Lemon Juice: రోజూ గ్లాసుడు నిమ్మరసం తాగడం వల్ల మీ చర్మంలో వచ్చే మార్పులు ఇవే, ఇది చదివితే రోజూ నిమ్మరసం తాగేస్తారు
Lemon Juice: నిమ్మరసం తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజూ నిమ్మకాయ రసం తాగడం వల్ల చర్మానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
Lemon Juice: ప్రతిరోజూ నిమ్మకాయ నీటిని తాగడం అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కేవలం ఆరోగ్యానికే కాదు చర్మానికీ ఇది మెరుపుని ఇస్తుంది. నిజం చెప్పాలంటే ప్రతి రోజు నిమ్మరసం తాగితే చర్మంలో అద్భుతమైన మార్పులు చూడొచ్చు. నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. ఒక నెల రోజులు ప్రతిరోజూ నిమ్మరసం తాగి చూడండి. ఆ తర్వాత మీ చర్మం లో వచ్చిన మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు.
చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. చర్మం మెరుపుకు విటమిన్ సి అవసరం. ఇది చర్మం తాజాగా ఉండేలా కాపాడుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ నిమ్మరసం తాగితే కొల్లాజిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల ముఖం మీదున్న చర్మం పై గీతలు, ముడతలు రాకుండా ఉంటాయి.
చర్మం ప్రకాశవంతంగా ఉంటేనే అందంగా కనిపిస్తుంది. నిమ్మరసంలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కావాలనుకుంటే శరీరం హైడ్రేటెడ్‌గా ఉండాలి. నిమ్మకాయ నీరు ప్రతిరోజు తాగితే హైడ్రేషన్ సమస్య ఉండదు. శరీరం తేమతో నిండి ఉంటుంది. కాబట్టి చర్మం తేమను నిలుపుకుంటుంది. దీనివల్ల మీ చర్మం మృదువుగా, అందంగా ఉంటుంది .
చర్మం మెరుపుకు
నిమ్మరసం తాగడం వల్ల శరీరం డిటాక్సిఫికేషన్‌కు గురవుతుంది. అంటే శరీరంలోని వ్యర్ధాలను, విషాన్ని బయటికి పంపిస్తుంది. దీనివల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం మచ్చలు లేకుండా కాంతివంతంగా మారుతుంది. కాబట్టి మీ మేని ఛాయ మెరిసిపించుకోవడానికి నిమ్మకాయ రసం ప్రతిరోజు తాగడం అలవాటు చేసుకోవాలి.
నిమ్మరసంలో ఆమ్ల స్వభావం అధికంగా ఉంటుంది. ఇది శరీరంపై ఆల్కలైజింగ్ ప్రభావాన్ని చూపిస్తుంది. నిమ్మకాయ నీటిని ప్రతిరోజు తాగే వారిలో PH స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. PH స్థాయిలు బ్యాలెన్స్ గా ఉండడం వల్ల చర్మం మెరవడం ఖాయం. PH బ్యాలెన్స్ సమతుల్యంగా ఉంటే మొటిమలు ఇతర చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి మీరు మరింత అందంగా ఉంటారు.
నిమ్మకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్ డామేజ్ ను ఎదుర్కోవడంలో సహాయ పడతాయి. దీంట్లో లక్షణాలు ఎక్కువ. కాబట్టి చర్మంపై గీతలు, ముడతలు, పొడిబారడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చర్మం కాంతివంతంగా, యవ్వనంగా ఉంటుంది.
ప్రతిరోజు నిమ్మకాయ రసాన్ని తాగే వారి చర్మం సహజంగానే మెరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. చర్మంపై ఉన్న డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ వంటివి తగ్గుతాయి.
మొటిమలు రావు
మొటిమల చికిత్సకు నిమ్మకాయ రసం అద్భుతంగా పనిచేస్తుంది. మొటిమల బారిన పడినవారు ప్రతిరోజు నిమ్మకాయ రసాన్ని తాగడం అలవాటు చేసుకోండి. ఒక నెల రోజులు పాటు నిమ్మకాయ రసాన్ని తాగి ఫలితాన్ని మీరే చూడండి. మీ చర్మం లో మెరుపును మీరే గుర్తిస్తారు. నిమ్మరసం, నీళ్లు, కాస్త తేనే వేసుకుని తాగండి. చక్కెర వేసుకుంటే నిమ్మరసం ఇచ్చే ఫలితాలు పూర్తిగా అందవు. ఎందుకంటే చక్కెర వల్ల చర్మానికి హాని కలుగుతుంది.