Samalu: గుండెపోటు రాకుండా అడ్డుకోవాలా? ప్రతిరోజూ సామలతో చేసిన వంటకాలు తినడం అలవాటు చేసుకోండి-samalu to prevent heart attack eat dishes made with little millets ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Samalu: గుండెపోటు రాకుండా అడ్డుకోవాలా? ప్రతిరోజూ సామలతో చేసిన వంటకాలు తినడం అలవాటు చేసుకోండి

Samalu: గుండెపోటు రాకుండా అడ్డుకోవాలా? ప్రతిరోజూ సామలతో చేసిన వంటకాలు తినడం అలవాటు చేసుకోండి

Haritha Chappa HT Telugu
Feb 27, 2024 06:50 PM IST

Samalu: సిరి ధాన్యాల్లో సామలు కూడా ఒకటి. సామలతో చేసిన ఆహారాలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పోషకాహార నిపుణులు ప్రతిరోజూ సామాలతో చేసిన ఆహారం తినమని చెబుతున్నారు.

సామలు
సామలు

Samalu: సిరి ధాన్యాల్లో సామలు ముఖ్యమైనది. ఒకప్పుడు వీటిని అధికంగా తినేవారు. కానీ ఎప్పుడైతే తెల్ల బియ్యం వాడకం పెరిగిందో అప్పటినుంచి సామలు తినడం చాలా తగ్గించేశారు. నిజానికి సామలతో ఎన్నో రకాల వంటకాలు చేయొచ్చు. దోశెలు, ఊతప్పం, పులావ్, ఉప్మా... ఇలా నచ్చినవన్నీ చేసుకోవచ్చు. అయినా కూడా వీటిని తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడడం లేదు. సామలు తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుంటే మంచిది.

సామలు తినడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇది గ్లూటెన్ రహిత ఆహారం ఇది. పోషకాలతో నిండి ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి కూడా తగినంత దొరుకుతాయి. ఎవరికైతే గ్లూటెన్ ఆహారమో పడదో వారు... గోధుమ, బార్లీ వంటివి వదిలి సామలను ఆహారంలో భాగం చేసుకోవాలి. సామలను తిన్నాక రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. దీనివల్ల డయాబెటిక్ రోగులు ఆరోగ్యంగా ఉంటారు. మధుమేహం ఉన్నవారు ప్రతిరోజు సామలను తింటే మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. పేగు కదలికలను ప్రోత్సహించడంలో సామలవీ కీలక పాత్ర.

సామలు తింటే ఈ సమస్యలు రావు

సామలు తిన్నవారిలో మలబద్ధకం వంటి సమస్యలు రావు. జీర్ణ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పొట్ట ఆరోగ్యానికి ఫైబర్ చాలా అవసరం. సామల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి పొట్ట ఆరోగ్యంగా ఉండడం ఖాయం.

ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వారు ప్రతి రోజూ సామలను తినడం అలవాటు చేసుకోవాలి. దీనిలో ఉన్న అధిక ఫైబర్ కంటెంట్ వల్ల త్వరగా పొట్ట నిండిన భావన కలుగుతుంది. కాబట్టి ఇతర ఆహారాలు తినకుండా ఉంటారు. వీటిని తినడం వల్ల శరీరంలో చేరే క్యాలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. ఇది మీ ఆకలిని అదుపులో ఉంచుతాయి. దీనివల్ల బరువు పెరగకుండా ఉంటారు.

గుండె ఆరోగ్యానికి సామలు

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే సామలు కచ్చితంగా తినాలి. ఇది మీ గుండెకి ఎంతో మేలు చేస్తుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండెపోటు వంటివి రాకుండా ఉంటాయి. దీనిలో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం వంటివి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. కాబట్టి గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

టాపిక్