Heartfailure Symptoms: గుండె ఫెయిలయ్యేముందు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి, అవి ఇవే
Heartfailure Symptoms: గుండె పోటు ఎప్పుడు ఏ క్షణంలో ఎవరికి వస్తుందో చెప్పడం చాలా కష్టం. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు దాడి చేస్తుంది. హార్ట్ ఫెయిలయ్యే వచ్చే ముందు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి.
Heartfailure Symptoms: గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కొందరు హఠాత్తుగా కార్డియాక అరెస్ట్ బారిన పడుతున్నారు. గుండె సంబంధిత సమస్యల్లో కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కూడా ఒకటి. ఈ పరిస్థితి వస్తే గుండె పనితీరు దెబ్బతింటుంది. గుండె ఫెయిల్ అవ్వడం వల్ల మరణం సంభవిస్తుంది. ఈ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గుర్తించి ముందుగానే తగిన సమయంలో చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం కలగకుండా ఉంటుంది. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు కొన్ని ఇదిగో.
హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు
హార్ట్ ఫెయిల్యూర్ అవ్వడానికి ముందు మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ముఖ్యంగా మెట్లు ఎక్కేటప్పుడు, వేగంగా నడిచేటప్పుడు, ఊపిరి అందడం చాలా కష్టంగా మారుతుంది. ఏ పని చేసినా ఊపిరి తీసుకోలేరు. శ్వాస కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. చిన్న చిన్న పనులు చేసినప్పుడూ శ్వాస ఆడదు. విపరీతమైన నీరసం కమ్మేస్తుంది. అలసిపోయినట్టు అవుతారు. ఇలా అవుతున్నారంటే గుండె ఆరోగ్యం బాగోలేదని అర్థం. ఇది గుండె వైఫల్యానికి చిహ్నంగా కూడా భావించాలి. అలాగే పాదాలు, కాళ్లు, చీలమండలలో నీరు చేరి ఉబ్బుతాయి. పొత్తి కడుపు దగ్గర కూడా నీరు చేరుతుంది. దానివల్ల మీరు లావుగా కనిపిస్తారు. గుండె కొట్టుకునే వేగం మారుతుంది. తరచూ గుండె దడ అనిపిస్తుంది. మీ గుండె కొట్టుకునే శబ్దం మీకే వినిపిస్తుంది. ఈ లక్షణాలను తేలిగ్గా తీసుకోకండి. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.
శ్వాస తీసుకున్నప్పుడు గురకలాంటి శబ్దాలు వచ్చినా తేలిగ్గా తీసుకోకూడదు. ఇది గుండె సంబంధిత వ్యాధికి ముఖ్య లక్షణం. గుండె విఫలం అవ్వడానికి ముందు దగ్గు అధికంగా వస్తుంది. అలాగే దగ్గుతో పాటు కొంత శ్లేష్మం కూడా పడుతుంది. గుండె సమస్యతో బాధపడేవారు బరువు త్వరగా పెరుగుతారు. ఆకస్మికంగా బరువు పెరుగుతారు. ఇలా పెరిగారంటే మీకు ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. బరువు పెరిగినా కూడా ఆకలి వేయదు. తినకపోయినా వికారంగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
వయసుతో సంబంధం లేకుండా గుండెను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. యువతలో గుండెపోటు, కార్డియాక్ అరెస్టు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. హార్ట్ ఫెయిల్ అవుతున్నా సందర్భాలు అధికంగానే ఉన్నాయి. కాబట్టి గుండె ఆరోగ్యం కోసం పోషకాహారాన్ని తింటూ ఉండాలి. ధ్యానం లాంటివి చేస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మన శరీరంలోని సున్నితమైన అవయవాల్లో గుండె ఒకటి. దాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి.
టాపిక్