూడా ఇదే పని చేస్తే.. మీ సంతృప్తి కాస్త తగ్గుతుంది. రోజూ అదే చేస్తూ ఉంటే.. మీకు అలవాటు అయిపోతుంది. అంతే తప్పా.. అంతకుమించి మీరు చేసేదేమి ఉండదు. అప్పుడప్పుడు మీ రోటీన్​లో మార్పులు తీసుకువచ్చే.. వాటిని కూడా ట్రై చేయండి. రేపు అనేది మిమ్మల్ని మెరుగుపరుచుకునే అవకాశం ఇస్తే.. మీ కంఫర్ట్ కోసం.. లేదా ఇతరుల కోసం.. లేదా మీకోసం దానిని వదిలేసుకుంటారా? అలా వదులుకున్నారంటే అది మీ మూర్ఖత్వమే అవుతుంది.

ఏ మనిషైనా ఒక వయసొచ్చాక.. లైఫ్​లో రెండు రకాలుగా ఎదగాలి అనుకుంటాడు. అది కెరీర్ పరంగా.. ఆర్థికంగా. వీటికోసమే నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాడు. మీరు మార్పులకు భయపడ్డారంటే.. ఈ రెండింటి పరంగా మీరు ఎదగలేరు. మీరు కొత్తగా ఏమి నేర్చుకోలేరు కూడా. జీవితం చాలా అనూహ్యమైనది. ఎప్పుడూ ఏ మలుపు తీసుకుంటుందో ఎవరికి తెలియదు. కానీ ఏ దారి వచ్చినా.. ధైర్యంగా అడుగు ముందుకేయడం నేర్చుకోండి. ఒక్కోసారి ముందుకు వెళ్లడం కష్టంగా అనిపించవచ్చు. కానీ.. వెళ్తేనే కదా.. మీరు వెళ్లే రూట్ కరెక్ట్​ కాదో లేదో తెలిసేది.

సరే ఈ మార్పులు మిమ్మల్ని సక్సెస్ చేయకపోయినా.. మీరు కొత్తగా ఏదైనా నేర్చుకునే అవకాశాన్ని ఇస్తాయి. అవి మీ స్కిల్స్​ని పెంచుతాయి. ఏదొక సమయంలో ఇది మీకు బాగా కలిసి వస్తుంది. మిమ్మల్ని మీరు అప్​గ్రేడ్ చేసుకునే అవకాశం వస్తే ఎప్పుడూ దానిని వదులుకోకండి. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రాగలిగినప్పుడు మాత్రమే.. మీరు సక్సెస్​ అయ్యే అవకాశాలు వస్తాయని గుర్తుపెట్టుకోండి. లేదంటే ఏలాగో కంఫర్ట్​గానే ఉందిగా దానిలోనే కొనసాగుతూ.. ఇంకెప్పుడూ సక్సెస్ అవుతామా అని ఆలోచించుకుంటూ హాయిగా గడిపేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం