Weightloss Season: ఏ సీజన్లో బరువు త్వరగా తగ్గుతారో, ఏ సీజన్లో బరువు వేగంగా పెరుగుతారో తెలుసా?
Weightloss Season: బరువు తగ్గడానికి లేదా పెరగడానికి చాలా ముఖ్యమైన అంశం ఆహారం. కానీ బరువు తగ్గడానికి, పెరగడానికి క సరైన సీజన్లు ఉన్నాయి. ఏ సీజన్లో ప్రయత్నిస్తే త్వరగా బరువు తగ్గుతారో, ఏ సీజన్లో బరువు పెరుగుతారో తెలుసుకోండి.
ఈ రోజుల్లో చాలా మంది పెరిగిన బరువు కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరూ బరువు పెరగకుండా ఉండాలని కోరుకుంటారు. కానీ వారికి తెలియకుండానే బరువు పెరుగుతూ ఉంటారు. బరువు తగ్గాలనుకునే వారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వారు త్వరగా బరువు తగ్గాలనుకుంటే ఏ సీజన్లో ప్రయత్నించాలో తెలుసుకోండి.
కొంతమంది క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తారు. అయినా బరువు తగ్గడం కష్టంగానే ఉంటుంది. వెయిట్ వాచర్స్ తో పాటు బరువు పెరగాలనుకునే వారు కూడా ఉన్నారు. కొందరు బరువు తగ్గడానికి ఎంత ప్రయత్నిస్తారో… బక్కగా ఉన్నవారు బరువు పెరగడానికి ప్రయత్నించే వారూ ఉంటారు. అలాంటి వారు ఏ సీజన్లో బరువు పెరుగుతారో, ఏ సీజన్లో బరువు తగ్గుతారో తెలుసుకోవల్సిన అవసరం ఉంది.
బరువు పెరగడానికి, తగ్గడానికి మీ చుట్టూ ఉండే వాతావరణం కూడా సహకరిస్తుంది. వాతావరణం సీజన్ ను బట్టి మారుతుంది. మీరు సరైన వాతావరణం గురించి తెలుసుకోవాలి. బరువు తగ్గడానికి, పెరగడానికి సరైన సీజన్ ఏదో తెలుసుకోండి. సీజన్‌కు తగ్గట్టు ఆహారంలో మార్పులు చేయడం చాలా ముఖ్యం. బరువు తగ్గడానికి, పెరగడానికి ఏ సీజన్ ఉత్తమమో తెలుసుకోండి.
బరువు తగ్గడానికి ఏ సీజన్ ఉత్తమం?
వేసవి కాలం బరువు తగ్గడానికి ఉత్తమ సీజన్. ఎందుకంటే ఈ సీజన్ లో స్విమ్మింగ్, వాకింగ్ వంటి తేలికపాటి ఏరోబిక్ ఎక్సర్ సైజులు చేసుకోవచ్చు. సులభంగా బరువు తగ్గడానికి, మీరు వేసవిలో తక్కువ కొవ్వు, తక్కువ కేలరీలున్న పండ్లు, కూరగాయలను కూడా ఎంచుకోవచ్చు. ప్రతిరోజూ పండ్లు, తేలికపాటి కూరగాయలు తింటూ నడక, రన్నింగ్ వంటివి చేస్తూ ఉంటే త్వరగా బరువు తగ్గుతారు. వేసవిలో చెమట కూడా అధికంగా పడుతుంది. త్వరగా అలసి పోతారు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వేసవిలో ప్రయత్నించండి.
బరువు పెరగడానికి ఏ సీజన్ ఉత్తమం?
శీతాకాలంలో బరువు పెరగడం చాలా సాధారణం. ఎన్నో అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించాయి. శీతాకాలంలో ఎంతోమంది తమకు తెలియకుండానే బరువు పెరగడం ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. శీతాకాలంలో బరువు పెరగడం అనేది హార్మోన్లతో ముడిపడి ఉంటుంది. మీరు బరువు పెరగాలనుకుంటే శీతాకాలం ఉత్తమం. బక్కగా ఉన్నవారు ఆహారం తింటూ బరువు పెరగవచ్చు. ఒకసారి ప్రయత్నించి చూడండి. నెలరోజుల్లోనే నాలుగు కిలోల వరకు సులువుగా పెరగవచ్చు.
బరువు తగ్గడం, పెరగడం అనేది మీ శరీరం ఎత్తును బట్టి నిర్ణయించుకోవాలి. మీరు మీ ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోండి. బీఎమ్ఐ ని బట్టి మీరు బరువు తగ్గాలా, పెరగాలా అనేది ఆధారపడి ఉంటుంది.
బరువు పెరిగేందుకు బంగాళాదుంపలు, కార్న్ ఫ్లోర్, అవకాడోలు, అంజీర్ పండ్లు, పాలు, పెరుగు, నెయ్యి వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. రోజులో మూడుసార్లు భోజనం చేసి, రెండు సార్లు చిన్న మీల్స్ తీసుకోవాలి. అలా శరీరానికి అదనపు కిలోలు ఇచ్చేందుకు ఆహారాన్ని అందిస్తూనే ఉండాలి.
ఇక బరువు తగ్గేందుకు పండ్లు, ఉడికించిన కూరగాయలు, సూప్ లు, చికెన్, రోజుకో గుడ్డు బ్రేక్ ఫాస్ట్‌లో, మజ్జిగ, నిమ్మరసం, గోరువెచ్చని నీరు వంటివి భోజనంలో భాగం చేసుకోవాలి.
టాపిక్