తెలుగు న్యూస్ / ఫోటో /
Vitamin C rich fruits: విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు ఇవే..
Vitamin C rich fruits: పైనాపిల్ నుంచి మామిడిపండ్ల వరకు విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
(1 / 7)
వేసవిలో, మన శరీరం హైడ్రేటెడ్‌గా, శక్తివంతంగా ఉండటం అవసరం. ఆరోగ్యం కోసం ఆ కాలంలో దొరికే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. వేసవిలో విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లను తినడం లాభదాయకం. మీ ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాల్సిన కొన్ని పండ్లేంటో చూద్దాం. (Unsplash)
(2 / 7)
మామిడిపండ్లు: వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, విటమన్ సి పుష్కలంగా ఉంటాయి. మామిడిపండ్లకు రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు కూడా ఉంటాయి. ముఖ్య పచ్చి మామిడి కాయల్లో విటమిన్ సి పండ్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. (Unsplash)
(3 / 7)
పైనాపిల్: దీంట్లో మాంగనీస్ ఉంటుంది. విటమిన్ సి కూడా ఎక్కువే. దీన్ని ఆరోగ్య చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. (Unsplash)
(4 / 7)
జామపండ్లు: వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెంచడమే కాక, క్యాన్సర్ వచ్చే అవకాశాల్ని తగ్గిస్తుంది. (Unsplash)
(5 / 7)
కివి: విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ ఈ పండులో ఉంటాయి. రక్తపోటును నియంత్రించడంలో ఇది సాయపడుతుంది. గుండె వ్యాధులు రాకుండా రక్షిస్తుంది. (Unsplash)
(6 / 7)
బొప్పాయి: దీంట్లో పీచు ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ ఇ కూడా ఎక్కువే. (Unsplash)
ఇతర గ్యాలరీలు