Toor dal Dosa: క్రిస్పీ కందిపప్పు దోశ.. కొత్త రుచితో నచ్చేస్తుంది..-crispy toor dal dosa recipe for breakfast in easy steps ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Toor Dal Dosa: క్రిస్పీ కందిపప్పు దోశ.. కొత్త రుచితో నచ్చేస్తుంది..

Toor dal Dosa: క్రిస్పీ కందిపప్పు దోశ.. కొత్త రుచితో నచ్చేస్తుంది..

HT Telugu Desk HT Telugu
Sep 15, 2023 06:30 AM IST

Toor dal Dosa: కందిపప్పు ఫ్లేవర్ తో చేసే దోశలు రుచిలో అద్భుతంగా ఉంటాయి. దోశెల్లో కొత్తరకం తిన్నామనే భావన కలుగుతుంది. వాటిని ఎలా చేసుకోవాలో చూసేయండి.

కందిపప్పు దోశ
కందిపప్పు దోశ (istock)

అల్పాహారంలోకి దోశల్ని మించిన మంచి ఆహారం లేదు. కడుపు నిండుగా ఉంటుంది. ఎక్కువ నూనె అవసరం ఉండదు. ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదు. అయితే మామూలు దోశ లాగా కాకుండా కాస్త కొత్తరుచి కావాలనిపిస్తే కందిపప్పు ఫ్లేవర్ దోశ చేసుకుని చూడండి. దోశ కొత్త రుచితో నచ్చుతుంది.

కావాల్సిన పదార్థాలు:

1 కప్పు బియ్యం

సగం కప్పు కంది పప్పు

2 చెంచాల మినప్పప్పు

చిన్న అల్లం ముక్క

4 ఎండుమిర్చి

తగినంత ఉప్పు

2 చెంచాల నూనె

సగం చెంచా ఆవాలు

సగం చెంచా జీలకర్ర

1 రెబ్బ కరివేపాకు, తరుగు

సగం కప్పు ఉల్లిపాయ ముక్కలు

చిటికెడు ఇంగువ

తయారీ విధానం:

  1. బియ్యం, కందిపప్పు, మినప్పప్పును కలిపి ఒకేసారి శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు మునిగేనన్ని నీళ్లు పోసి 5 నుంచి 6 గంటల పాటూ నానబెట్టుకోవాలి.
  2. ఇప్పుడు బియ్యం, పప్పులను మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఎండుమిర్చి, అల్లం ముక్క,ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
  3. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకుని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి చిక్కగా లేకుండా నీళ్లు కలుపుకోవాలి.
  4. ఆలోపు వేరొక కడాయిలో నూనె వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగనివ్వాలి. ఈ తాలింపు చల్లారాక మిక్సీ పట్టుకున్న పిండిలో కలుపుకోవాలి.
  5. దోశ పెనం వేడి చేసుకుని ఈ పిండిని వీలైనంత పలుచని దోశల్లాగా పోసుకోవాలి. పిండి మరీ చిక్కగా అనిపిస్తే నీళ్లు కలుపుకోవాలి.
  6. నూనె వేసుకుంటూ రంగు మారేదాక రెండు వైపులా కాల్చుకుంటే చాలు. కందిపప్పు దోశ సిద్ధం.

Whats_app_banner