Healthy Benefits of Walnuts : మధుమేహమైనా.. సంతానోత్పత్తికోసమైనా.. వాల్​నట్స్ హ్యాపీగా తినండి-eat walnuts daily to get benefits of good health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Healthy Benefits Of Walnuts : మధుమేహమైనా.. సంతానోత్పత్తికోసమైనా.. వాల్​నట్స్ హ్యాపీగా తినండి

Healthy Benefits of Walnuts : మధుమేహమైనా.. సంతానోత్పత్తికోసమైనా.. వాల్​నట్స్ హ్యాపీగా తినండి

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 29, 2022 10:15 AM IST

Walnut Benefits : చాలామంది మంచి ఆరోగ్యం, ఫిట్​నెస్​ కోసం డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటారు. అయితే ఇవి షుగర్ పేషంట్లకు అంత మంచివి కాదు. కానీ వాల్​నట్స్​తో అలా కాదు. వీటిని మధుమేహం ఉన్నవారు కూడా హ్యాపీగా లాగించేయవచ్చు. పైగా వీటిని రోజూ తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

<p>వాల్​నట్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు</p>
వాల్​నట్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Walnut Benefits : చాలా మంది బాదం, పిస్తా, జీడిపప్పు అంటారు కానీ.. వాల్ నట్స్ జోలికి ఎక్కువగా వెళ్లరు. కానీ దాని ప్రయోజనాలు తెలిస్తే.. వాల్​నట్స్​ని కచ్చితంగా తమ డైట్​లో యాడ్ చేసుకుంటారు. మీ ఆరోగ్యం వాల్ అంత స్ట్రాంగ్​గా ఉండాలంటే ఈ వాల్​నట్స్​ని రోజూ తీసుకోవాలి. మరి వీటి వల్ల కలిగే ఆరోగ్యవాల్​నట్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మధుమేహం ఉన్నా..

బ్రెయిన్ లేదా హార్ట్​కి మాత్రమే కాదు.. వాల్‌నట్స్ డయాబెటిక్ పేషెంట్లకు కూడా మంచివే. వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, ప్రొటీన్‌లు, ఫైబర్‌ల ముఖ్యమైన స్థాయిలు ఉన్నందున మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అవి ఇన్సులిన్ నిరోధకత అభివృద్ధికి, ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి, రక్తప్రవాహంలోకి చక్కెర విడుదలను పరిమితం చేయడానికి సహాయపడతాయి.

బ్రెయిన్ ఫుడ్

వాల్​నట్స్ చూడటానికి బ్రెయిన్​ వలె ఉంటాయి. పైగా ఇవి మీ మెదడుకు ఉత్తమమైన చిరుతిండని చెప్పవచ్చు. ఇది ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన మెదడు పనితీరుకు మాత్రమే కాకుండా, డిప్రెషన్, A DHD, అల్జీమర్స్ వ్యాధి చికిత్సలో కూడా సహాయపడుతుంది. నిజానికి వాల్‌నట్‌లు మంచి నిద్రను ప్రోత్సహించడానికి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి అద్భుతమైనవి.

మీ హృదయాన్ని కాపాడుకోండి

వాల్‌నట్‌లు గుండెను రక్షించే గింజలు. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. వాల్​నట్స్​ను ఎప్పుడూ లేదా అప్పుడప్పుడు లేదా అసలు తినని వారి కంటే వారానికి నాలుగు సార్లు కంటే ఎక్కువగా గింజలు తినేవారికి కొరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం 37 శాతం తక్కువగా ఉందని పేర్కొంది. అంతేకాకుండా ఇది కడుపులో మంటను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ధమనుల ద్వారా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోండి

వాల్‌నట్స్‌లో ఫ్యాటీ యాసిడ్‌లు, యాంటీఆక్సిడెంట్లు.. క్యాన్సర్‌ను నిరోధించే సామర్థ్యం ఉన్న ఇతర బయోకెమికల్స్ ఉంటాయి. ఇది రొమ్ము, ప్రోస్టేట్, కొలొరెక్టల్ క్యాన్సర్‌తో సహా కొన్ని క్యాన్సర్‌ల నుంచి మిమ్మల్ని రక్షించగలదు. మీరు ఈ రకమైన క్యాన్సర్‌లను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గించడానికి బాదం, పిస్తాపప్పులను కూడా తినవచ్చు.

సంతానోత్పత్తి కోసం

నిరూపితమైన సూపర్‌ఫుడ్, వాల్​నట్స్ మగ, ఆడ వారిలో సంతానోత్పత్తిని పెంచుతాయి. అధిక స్థాయిలో ఫైబర్, ఒమెగ్ ఎ-3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం ఉన్నందున ఇది మహిళల సంతానోత్పత్తికి ఉత్తమమైన సూపర్‌ఫుడ్‌లలో ఒకటి. ఇది శరీరంలో ప్రొజెస్టెరాన్ స్థాయిలను మెరుగుపరచి, గర్భాశయానికి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వాల్‌నట్‌లు మగవారిలో స్పెర్మ్ ఉత్పత్తికి సహాయపడతాయి.

Whats_app_banner

సంబంధిత కథనం