Improve Your Memory । జ్ఞాపకశక్తి పెంచుకోవాలనుకుంటే.. ఈ 5 చిట్కాలను పాటించండి!-check 5 easy ways to improve your memory naturally
Telugu News  /  Lifestyle  /  Check 5 Easy Ways To Improve Your Memory Naturally
Ways To Improve Your Memory
Ways To Improve Your Memory (Unsplash/Shutterstock)

Improve Your Memory । జ్ఞాపకశక్తి పెంచుకోవాలనుకుంటే.. ఈ 5 చిట్కాలను పాటించండి!

25 January 2023, 13:47 ISTHT Telugu Desk
25 January 2023, 13:47 IST

Ways To Improve Your Memory: మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారా? ఏ విషయం గుర్తుపెట్టుకోలేకపోతున్నారా? మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే సులభమైన మార్గాలు ఇక్కడ చూడండి.

మీకు ఈ మధ్య ఏ విషయం గుర్తుండటం లేదా? మీ జ్ఞాపకశక్తి మునుపటిలా కాకుండా తగ్గిపోయిందని భావిస్తున్నారా? అయితే కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. జ్ఞాపకశక్తి మందగించడం అనేది తేలికగా తీసుకోకూడని సమస్య, ఇది మెదడు పనితీరుతో ముడిపడి ఉంటుంది. జ్ఞాపకశక్తి అనేది మన మెదడులో సమాచారాన్ని నిల్వచేసి, అవసరమైనపుడు తిరిగి గుర్తు చేసే ఒక ప్రక్రియ.

వయసు ప్రభావం, ఒత్తిడి- ఆందోళనలు, నిద్రలేమి సమస్యలు, గాయం- నొప్పి (శారీరకమైన లేదా మానసికమైన) వంటి అనేక అంశాలు జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తాయి.

జ్ఞాపకశక్తి కోల్పోవడం అనేది చిత్తవైకల్యానికి సంకేతం కావచ్చు. చిత్తవైకల్యం ఉన్నప్పుడు ఆలోచన, భాష, ప్రవర్తనను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది అల్జీమర్స్ వంటి శాశ్వతమైన నాడీ సంబంధిత సమస్యకు దారితీయవచ్చు. దీనికి చికిత్స లేదు. అయితే మీరు ప్రారంభ దశలోనే జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే ప్రయత్నాలు చేయడం వలన పరిస్థితి సాధారణ స్థితిలో ఉంటుంది.

Ways To Improve Your Memory - మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరచే మార్గాలు

జ్ఞాపకశక్తిని మెరుగు పరుచుకోవడానికి సులభమైన వివిధ మార్గాలు ఉన్నాయి. ఇందులో భాగంగా కొత్త భాష నేర్చుకోవడం లేదా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం, సంగీత వాయిద్యం వాయించడం నేర్చుకోవడం లేదా మీ పదజాలం విస్తరించడం వంటివి మీ జ్ఞాపకశక్తిని పెంచుతాయి. జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి కొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. మంచి పోషకాహారం తీసుకోండి

మీరు తినే ఆహారం కూడా మీ జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి అన్ని రకాల పోషకాలు కలిగిన పౌష్టికాహారం తీసుకోవడం ముఖ్యం. ఉదాహరణకు థయమిన్ పోషకలోపం వలన జ్ఞాపకశక్తి మందగిస్తుంది. పిస్తాపప్పులో థయామిన్ పుష్కలంగా ఉంటుంది, ఇవి తినాలి. అలాగే ఉడికించిన గుడ్లు, అల్లనేరేడు పండ్లు, గోధుమలు, క్యారెట్లు, సోయాబీన్, పొద్దుతిరుగుడు మొదలైనవి తీసుకోవడం వలన జ్ఞాపకశక్తికి పెరుగుతుంది.

2. కొత్త విషయాలు నేర్చుకోవడం

ఏదీ రాదు, ఏదీ చాతకాదు అనుకోకుండా నిరంతరం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు సవాలు చేసుకోవడం, సాధిస్తాను అనుకోవడం వలన న్యూరోప్లాస్టిసిటీని పెంచుతుంది. ఈ న్యూరోప్లాస్టిసిటీ అనేది మెదడు ఏదైనా కొత్త విషయాన్ని స్వీకరించగల సామర్థ్యం. ఇలా మీరు కొత్తది ఏదైనా మీ మెదడులో నిల్వ చేసుకోవడం వలన దానికి ప్రతిస్పందనగా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మీరు కొత్త వంట నేర్చుకోవడం, లేదా కొత్త భాషను నేర్చుకోవడం మాట్లాడటం, రాయడం, చదవడం ఏదైనా కావచ్చు. అది మెదడుకు మేత అవుతుంది.

3. తగినంత నిద్ర

చాలా కాలంగా సరైన నిద్ర లేకపోవడం బలహీనమైన జ్ఞాపకశక్తితో ముడిపడి ఉంది.మెమరీ కన్సాలిడేషన్‌లో నిద్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, ఈ ప్రక్రియలో స్వల్పకాలిక జ్ఞాపకాలు బలోపేతం అవుతాయి అలాగే దీర్ఘకాలిక జ్ఞాపకాలుగా రూపాంతరం చెందుతాయి.మీకు నిద్రలేమి సమస్య ఉంటే, అది మీ జ్ఞాపకశక్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి తగినంత నిద్రపోండి. రోజుకు 7-9 గంటలు నిద్రపోవడం ద్వారా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

4. మెదడుకు పదును పెట్టండి

మెదడుకు పదును పెట్టే ఆటలు ఆడటం ద్వారా మీ అభిజ్ఞా నైపుణ్యాలను పెంచుకోవచ్చు. ఇది మీ జ్ఞాపకశక్తిని పెంచడానికి ఒక ఆహ్లాదకరమైన, ప్రభావవంతమైన మార్గం. క్రాస్‌వర్డ్‌లు, వర్డ్-రీకాల్ గేమ్‌లు, టెట్రిస్ మొదలైనవి జ్ఞాపకశక్తిని బలోపేతం చేయడానికి అద్భుతమైన మార్గాలు.

5. మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్

మైండ్‌ఫుల్‌నెస్ అనేది ఒక మానసిక స్థితి. ఇందులో భాగంగా మీరు మీ ప్రస్తుత పరిస్థితిపై దృష్టి పెడతారు, మీ చుట్టూ ఉన్న పరిసరాలు, మీ భావాల గురించి అవగాహన కలిగి ఉంటారు. ఇందుకోసం మీకు సహాయపడే ఒక మార్గం మైండ్‌ఫుల్‌నెస్ ధ్యానం. ఈ రకమైన ధ్యానంలో మీరు అన్నింటిని మీ బుద్ధిపూర్వకంగా అభ్యాసం చేస్తారు. ఈ ధ్యానం ఒత్తిడిని తగ్గించడంలో, ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

సంబంధిత కథనం

టాపిక్