HulaHoop: బరువు తగ్గడంతో పాటు ఒత్తిడిని తగ్గించుకోవాలా? ప్రతిరోజూ హులాహుప్ వ్యాయామం చేయండి-hulahoop want to reduce stress along with weight loss do the hula hoop exercise every day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hulahoop: బరువు తగ్గడంతో పాటు ఒత్తిడిని తగ్గించుకోవాలా? ప్రతిరోజూ హులాహుప్ వ్యాయామం చేయండి

HulaHoop: బరువు తగ్గడంతో పాటు ఒత్తిడిని తగ్గించుకోవాలా? ప్రతిరోజూ హులాహుప్ వ్యాయామం చేయండి

Haritha Chappa HT Telugu
Feb 29, 2024 05:30 AM IST

HulaHoop: హులాహుప్ వ్యాయామాలు క్యాలరీలను ఎక్కువగా బర్న్ చేస్తాయి. అలాగే శరీరాన్ని ఫిట్ గా ఉంచుతాయి. ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి.

హూలాహూప్ వ్యాయామాలు
హూలాహూప్ వ్యాయామాలు (pexels)

HulaHoop: రోజుకు పది నిమిషాలు పాటు హూలాహూప్ వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోండి. నెల రోజుల్లోనే మీకు మంచి మార్పులు కనిపిస్తాయి. బరువు తగ్గడంతో పాటు ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. అలాగే అమ్మాయిల నడుము సన్నగా మెరుపు తీగలా మారుతుంది. పొట్ట చుట్టూ చేరిన బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది. అందుకే ప్రతిరోజూ కనీసం పది నిమిషాలు వ్యాయామాలు చేయడానికి ప్రయత్నించండి.

హులాహూప్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం అదుపులో ఉంటుంది. గుండె కండరాలు బలోపేతం అవుతాయి. గుండెకు రక్తప్రసరణ మెరుగవుతుంది. దీనివల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా పెరుగుతుంది. కాబట్టి గుండెకు, ఊపిరితిత్తులకు కూడా హులాహుప్ వ్యాయామాలు రక్షణగా నిలుస్తాయి.

హులాహుప్ వ్యాయామాలు చేయడం చాలా సరదాగా అనిపిస్తాయి. ఈ వ్యాయామాలు ఫన్‌తో కూడి ఉంటాయి. అలాగే క్యాలరీలను బర్న్ చేస్తాయి. బరువు తగ్గడానికి మంచి మార్గం. ఇది ఒక గంట పాటు హూలాహోప్ చేస్తే 200 నుండి 400 కేలరీలను బర్న్ చేసుకోవచ్చు.

ఒత్తిడి తగ్గించుకోవడానికి హులాహుప్ వ్యాయామాలు ఉపయోగపడతాయి. ఇవి చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఎండార్పిన్లు విడుదలవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. మానసిక స్థితి మెరుగవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.

హులాహుప్ నడుము దగ్గర పెట్టుకొని తిప్పడం అందరికీ రాదు. మొదట నిపుణుల దగ్గర ప్రాక్టీస్ చేశాక అప్పుడు మీరు సొంతంగా ఇంట్లో చేయడం అలవాటు చేసుకోండి. ఈ వ్యాయామం మీకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. అలాగే ఆరోగ్యాన్ని అందిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు.

Whats_app_banner

టాపిక్