Matka Dal: మట్కా పప్పు గురించి తెలుసా? కందిపప్పు, పెసరపప్పులాగే వీటినీ తింటే ఎంతో శక్తి-do you know about matka dal if you eat these you get a lot of energy ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Matka Dal: మట్కా పప్పు గురించి తెలుసా? కందిపప్పు, పెసరపప్పులాగే వీటినీ తింటే ఎంతో శక్తి

Matka Dal: మట్కా పప్పు గురించి తెలుసా? కందిపప్పు, పెసరపప్పులాగే వీటినీ తింటే ఎంతో శక్తి

Haritha Chappa HT Telugu
Apr 10, 2024 02:00 PM IST

Matka Dal: ఎప్పుడూ కందిపప్పు, పెసరపప్పే కాదు, మట్కా పప్పును కూడా రుచి చూడండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి.త

మోత్ బీన్స్
మోత్ బీన్స్

Matka Dal: మట్కా పప్పుని కొంతమంది మట్కీ పప్పు అని పిలుస్తారు. గ్రామాల్లో వారు మటికల పప్పు అని కూడా అంటారు. కందిపప్పు, పెసరపప్పు ఎలానో ఈ మటికల పప్పు కూడా అలానే. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో బోలెడు పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల మన శరీరానికి కావలసిన ఎన్నో అవసరాలు తీరుతాయి. వీటిని ఇంగ్లీషులో మోత్ బీన్స్ అని పిలుస్తారు. అలాగే మట్ బీన్స్ అని కూడా అంటారు. ఇవి చూసేందుకు గోధుమ రంగులో ఉంటాయి.

మట్కా పప్పులో ప్రోటీన్లు పుష్కలం. శాఖాహారులకు ఈ పప్పు ఎంతో మేలు చేస్తుంది. ప్రోటీన్ లోపం రాకుండా కాపాడుతుంది. ఇవి అన్ని దుకాణాల్లోనూ లభిస్తాయి. ఈ పప్పును వారానికి కనీసం ఒకటి రెండు సార్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీన్ని సూపర్ ఫుడ్ గా చెబుతారు పోషకాహార నిపుణులు.

మట్కా పప్పులో పోషకాలు

కందిపప్పు, పెసరపప్పులో ఎన్ని రకాల పోషకాలు లభిస్తాయో మట్కా పప్పులో కూడా అంతకుమించి లభిస్తాయి. దీనిలో ఫైబర్, జింక్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి మట్కా పప్పు మంచి ఎంపిక అని చెప్పుకోవాలి. వేసవిలో ఈ మట్కా పప్పును తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా గుండె జబ్బులతో బాధపడేవారు వీటిని కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే ఊబకాయంతో ఉన్నవారు, హైబీపీతో బాధపడుతున్న వారు కూడా మట్కా పప్పును తినడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటారు. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. రక్తపోటును పెరగకుండా కాపాడుతుంది. ఇది చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖంపై గీతలు, ముడతలు వంటివి రాకుండా రక్షిస్తుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలు ఈ మట్కా పప్పులో ఎక్కువ. చర్మకాంతిని పెంపొందించడంలో ఇది ముందుంటుంది.

మట్కా పప్పుని దుకాణాల్లో తెచ్చుకున్నప్పుడే అవి పగుళ్లు లేకుండా చూసుకోవాలిజ. అలాగే ఈ పప్పులో కొన్నిసార్లు రాళ్లు కలుస్తాయి. కాబట్టి ముందుగా రాళ్ళను ఏరుకోవాలి. తర్వాతే వాటిని నాలుగు నుంచి ఆరు గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత సాధారణ పప్పును వండుకున్నట్టే వండుకోవచ్చు. అలాగే ఈ పప్పుతో కిచిడి కూడా వండుకోవచ్చు. పెసరపప్పుతో కిచిడి ఎలా చేసుకుంటామో... మట్కా పప్పుతో కిచిడి చేయొచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పరోటా, పూరి, చపాతీలు వంటి వాటికి జతగా కర్రీలా వండుకోవచ్చు. దీన్ని కాస్త మసాలాలు జోడించి వండితే రుచి అదిరిపోతుంది. ఈ పప్పుతో టేస్టీ సూపులు కూడా చేసుకోవచ్చు. కొంతమంది ఈ పప్పుని చికెన్ కర్రీలో కూడా వేసి వండుతారు. ఈ పప్పు మిగతా కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు వంటి వాటితో పోలిస్తే చాలా ప్రత్యేకమైనది. చికెన్ కర్రీలో వేసి వండడం వల్ల ఆ కూరకు ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది. మహిళలు, పిల్లలు ఈ పప్పును కచ్చితంగా తినాలి. ఎందుకంటే వారిలోనే రక్తహీనత సమస్య అధికంగా ఉంటుంది. అలాంటి వారు ఈ పప్పు తింటే రక్త హీనత దూరం అవుతుంది. రక్తాన్ని అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. వీటి ధర కూడా అందుబాటులోనే ఉంటుంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు వీటిని తినవచ్చు.

WhatsApp channel

టాపిక్