Sunday Motivation : నిజమైన సక్సెస్​ కావాలంటే.. మీ కంఫర్ట్ జోన్​ నుంచి బయటకు రండి-sunday motivation on if everything was perfect you would never earn and you would never grow ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sunday Motivation : నిజమైన సక్సెస్​ కావాలంటే.. మీ కంఫర్ట్ జోన్​ నుంచి బయటకు రండి

Sunday Motivation : నిజమైన సక్సెస్​ కావాలంటే.. మీ కంఫర్ట్ జోన్​ నుంచి బయటకు రండి

Geddam Vijaya Madhuri HT Telugu
Jul 17, 2022 09:01 AM IST

అబ్బా నేను కంఫర్ట్ జోన్​లో ఉన్నాను. నాకేమి ప్రాబ్లమ్ లేదు అనుకుంటాము కానీ. కంఫర్ట్ జోన్​లో ఉంటేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం కొత్తగా ఏమి నేర్చుకోము. నేర్చుకోవాలనే ఆసక్తి కూడా ఉండదు. ఏది నేర్చుకోకపోతే ఇక బతికి ఉండేది ఎందుకు. బావిలో కప్పల్లా మిగిలిపోవడానికా? కాదు అనుకుంటే దాని నుంచి బయటకు రండి. మిగిలిన ప్రపంచాన్ని చూడండి.

<p>కోట్ ఆఫ్ ద డే</p>
కోట్ ఆఫ్ ద డే

Sunday Motivation : కంఫర్ట్ జోన్. చాలా మంది కోరుకునేది ఇదే. ఈ కంఫర్ట్ జోన్ అనేది చాలా డేంజర్. అందరికీ కావాలి అనిపిస్తుంది. కానీ ఒక్కసారి దానిలోకి వెళ్లామంటే మనల్ని సోమరిపోతుల్ని చేసేస్తుంది. అదేంటి అనుకుంటున్నారా? అవును నిజమే మరి. ఒక్కసారి కంఫర్ట్ జోన్​లోకి వెళ్తే.. మనం నేర్చుకునేది ఏమి ఉండదు. కొత్తగా ఏది ప్రయత్నించము. ఒక చిన్న సర్కిల్ ఉంటుంది. దానిలో ఉండిపోతాము. బయటప్రపంచంతో సంబంధం లేదన్నట్లు మారిపోతాము. మీరు కంఫర్ట్ జోన్​లో ఉంటే.. మీరు ఎప్పటికీ ఏది నేర్చుకోలేరు. ఎప్పటికీ ఎదగలేరు.

ఉదాహరణకు.. చిన్నప్పుడు మనల్ని అమ్మ ఎత్తుకునేది. కానీ ఒక దశకు వచ్చాక.. మనల్ని తన ఒడి నుంచి కిందకి దించుతుంది. అమ్మ ఒడి కంఫర్ట్ జోన్​ అనుకుంటే.. దాని నుంచి అమ్మే బయటకు పంపిస్తుంది. కానీ ఎందుకు మనం నడక నేర్చుకోవాలని. ముందు అమ్మ దించేసింది అని ఏడ్చినా.. నడవడం కష్టం అయినా.. మనం ట్రై చేస్తాము. తర్వాత మెల్లిమెల్లిగా నడవడం ప్రారంభిస్తాము. ఆ తర్వాత పరుగెడతాము. తర్వాత అథ్లెటిక్​ అయినా ఆశ్చర్యం లేదు. ఇవన్నీ ఎలా జరిగాయంటే.. అమ్మ మన కంఫర్ట్​ జోన్ నుంచి మనల్ని బయటకి తీసుకొచ్చినప్పుడు.

అన్నీ అంతే అబ్బా. కంఫర్ట్ జోన్​ నుంచి బయటకు వచ్చినప్పుడు అన్ని విషయాలు మనకు అనుకూలంగా ఉండవు. ఒకరోజు కష్టంగా ఉండొచ్చు. రెండో రోజు ఇంకా కష్టంగా ఉండొచ్చు. అలాంటప్పుడే నువ్వు ఏమి చేస్తే లైఫ్​ బాగుంటుందో అని ఆలోచిస్తావు. ఇంకా ఎక్కువ కష్టపడతావు. ఒక్కరోజులో నడక నేర్చుకోగలమా ఏంటి? అలాగే ఎక్కువ రోజులే పడుతుంది. నువ్వు సక్సెస్ రుచి చూడడానికి. కానీ అప్పటివరకు నువ్వు ప్రయత్నం ఆపకూడదు.

లైఫ్​లో సక్సెస్​ కావాలంటే ముందు కంఫర్ట్ జోన్​ నుంచి బయటకు రావాలి. మనమే కాదు కొందరు కూడా అనుకోవచ్చు. వీడేం చేస్తున్నాడు రా మంచి లైఫ్ వదిలేసి ఇంత కష్టపడుతున్నాడని.. కానీ మీరు సక్సెస్​ అయిన రోజు.. వారే మిమ్మల్ని పొగుడుతారు. ఇవన్నీ మీరు కంఫర్ట్ జోన్​లో ఉంటే జరిగేదా? ఈ విషయాలు మీరు నేర్చుకునేవారా? పైగా ఈ సమయంలోనే మీకు ఎవరు ఎలాంటి వారో తెలుస్తుంది. కాబట్టి ఫ్యూచర్​లో వారితో మరింత జాగ్రత్తగా ఉండొచ్చు. పైగా మనం ఎదుర్కునే క్లిష్ట పరిస్థితులు మనకు చాలా పాఠాలు నేర్పిస్తాయి. మనం నేర్చుకున్న వాస్తవాల వల్ల మాత్రమే మనం ఎదుగుతాము.

Whats_app_banner

సంబంధిత కథనం