Foods for Liver: కామెర్లు రాకుండా ఉండాలంటే కాలేయం కోసం ఈ సూపర్ ఫుడ్స్‌ను తినండి-eat these super foods for liver to avoid jaundice ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Foods For Liver: కామెర్లు రాకుండా ఉండాలంటే కాలేయం కోసం ఈ సూపర్ ఫుడ్స్‌ను తినండి

Foods for Liver: కామెర్లు రాకుండా ఉండాలంటే కాలేయం కోసం ఈ సూపర్ ఫుడ్స్‌ను తినండి

Haritha Chappa HT Telugu
Apr 17, 2024 02:30 PM IST

Foods for Liver: కామెర్లు ప్రాణాంతక వ్యాధులు సరైన సమయంలో గుర్తించకపోతే ప్రాణాన్ని తీసేస్తాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే కామెర్లు రాకుండా ఉంటాయి.

కాలేయ ఆరోగ్యం
కాలేయ ఆరోగ్యం (Pixabay)

Foods for Liver: మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంతో పాటు, శరీరంలోని వ్యర్ధపదార్థాలను వదిలించుకుంటాయి. అలాగే రక్తం బాగా ప్రవహించేలా చేస్తాయి. రక్తాన్ని గడ్డకట్టే కారకాలను సృష్టిస్తాయి. లేకుంటే చిన్న చిన్న గాయాలకే రక్తస్రావం ఆగకుండా పోయే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడైతే కాలేయం సరిగా పనిచేయదు. అప్పుడు అనేక సమస్యలు వస్తాయి. వాటిలో కామెర్లు ఒకటి. రక్త ప్రవాహంలో ఉండే బిల్రుబిన్ కొవ్వుల్లో కరిగిపోతుంది. దీనివల్ల చర్మం, కళ్ళు... పసుపు రంగులోకి వస్తాయి. బిల్రూబిన్ అనేది ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమయ్యే సమయంలో విడుదల అయ్యే ఒక పసుపు వర్ణ ద్రవ్యం. ఈ వర్ణ ద్రవ్యం ఎక్కువగా విడుదలయితే చర్మం, కళ్ళు, చిగుళ్ళు పసుపు రంగులోకి మారిపోతాయి. అంటే కామెర్ల వ్యాధి వచ్చినట్టు అర్థం. కామెర్లు ఉన్నవారు జీర్ణక్రియ, జీవక్రియను మెరుగుపరిచే ఆహారాలను తీసుకోవాలి. కాలేయం దెబ్బతినకుండా కాపాడుకోవాలి.

వైద్యులు చెబుతున్న ప్రకారం మీరు తినే ఆహారమే కాలేయాన్ని కాపాడుతుంది. కామెర్లు రాకుండా అడ్డుకుంటుంది. ఒక వ్యక్తి తినే ఆహారంలో ఉండే పోషకాలు, టాక్సిన్స్, మందులను ప్రాసెస్ చేయడానికి కాలేయం ప్రధాన బాధ్యత వహిస్తుంది. కాబట్టి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని రకాల సూపర్ ఫుడ్స్ ను తినాలి. ఖ్యంగా కామెర్లు రాకుండా ఉండాలంటే తినాల్సిన ఆహారాలు ఏంటో తెలుసుకోండి.

కామెర్లు రాకుండా ఏం తినాలి?

తృణధాన్యాల్లో డైటరీ,ఫైబర్ ఫినోలిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. ఇది మొక్కలలో సహజ యాక్సిడెంట్లుగా పనిచేస్తుంది. గోధుమలు, క్వినోవా, రై, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటివి తృణధాన్యాల్లో భాగాలు. వీటిని ప్రతిరోజూ తినడం వల్ల కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. కాలేయ క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.

లీన్ ప్రోటీన్

టోఫు, చిక్కుళ్ళు, పౌల్ట్రీ, చేపలు వంటి ఆహారాల్లో లీన్ ప్రోటీన్లు ఉంటాయి. ఇవి కామెర్లు రాకుండా అడ్డుకుంటాయి. కామెర్లు బారిన పడినవారు వీటిని తినడం చాలా ముఖ్యం. అమెరికన్ లివర్ ఫౌండేషన్ చెబుతున్న ప్రకారం కొవ్వు, ఉప్పు అధికంగా ఉన్న ఆహారాన్ని తినకూడదు. దీనివల్ల కామెర్ల సమస్య మరింతగా పెరుగుతుంది.

కామెర్లు ఉన్నవారు కొవ్వు ఉన్న పదార్థాలను, వేయించిన ఆహారాన్ని తినడం మానేయాలి. ప్రతిరోజు రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.

ఆరోగ్యకరమైన కొవ్వులుగా పిలిచే మోనో అన్ శాచురేటెడ్ కొవ్వులు ఉన్న పదార్థాలను తీసుకోవడం చాలా అవసరం. విటమిన్ ఈ, ఫినోలిక్ యాసిడ్ ఉండే నట్స్ ను తినమని వైద్యులు చెబుతారు.

తాజా పండ్లు కూరగాయల్లో, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. పండ్లు, కూరగాయల్లో కాలేయానికి మేలు చేసే పోషకాలు ఉన్నాయి. క్రాన్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, ద్రాక్ష పండ్లు, సిట్రస్ పండ్లు, బొప్పాయిలు, సీతాఫలాలు, అవకాడోలు వంటివి ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.

ఆల్కహాల్ తాగడం వల్ల కాలేయం దారుణంగా దెబ్బతింటుంది. కాలేయంతో సహా అంతర్గత శారీరక కణజాలాలు దెబ్బతింటాయి. గుండె సమస్యలతో కూడా ఇది ముడిపడి ఉంటుంది. సోడాలు, కాల్చిన ఆహారం, వైట్ బ్రెడ్, పాస్తా వంటివి తినకపోవడం మంచిది. అలాగే పంచదారతో చేసిన ఆహారాలు దూరంగా పెట్టాలి. ఇవన్నీ కూడా కాలేయ పనితీరును దెబ్బతీస్తాయి.

WhatsApp channel