Papaya Leaf Benefits : బొప్పాయి ఆకులతో క్యాన్సర్‌ నయం అవుతుందా?-can papaya leaf use for cancer treatment all you need to know ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Papaya Leaf Benefits : బొప్పాయి ఆకులతో క్యాన్సర్‌ నయం అవుతుందా?

Papaya Leaf Benefits : బొప్పాయి ఆకులతో క్యాన్సర్‌ నయం అవుతుందా?

Anand Sai HT Telugu
Mar 29, 2024 04:30 PM IST

Papaya Leaf Benefits : క్యాన్సర్ అనేది అతిపెద్ద వ్యాధులలో ఒకటి. మనిషిని చంపగలదు. క్యాన్సర్‌ లక్షణాలు కూడా తెలియకుండానే చాలా మంది చనిపోయారు. అయితే బొప్పాయి ఆకులు క్యాన్సర్‌ను నయం చేస్తాయా?

బొప్పాయి ఆకుల ప్రయోజనాలు
బొప్పాయి ఆకుల ప్రయోజనాలు (Unsplash)

క్యాన్సర్ మొదటి దశను నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. కానీ క్యాన్సర్ తీవ్రమైన దశకు చేరుకున్న తర్వాత, వాటిని నయం చేయడం కష్టం. ఇలాంటి ప్రాణాంతక వ్యాధిని నయం చేయడానికి బొప్పాయి ఆకులే సరిపోతాయని పరిశోధనలు చెబుతున్నాయి.

క్యాన్సర్ కణాలే క్యాన్సర్‌కు కారణమవుతాయి. మొదట్లో చిన్నగా ఉన్నా.. తర్వాత తర్వాత దీనితో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. సాధారణంగా మనం పండ్ల ఆకులను పెద్దగా పటించుకోలేం. కానీ బొప్పాయి ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి, కణాలను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉండి శరీరానికి బలాన్ని ఇస్తుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేసి శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధించడం ద్వారా శరీరాన్ని రక్షిస్తుంది. బొప్పాయి ఆకు సారం కాలేయం, క్లోమం, ఊపిరితిత్తుల వ్యాధులను నయం చేస్తుంది.

బొప్పాయి ఆకులను తింటే క్యాన్సర్ నయం అవుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఇది మెుదటి దశలోనే తీసుకోవాలి. బొప్పాయి ఆకులలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. రక్తనాళాలను సరిచేసి వ్యాధి రహిత జీవితాన్ని అందిస్తుంది. నయం చేయలేని అనేక వ్యాధులను నయం చేసే శక్తి దీనికి ఉంది. అసిటోజెనిన్ (ఎసిటోజెనిన్) ముఖ్యంగా క్యాన్సర్‌ను నయం చేయడానికి సహాయపడుతుంది. దెబ్బతిన్న రక్తకణాలను పునరుద్ధరించి శరీరంలో ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ముందుగా ఒక పాత్రలో 2 లీటర్ల నీరు పోసి అందులో 7 బొప్పాయి ఆకులను వేయాలి. మీడియం వేడి మీద 2 గంటలు ఉడకబెట్టండి. నీరు సగానికి తగ్గిన తర్వాత దానిని వడకట్టండి. తినే ముందు ఈ నీటిని తాగండి. మిగిలిన నీటిని సిరామిక్ డబ్బాలో వేసి దాచి తాగవచ్చు. దీన్ని రోజుకు రెండుసార్లు తాగడం మంచిది. ఇలా చేయడం వల్ల క్యాన్సర్‌ని నయం చేయవచ్చు. ఈ బొప్పాయి రసం అతిగా మాత్రం తీసుకోవద్దు. చాలా తక్కువగా తీసుకోవాలి. ఈ రసం ఎక్కువగా తీసుకుంటే కాలేయం మీద ప్రభావం చూపిస్తుంది.

క్యాన్సర్ నయం కావాలంటే బొప్పాయిని క్యాప్సూల్ రూపంలో కూడా తీసుకోవచ్చు. బొప్పాయి ఆకులను ఎండలో ఎండబెట్టి, ఆరిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి. అప్పుడు మీరు దానిని క్యాప్సూల్‌గా రోజుకు 2 సార్లు తినవచ్చు. ప్రస్తుతం ఈ క్యాప్సూల్స్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉన్నాయి. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. కాబట్టి మితంగా తినండి.

ప్లేట్‌లెట్స్ శరీర బలాన్ని నిర్ధారిస్తాయి. వాటి సంఖ్య తగ్గితే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. బొప్పాయి ఆకు ప్లేట్‌లెట్ కౌంట్‌ను సరైన స్థాయిలో ఉంచడానికి ఉపయోగిస్తారు. ఇది క్యాన్సర్ కణాలను ప్లేట్‌లెట్స్‌పై ప్రభావితం చేయకుండా నిరోధిస్తుంది. డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా బొప్పాయి ఆకు నయం చేస్తుంది. కానీ అతిక మెుతాదులో మాత్రం తీసుకోకూడదు.

బొప్పాయి ఆకుల్లో విటమిన్ ఎ, బి, సి, డి, ఇ పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఫ్లేవనాయిడ్స్, కెరోటిన్లు శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. ఇవి ఎక్కువ పోషకాలను అందించి అన్ని రోగాలను నయం చేస్తాయి. ఆకలి లేకపోవడం వంటి సమస్యల నుంచి శాశ్వత ఉపశమనం కలిగిస్తుంది. గర్భిణీ స్త్రీలు దీనికి దూరంగా ఉండాలి. మీ వైద్యుని సలహాతో ఈ బొప్పాయి ఆకును తీసుకోవడం ఉత్తమం.