Potals: ఈ సీజన్లో దొరికే పొటల్స్ కచ్చితంగా తినండి, చర్మం మెరిసిపోవడంతో పాటూ బరువు తగ్గుతారు
Potals: వేసవిలో దొరికే పొటల్స్ కూరగాయను అందరూ తినాల్సిందే. దీని రుచి కూడా అదిరిపోతుంది. పొటల్స్ వల్ల ఆరోగ్యానికి మ్యాజిక్ బెనిఫిట్స్ అందుతాయి.
వేసవి రోజుల్లో పర్వాల్ లేదా పొటల్స్ లభిస్తాయి. సీజనల్‌గా దొరికే ఈ కూరగాయలను కచ్చితంగా తినాల్సిన ఆహారం. మనదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కూరగాయ ఇది. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇది లభిస్తుంది. దీనితో రకరకాల వంటకాలు వండుకోవచ్చు. పొటల్స్ వేపుడు, పొటల్స్ కూర చాటా టేస్టీగా ఉంటాయి. స్టఫ్డ్ పొటల్స్ కర్రీ కూడా రుచిగా ఉంటుంది. ఇది ఏ విధంగా తయారుచేసినా తినడానికి అద్భుతంగా ఉంటుంది. ఇది రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. శరీరం నుంచి కొవ్వు తగ్గడం నుండి మెరిసే చర్మం వరకు పర్వాల్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
పొటల్స్ ఎందుకు తినాలి?
ప్రతి సీజన్లో కొన్ని రకాల కూరగాయలు దొరుకుతాయి. అలాంటి వాటిల్లో పొటల్స్ ఒకటి. ఇవి ఎండల్లో లభిస్తాయి. ఇవి మార్కెట్లో అధికంగానే లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. విటమిన్ సి, ఫైబర్, పొటాషియం వంటివి పొటల్స్‌లో మంచి మోతాదులో లభిస్తాయి. దీన్ని తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయి కాబట్టి బాడీ ఆరోగ్యంగా ఉంటుంది.
పర్వాల్ లో ఉండే విటమిన్స్, మినరల్స్ చర్మం మెరిసేలా చేస్తాయి. వీటిని తరచూ తినడం వల్ల ముఖంపై వృద్ధాప్య లక్షణాలు తగ్గుతాయి. దీన్ని తినడం వల్ల ముఖంపై ముడతలు, సన్నని గీతలు, మరకలు తొలగిపోతాయి. ఎండాకాలంలో ముఖంపై డల్ నెస్ వచ్చేస్తుంది. అలాంటి లక్షణాలను పర్వాల్ తగ్గిస్తుంది. అది తొలగిపోయి ముఖంపై మెరుపును తెచ్చే శక్తి పొటల్స్ కి ఉంది.
బరువు తగ్గుతారు
పర్వాల్ లో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. మలబద్దకం, ఎసిడిటీని కూడా ఇది తొలగిస్తుంది. పర్వాల్ తినడం వల్ల పొట్ట సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనితో పాటు ఇందులో క్యాలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. కొవ్వు కూడా ఉండదు. మీ బరువు కూడా వేగంగా పెరిగితే, మీరు మీ ఆహారంలో పర్వాల్ ను తప్పనిసరిగా చేర్చుకోవాలి. పర్వాల్ తినడం ద్వారా పెరుగుతున్న బరువును చాలా వరకు నియంత్రించవచ్చు.
పొటల్స్ కూరగాయ ఒక ఆరోగ్యకరమైన ఆహారం. అలాగే దీన్ని అనేక విధాలుగా ఔషధంగా ఉపయోగిస్తారు. పర్వాల్ మొక్క మూలాన్ని గ్రైండ్ చేసి తలకు అప్లై చేయడం వల్ల తలనొప్పి సమస్య తొలగిపోతుంది. పర్వాల్ ను నెయ్యిలో ఉడికించి తింటే కంటి చూపు కాంతివంతంగా మారుతుంది. దీని కూరగాయ తినడం వల్ల డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది.
డయాబెటిస్ అదుపులో ఉండాలంటే షుగర్ పేషెంట్లు వారానికి రెండు మూడు సార్లు పొటల్స్ ను తినడం చాలా అవసరం. పొటల్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి నిండుగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ తో పోరాడే శక్తిని అందిస్తాయి. ఇది గుండెకు రక్షణను అందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణం పొటల్స్ కు ఉంది. ఎన్నో తీవ్రవ్యాధులు రాకుండా ఇవి అడ్డుకుంటాయి.
ః
టాపిక్