Friday Motivation : సక్సెస్ అవ్వాలంటే మన బెస్ట్ ఇవ్వాలి.. ఓపికతో ఎదురుచూడాలి..
Friday Motivation : కొన్ని అద్భుతాలు అనుకున్న వెంటనే జరగవు. అలా జరిగితే అద్భుతాలు ఎందుకవుతాయి.. రోటీన్ అనిపిస్తుంది. కాబట్టి.. కొన్ని విషయాలు మనకు అనుకూలంగా జరగట్లేదు.. బాగా లేట్ అవుతున్నాయంటే.. అర్థం మనం ఎదురు చూడాల్సింది ఇంకా ఉందని.
Friday Motivation : ఎంత ప్రయత్నించినా.. మనం అనుకున్నది జరగట్లేదు అంటే దాని అర్థం.. మనం ఇంకాస్త వెయిట్ చేయాలని. ఆ సమయంలో సహనం చాలా ముఖ్యం. అది లేకపోతే.. అనుకున్నది దక్కదు. కావాల్సిన దానిని దక్కించుకోవడం కోసం.. వస్తుంది అనే నమ్మకంతో.. సహనంతో ఎదురు చూడటంలో తప్పులేదు. అలా రాదు అని కచ్చితంగా తెలిశాక కూడా ఎదురు చూడటం మూర్ఖత్వం. రాదు అని తెలిసిన వెంటనే.. దాని గురించి ఇంక ఆలోచించకపోవడమే మూర్ఖత్వం.
ఏదైనా ఓ పని చేస్తున్నప్పుడు మన వల్ల కాదు అనో.. ఇంకెంత సమయం వేచి చూడాలనో.. ఓపిక లేకనో.. పనులను మధ్యలోనే వదిలిస్తాం. మనకి విజయం దగ్గర్లోనే ఉందని తెలిస్తే వదలమేమో కానీ.. మనకు తెలియక.. ఏదొక సాకుతో వదితలేస్తాము. కాబట్టి ఏ పనినైనా ఫలితం పొందేవరకు ట్రై చేయండి. ఓపిక, సహనంతో ముందుకు వెళ్లండి. మీరనుకుంటే చాలు కచ్చితంగా ఎదురు చూడగలరు.
రాని, జరగని విషయాలు కొన్ని ఉంటాయి. మనకు ఫలితం ముందే తెలిసినా.. ఎదురు చూస్తూ సమయాన్ని వృథా చేసుకుంటూ ఉంటాము. అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే.. వాటి గురించి ఎంత ఎదురు చూసినా వేస్టే అని మనకు తెలుసు. అలాంటి వాటిని ముందే గుర్తించి.. వాటి మీద పెట్టిన శ్రద్ధ, ఫోకస్.. ఇతర పనులపై పెట్టండి.
అనుకున్నంత సులువుగా విజయం వస్తే.. ఎవరైనా తట్టుకోగలరా? కష్టపడాలి.. ఎదురు చూడాలి.. ఓపికతో ఉండాలి. అలా ఎదురుచూడగా వచ్చిన విజయాన్నే మనం ఆస్వాదించగలం. ఏ పని చేయడానికైనా పట్టుదల అవసరం. అది ఉన్నప్పుడు.. విజయం మీకు కచ్చితంగా బానిస అవుతుంది. కోరిన లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయం చేస్తుంది. ఈ సమయంలో గివ్ అప్ ఇవ్వకుండా.. అంచెలంచెలుగా మనల్ని మెరుగుపరచుకోవాలి.
ఒకరికి ముందుగా సక్సెస్ వచ్చింది కాబట్టి.. మనకు అదే సమయంలో సక్సెస్ వచ్చేయాలి అనుకోకూడదు. ఒకడికి ఈజీగా దక్కినంత మాత్రానా.. మీకు త్వరగా సక్సెస్ వస్తుంది అనుకోకండి. ఒక్కొక్కరికి ఒక్కో సమయం ఉంటుంది. మీ సమయం కోసం మీరు ఎదురు చూడాలి అంతే. ప్రతిరోజూ తనను తాను మెరుగుపరచుకుంటూ.. మానసికంగా, శారీరకంగా బలంగా మారేందుకు ప్రయత్నించాలి. కాలంతో పాటు మెరుగుపడుతుంటే.. మనలో విశ్వాసం పెరుగుతుంది.
సంబంధిత కథనం