Breakfast Diet Plan: ఏడు రోజులపాటు ఈ బ్రేక్‌ఫాస్ట్ డైట్ ప్లాన్‌ ఫాలో అవ్వండి, వారంలో 2 కిలోలు బరువు తగ్గే అవకాశం-follow this breakfast diet plan for seven days and lose 2 kg in a week ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Diet Plan: ఏడు రోజులపాటు ఈ బ్రేక్‌ఫాస్ట్ డైట్ ప్లాన్‌ ఫాలో అవ్వండి, వారంలో 2 కిలోలు బరువు తగ్గే అవకాశం

Breakfast Diet Plan: ఏడు రోజులపాటు ఈ బ్రేక్‌ఫాస్ట్ డైట్ ప్లాన్‌ ఫాలో అవ్వండి, వారంలో 2 కిలోలు బరువు తగ్గే అవకాశం

Haritha Chappa HT Telugu
Mar 01, 2024 10:16 AM IST

Breakfast Diet Plan: బరువు తగ్గాలనుకునే వారి కోసం ఇక్కడ మేము ఒక బ్రేక్ ఫాస్ట్ డైట్ ప్లాన్ ఇచ్చాము. ఉదయం తినే అల్పాహారంలో ఏడు రోజులు పాటు ఏం తినాలో చెప్పాము, వారంలో ఇలా తింటే రెండు కిలోల వరకు బరువు తగ్గే అవకాశం ఉంది.

బరువు తగ్గించే బ్రేక్ ఫాస్ట్ ఐడియాలు
బరువు తగ్గించే బ్రేక్ ఫాస్ట్ ఐడియాలు (pixabay)

Breakfast Diet Plan: బరువు పెరగడం సులువు కానీ, తగ్గడం మాత్రం చాలా కష్టం. బరువు పెరిగే వారిలో ఎక్కువగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోతుంది. దీనివల్లే చూడటానికి కూడా అంద వికారంగా కనిపిస్తారు. గుండె జబ్బులు వంటివి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పొట్ట దగ్గర కొవ్వును తగ్గించుకోవడానికి ఉదయం పూట వ్యాయామం చేసే వాళ్ళు ఎంతోమంది. అలాగే ఉదయం తినే అల్పాహారం మీ బరువు తగ్గడం పై ప్రభావం చూపిస్తుంది. ఏడు రోజుల పాటు ఇక్కడ మేము ఇచ్చిన బ్రేక్ ఫాస్ట్ డైట్ ప్లాన్ ఫాలో అవ్వండి. వారంలో రెండు కిలోలు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఈ అల్పాహారం తింటూ వ్యాయామం కూడా చేయాలి.

మొదటిరోజు - ఇడ్లీ లేదా దోశ

మీ రోజును మొదట గ్లాసు నీటితో ప్రారంభించండి. దీనివల్ల శరీరం హైడ్రేషన్‌గా ఉంటుంది. ఇది క్యాలరీలను తక్కువగా తీసుకునేలా చేస్తుంది. మొదటి రోజు మూడు ఇడ్లీలు లేదా ఒక దోశతో సరిపెట్టుకోండి. ఇడ్లీ లేదా దోశ పిండిని పులియబెట్టి చేస్తారు. కాబట్టి దీనిలో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి బరువు కోల్పోవడానికి సహకరిస్తాయి.

రెండవ రోజు - ఓట్స్

ఉదయం లేవగానే ఖాళీ పొట్టతో గ్రీన్ టీను తాగండి. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. గ్రీన్ టీలో కాటేచిన్స్ అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును కాల్చేస్తాయి. ముఖ్యంగా పొత్తికడుపు ప్రాంతంలో ఉన్న కొవ్వును కరిగిస్తాయి. గ్రీన్ టీ తాగాక ఒక గంట గ్యాప్ ఇచ్చి అల్పాహారాన్ని తినండి. రాత్రి ఓట్స్ నీళ్లలో నానబెట్టి చియా గింజలను కూడా కలపండి. ఉదయం లేచాక ఆ నానబెట్టిన ఓట్స్ చియా గింజలతో బ్రేక్ ఫాస్ట్ చేసుకుని తినండి.

మూడోరోజు - గుడ్లు

బ్రేక్‌ఫాస్ట్‌లో ఫైబర్, ప్రోటీన్ రెండింటినీ కలిపి తింటే మంచిది. ఇవి ఎక్కువసేపు మిమ్మల్ని ఆకలి వేయకుండా ఆపుతాయి. అతిగా తినే అవకాశాన్ని తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకుంటాయి. కాబట్టి ఉడికించిన రెండు గుడ్లను మాత్రమే అల్పాహారంలో తినండి.

నాలుగో రోజు - స్మూతీలు

ప్రోటీన్ నిండిన స్మూతీలను తినడం వల్ల బరువును సులువుగా తగ్గొచ్చు. అలాగే ఈ స్మూతీల నుండి పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. ఇవి కేలరీలను బర్న్ చేస్తాయి. బెర్రీ పండ్లతో పెరుగుతో స్మూతీలను తయారు చేసి తినండి. అంతకుమించి ఇంకేమీ తినకండి. పొట్ట నిండినా, నిండకపోయినా ఆ స్మూతీ తోనే సర్దుకుపోవాలి.

ఐదో రోజు - స్ప్రౌట్స్ సలాడ్

ఐదవ రోజున మీ ఆహారంలో ప్రోటీన్ కన్నా ఫైబర్ అధికంగా ఉండేలా చేసుకోండి మొలకెత్తిన గింజలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అలాగే మొలకెత్తిన గింజల్లో పండ్ల మొక్కలు కూరగాయల ముక్కలు కూడా యాడ్ చేసుకుని తింటే మంచిది. ముందు రోజే పెసరపప్పును నీటిలో నానబెట్టి మొలకలు వచ్చేలా చేసుకోండి ఉదయం లేచాక వాటిని తినండి ఇది కొవ్వు పేరుకుపోవడాన్ని అడ్డుకుంటుంది

ఆరో రోజు - వెజిటబుల్ అట్టు

తరిగిన కూరగాయలు, శెనగపిండి కలుపుకొని అట్లులా పోసుకొని తినండి. దీన్ని వెజ్ చీలా అంటారు. దీన్ని తినడం వల్ల ఆ రోజు మీరు అతిగా తినకుండా ఉంటారు. ఆకలిని కూడా ఇది తగ్గిస్తుంది. కాబట్టి పోషకాలు అందుతాయి.

ఏడో రోజు - పాలలో నట్స్

బాదం, వాల్నట్స్, అవిసె గింజలు, పొద్దు తిరగుడు గింజలు, గుమ్మడి గింజలు వీటన్నింటినీ మిక్సీలో వేసి నట్స్ మిశ్రమాన్ని రెడీ చేసుకోండి. వీటిని పాలల్లో వేసి కాసేపు వదిలేయండి. అవి చక్కగా నానాక వాటిని తినేయండి. రుచి కోసం ఒక స్పూను తేనె వేసుకోండి. ఇది శక్తితో నిండిన అల్పాహారం.

పైన చెప్పిన అల్పాహారాలను ఫాలో అవుతూ వ్యాయామం కూడా తప్పకుండా చేయండి. ముఖ్యంగా సూర్యరశ్మిలో కొంత సమయాన్ని గడపండి. విటమిన్ డి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మధ్యాహ్నం, రాత్రిపూట భారీ ఆహారాలను మానేయండి. వారం రోజులు ఇలా చేస్తే రెండు కిలోల బరువు తగ్గడం ఖాయం.

టాపిక్