Masoor dal Vada: ఎర్ర కందిపప్పుతో ఇలా క్రంచీగా గారెలు చేయండి, స్నాక్స్‌గా అదిరిపోతాయి-masoor dal vada recipe in telugu know how to make this snack recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Masoor Dal Vada: ఎర్ర కందిపప్పుతో ఇలా క్రంచీగా గారెలు చేయండి, స్నాక్స్‌గా అదిరిపోతాయి

Masoor dal Vada: ఎర్ర కందిపప్పుతో ఇలా క్రంచీగా గారెలు చేయండి, స్నాక్స్‌గా అదిరిపోతాయి

Haritha Chappa HT Telugu
Mar 10, 2024 03:32 PM IST

Masoor dal Vada: ఎర్ర కందిపప్పులో పోషకాలు ఎక్కువ. వీటిలో కేవలం పప్పుగానే కాదు, టేస్టీ గారెలు కూడా చేసుకోవచ్చు. క్రంచీగా ఎర్ర కందిపప్పుతో గారెలు ఎలా చేయాలో తెలుసుకోండి.

మసూర్ దాల్ గారెలు రెసిపీ
మసూర్ దాల్ గారెలు రెసిపీ

Masoor dal Vada: గారెలు పేరు వింటేనే నోరూరిపోతుంది. ఎప్పుడూ మినప్పప్పు గారెలు, శెనగపప్పు గారెలే కాదు... ఓసారి ఎర్ర కందిపప్పుతో గారెలు చేసి చూడండి. ఇవి క్రంచీగా, టేస్టీగా ఉంటాయి. చూస్తుంటేనే నోరూరిపోతాయి. వీటిని చేయడం చాలా సులువు. సాయంత్రం స్నాక్ రెసిపీగా ఇవి ఉపయోగపడతాయి. మసూర్ దాల్ గారెలు ఎలా చేయాలో తెలుసుకోండి.

మసూర్ దాల్ గారెలు రెసిపీలు కావాల్సిన పదార్థాలు

మసూర్ దాల్ (ఎర్ర కందిపప్పు) - ఒక కప్పు

వెల్లుల్లి రెబ్బలు - నాలుగు

పచ్చిమిర్చి - రెండు

అల్లం - చిన్న ముక్క

ఉల్లిపాయ - ఒకటి

మిరియాల పొడి - చిటికెడు

కారం - అరస్పూను

జీలకర్ర పొడి - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

నూనె - వేయించడానికి సరిపడా

మసూర్ దాల్ గారెలు రెసిపీ

1. మసూర్ దాల్ (ఎర్ర కందిపప్పు)ను రెండు గంటల సేపు నానబెట్టాలి.

2. ఇప్పుడు మిక్సీలో నానబెట్టిన ఎర్ర కందిపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, నీళ్లు వేసి రుబ్బాలి.

3. అందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేయాలి.

4. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేయాలి. అందులోనే కొత్తిమీర తరుగు, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి.

5. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

6. నూనె వేడెక్కాక ఎర్రకందిపప్పు మిశ్రమాన్ని గారెల్లా ఒత్తుకుని వేసుకోవాలి.

7. రెండు వైపులా ఎర్రగా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి.

8. టిష్యూ పేపర్లలో వేసి ఒత్తితే అదనపు నూనెను పీల్చేస్తాయి.

9. ఈ గారెలు క్రంచీగా, టేస్టీగా ఉంటాయి.

ఎర్ర కందిపప్పు వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణ కందిపప్పు కన్నా ఎర్ర కందిపప్పు సులువుగా అరుగుతుంది. దీనిలో ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. టమోటో, ఎర్ర కందిపప్పు కలిపి వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఎర్ర కందిపప్పు తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రావు. మలబద్ధకం సమస్య ఉన్నవారు కూడా ఈ ఎర్ర కంది పప్పు తింటే ఆ సమస్య తీరిపోతుంది.

దీనిలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు కచ్చితంగా తినాల్సిన పప్పు మసూర్ దాల్. సాధారణ కందిపప్పులాగే ఈ ఎర్ర కందిపప్పును కూడా వారానికి 4 సార్లు తింటే ఎంతో మంచిది. రక్తహీనత సమస్యతో బాధపడుతున్నవారు మసూర్ దాల్ తింటే ఎంతో ఆరోగ్యం. నీరసం, అలసట వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే మసూర్ దాల్ ను ఆహారంలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక ఎర్ర కందిపప్పు. దీనితో చేసిన ఆహారాలు తినడం వల్ల ఎక్కువ సేపు పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది. త్వరగా ఆకలి వేయదు. కాబట్టి బరువు తగ్గిపోతారు. వీటితో చేసిన గారెలు కూడా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి.

WhatsApp channel

టాపిక్