(1 / 6)
పానీ పూరీలు ఎంతో మందికి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్. అయితే కర్ణాటకలో దొరికిన పానీ పూరీలు ఆరోగ్య ప్రమాణాలు సరిగా లేవని వైరల్ అవుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా పానీ పూరీల నమూనాలను సేకరించగా అందులో 22 శాతం శాంపిల్స్ ఆరోగ్య ప్రమాణాలు పాటించలేదు. సేకరించిన 260 నమూనాల్లో 41 నమూనాల్లో కృత్రిమ రంగులు, క్యాన్సర్ కు కారణమయ్యే కార్సినోజెనిక్ ఏజెంట్లను గుర్తించారు. 18 శాంపిల్స్ మానవ వినియోగానికి పనికిరావని తేలింది. పానీ పూరీలను క్రమం తప్పకుండా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది.
(Unsplash)(2 / 6)
పానీ పూరీ బండ్లు ఎక్కువగానే రోడ్ల మీదే కనిపిస్తాయి. అపరిశుభ్రమైన పాత్రలు, కలుషిత నీరు, హానికరమైన పదార్థాలు వంటి వాటివల్ల ఎక్కువ వ్యాధులు సంక్రమిస్తాయి.
(Unsplash)(3 / 6)
పానీ పూరీని ఎక్కువ మోతాదులో తీసుకుంటే అధిక క్యాలరీలు వస్తాయి. పుదీనా నీరు, పానీ పూరీతో వడ్డించే తీపి చట్నీ హానికరమైన ప్రభావాలను కలిగిస్తాయి.
(Unsplash)(4 / 6)
పానీపూరీ మిశ్రమంలో గుజ్జు చేసిన బంగాళాదుంప మిశ్రమం, పుదీనా నీటిలో ఉప్పు, ఇతర పదార్థాలు ఉంటాయి, ఇవి అధిక సోడియం శరీరంలో చేరడానికి దోహదం చేస్తాయి, ఇది అధిక రక్తపోటు, హృదయ సంబంధ సమస్యలకు దారితీస్తుంది.
(Unsplash)(5 / 6)
పానీ పూరీలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు అజీర్ణం, గుండెల్లో మంటకు దారితీస్తాయి. పానీ పూరీల్లో ఉపయోగించే కారాన్ని అధిక మోతాదులో తీసుకుంటే జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది.
(Unsplash)(6 / 6)
పూరీ డీప్ ఫ్రైడ్ ఫుడ్, ఇది కొవ్వు నిండిన స్ట్రీట్ ఫుడ్. ఇది బరువు పెరగడానికి, అధిక కొలెస్ట్రాల్ స్థాయికి కూడా దారితీస్తుంది.
(Unsplash)ఇతర గ్యాలరీలు