- 55 నుండి 60 సంవత్సరాల వయస్సు దాటిన తరువాత పొట్ట క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
- మద్యపానం చేసే మహిళలతతో పోలిస్తే పురుషుల్లో పొట్ట క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
- వారసత్వంగా కూడా పొట్ట క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధివ ఉంటే వారసులు జాగ్రత్తగా ఉండాలి.
- ఊబకాయం బారిన పడిన వారిలో కూడా ఇదొచ్చే అవకాశం ఉంది.
పొట్ట క్యాన్సర్ లక్షణాలు
- నొప్పి, అసౌకర్యం: కొంతమందికి పొత్తికడుపు ఎగువ భాగంలో అసౌకర్యం అనిపిస్తుంది లేదా నొప్పి వస్తుంది. ముఖ్యంగా ఆహారం తిన్న తర్వాత పొట్టలో మండుతున్న అనుభూతి వస్తుంది. అలాగే కడుపుబ్బరం కనిపిస్తుంది. మలబద్ధకం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తేలికపాటి ఆహారం తీసుకుంటున్నా కూడా ఈ అజీర్ణం నిరంతరంగా ఇబ్బంది పెడుతుంటే ఓసారి పొట్ట క్యాన్సర్ ఉందేమో చెక్ చేసుకోవాలి.
- ఆకలి లేకపోవడం / బరువు తగ్గడం: వ్యక్తులు అకస్మాత్తుగా బరువు తగ్గిపోతారు. వారికి ఆకలి కూడా వేయదు. రోజంతా ఏమీ తినకపోయినా వారికి తినాలన్న కోరిక కలగదు. ఇది వారి ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది. పోషకాహార లోపం వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
- బలహీనత: చిన్న పని చేసినా బలహీనంగా అనిపిస్తుంది. తీవ్రంగా అలసిపోయినట్టు అవుతారు. ఇవన్నీ పొట్ట క్యాన్సర్ ను సూచిస్తుంది. తినడం, నడవడం, ఇంటి పనులు చేయడం వంటి వారి రోజువారీ పనులు కూడా చేయలేరు. ఆకస్మికంగా బలహీనంగా మారిపోతారు.
- కడుపు నొప్పి: కడుపులో పదునైన తిమ్మిరి వంటి నొప్పి వస్తుంది. ఇది కాలం గడిచే కొద్దీ భరించలేనిదిగా మారుతుంది. ఈ నొప్పి పొట్ట మధ్య భాగంలో లేదా ఎగువ పొత్తికడుపులో వస్తూ ఉంటుంది. కడుపు నొప్పి వస్తూ పోతూ ఉంటుంది.
- వికారం, వాంతులు: ఏదైనా ఆహార పదార్థాన్ని చూసిన వెంటనే, ఆహారం తినేటప్పుడు వారికి ఏవగింపుగా అనిపిస్తుంది. ఏమీ తినకుండానే వాంతులు అవుతాయన్న భావన కలుగుతుంది. ఇది బరువు తగ్గడానికి, ఆకలి లేకపోవడానికి దారితీస్తుంది.
- మలంలో నెత్తురు: పొట్ట క్యాన్సర్ జీర్ణశయాంతర ప్రేగులలో రక్తస్రావానికి దారితీస్తుంది. దీని ఫలితంగా వాంతులు లేదా మలంలో రక్తం కనిపిస్తుంది. ఈ రక్తం సాధారణంగా నలుపు రంగులో ఉంటుంది. దీనిని హెమటోచెజియా అని కూడా పిలుస్తారు. నెత్తుటి మలం ఇతర అంతర్లీన ఆరోగ్య పరిస్థితులను కూడా సూచిస్తుంది. వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా అవసరం.
చికిత్స ఎలా
వైద్యులు చెప్పిన ప్రకారం… కడుపు క్యాన్సర్ చికిత్స పొట్ట లోపలి పొరలో క్యాన్సర్ ఎంతవరకు వ్యాపించిందనే దానిపై ఆధారపడి ఉంటుంది. రోగ నిర్ధారణ సాధారణంగా ఎఎండోస్కోపీ, బయాప్సీ, సిటి స్కాన్ ద్వారా జరుగుతుంది. క్యాన్సర్ దశను బట్టి రోగికి చికిత్స ప్రారంభిస్తారు. శస్త్రచికిత్స చేయించడానికి ముందుగా రోగికి కీమోథెరపీ ఇస్తారు. ఇది తగ్గడానికి ఎక్కువ సమయం పడుతుమంది.