Foxtail Millet Dosa Recipe। కొర్రల దోశతో అల్పాహారం.. ఇది చాలా ఆరోగ్యకరం!
Foxtail Millet Dosa Recipe: ఇక్కడ మీకు కొర్రల దోశ రెసిపీని అందిస్తున్నాము. కొర్రలలో కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
Foxtail Millet Dosa Recipe (istock)
Healthy Breakfast Recipes: బ్రేక్‌ఫాస్ట్‌లోకి దోశ తినాలనుకుంటున్నారా? అయితే రెగ్యులర్‌గా చేసే దోశ కాకుండా చిరుధాన్యాలను దోశ పిండిని తయారు చేసుకొని మిల్లెట్ దోశ చేసుకోవచ్చు. ఈ మిల్లెట్ దోశ ఎంతో ఆరోగ్యకరమైనది. ఇక్కడ మీకు కొర్రల దోశ రెసిపీని అందిస్తున్నాము.
కొర్రలలో కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే ఈ రకమైన అల్పాహారం మిమ్మల్ని మరింత చురుకుగా, శక్తివంతంగా ఉంచుతుంది. కొర్రల దోశను సులభంగా ఎలా చేయవచ్చో ఈ కింద ఇచ్చిన సూచనలు చదవండి.
Foxtail Millet Dosa Recipe కోసం కావలసినవి
- 2 కప్పుల కొర్రలు
- 1 కప్పు మినపపప్పు
- 1 కప్పు బియ్యం
- 1 టీస్పూన్ మెంతులు
- 1 టీస్పూన్ ఉప్పు
- 4 టేబుల్ స్పూన్లు నూనె
- 1/2 కప్పు అటుకులు
కొర్రల దోశ తయారీ విధానం
- ముందుగా కొర్రలను నీటిలో బాగా కడిగి 5 నుండి 6 గంటలు నానబెట్టండి. అలాగే మరొక గిన్నెలో బియ్యం, మినపపప్పు, అటుకులు వేసి 4 గంటలు నానబెట్టండి.
- నానబెట్టిన అనంతరం వీటిని గ్రెండర్లో వేసి కొన్ని నీళ్లు పోస్తూ మెత్తని పిండి బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి.
- అనంతరం ఈ మెత్తటి పిండిలను అన్ని పిండిలను ఒక గిన్నెలో కలిపేసి ఒక వెచ్చని ప్రదేశంలో పులియబెట్టాలి.
- పులియబెట్టిన పిండిని దోశలు తయారు చేసేందుకు ఉపయోగించాలి. దోశ క్రిస్పీగా కాకుండా మెత్తగా కావాలనుకుంటే మరికొన్ని నీరు కలుపుకోండి, అలాగే రుచికి తగినట్లుగా ఉప్పు కలుపుకోండి.
- ఇప్పుడు దోశ పెనంలో నూనెను చిలకరించి వేడి చేయండి, పెనం వేడయ్యాక దోశలు వేసుకోండి. అంచుల వెంబడి ఒక స్పూన్ నూనె వేసి రెండు వైపులా దోశను కాల్చాలి.
అంతే కొర్రల దోశ రెడీ, మీకు నచ్చిన చట్నీతో వేడివేడిగా తినండి.
సంబంధిత కథనం
టాపిక్