Tamarind Juice Benefits : చింతపండు రసం ఎలా చేయాలి? ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
Tamarind Juice : ఊర్లలోకి వెళితే చింత చెట్లు చాలా కనిపిస్తాయి. ఈ చెట్టుతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చింతపండు రసం చేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది.
మన ఊరిలో విరివిగా కనిపించే చింతచెట్టులో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చింతపండును వంటల్లో వాడుతుంటాం. ఉగాది సమయంలో పచ్చడిగా చేసుకుని తాగుతాం. అయితే ఈ చింతపండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా చింతపులుసు చేసుకుని కూడా అన్నంలో కలుపుకొని తింటుంటాం. ఎప్పటి నుంచో ఈ చెట్టును చాలా రకాలుగా ఉపయోగిస్తుంటాం. అయితే చింతపండుతో చేసుకుని తాగితే జ్యూస్ వలన శరీరానికి మంచి జరుగుతుంది.
పుల్లని రుచితో ఉండే చింతపండు రసం వివిధ ఆరోగ్య సమస్యలకు సహజమైన చికిత్సగా మారుతుంది. ఇది మంచి ఆరోగ్యానికి మన శరీరానికి నిరంతరం అవసరమయ్యే పోషకాల కోసం ఉపయోగపడుతుంది. చింతపండు రసం వివిధ రకాల కడుపు సమస్యలు, కంటి వ్యాధుల నుండి బయటపడటానికి సహయపడుతుంది.
మధుమేహాన్ని నియంత్రించడం, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రోగనిరోధక వ్యవస్థను నిర్వహించడం, ఊబకాయాన్ని నిర్వహించడం, గుండె ఆరోగ్యం, అద్భుతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేయడం వంటివి చింతపండులో ఉన్నాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, బ్లడ్ ప్యూరిఫైయర్, చర్మ పునరుజ్జీవనం, కంటి ఆరోగ్య మద్దతు, మలం మృదుత్వంలాంటి ఉపయోగాలు కూడా దీనివలన దొరుకుతాయి.
100 గ్రాముల చింతపండు రసంలో చాలా పోషక విలువలు ఉంటాయి. అవేంటంటే.. 375 mg పొటాషియం, 35 mg కాల్షియం, 92 mg మెగ్నీషియం, 54 మి.గ్రా భాస్వరం, 16 mg థయామిన్, 10గ్రా ప్రోటీన్, 0.7 mg రిబోఫ్లావిన్.
చింతపండు రసం ఎలా చేయాలి?
కావాల్సిన పదార్థాలు : చింతపండు, చక్కెర, నీరు, కాస్త నిమ్మకాయ.
చింతపండు రసం తయారీ విధానం
చింతపండును 15 నిమిషాలు నీటిలో నానబెట్టాలి. చింతపండు రసాన్ని పిండి అందులో పంచదార కలపాలి. అవసరమైన మొత్తంలో చల్లటి నీటిని జోడించండి. అందులో నాలుగైదు చుక్కల నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఐస్ క్యూబ్స్ వేసి బాగా గ్రైండ్ చేయాలి.
జీవక్రియను పెంచడానికి వివిధ చికిత్సలను ప్రయత్నించినప్పటికీ.. చింతపండు రసం బాగా ఉపయోగపడుతుంది. చింతపండు రసం శరీరంలో జీవక్రియను పెంచుతుంది. బరువును అదుపులో ఉంచుతుంది. వివిధ వ్యాధులను నివారిస్తుంది.
చింతపండు రసంలో పోషకాలు
చింతపండు రసంలో మెగ్నీషియం, పొటాషియం వంటి అంశాలు ఉంటాయి. ఇవి పొట్టలోని ఆమ్లాలను, పొట్టలో పుండ్లకు సంబంధించిన కారకాలను సమర్థవంతంగా బయటకు పంపుతాయి. పేగు కదలికలను, మలబద్ధకాన్ని నియంత్రిస్తుంది. చింతపండు రసంలో డయేరియా, ఇన్ఫెక్షన్ల (హేమోరాయిడ్స్) నుండి వచ్చే పొత్తికడుపు వాపులను నియంత్రించడానికి తగినంత పీచు ఉంటుంది.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుతుంది
శరీరంలో నిల్వ ఉండే కార్బోహైడ్రేట్ రేట్లను తగ్గించే సామర్థ్యం చింతపండు రసం మధుమేహ వ్యాధిగ్రస్తులకు గొప్ప ఔషధం. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడానికి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది అద్భుతమైన పోషక రసం. క్లోమగ్రంధిని విషపూరితం కాకుండా కాపాడుతుంది.
బరువు పెరిగే వారికి ఉపయోగపడుతుంది
బరువు పెరిగే వారు తమ రెగ్యులర్ డైట్‌లో చింతపండు రసాన్ని పంచదారతో కలిపి తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చింతపండు రసంలో పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి వివిధ పోషకాలు ఉంటాయి.
విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఫోలిక్ యాసిడ్ రక్తాన్ని శుద్ధి చేయడానికి, ప్రసరణను మెరుగుపరచడానికి అవసరం. అవి తగినంత పరిమాణంలో చింతపండు రసంలో పుష్కలంగా ఉంటాయి. రక్త ప్రసరణకు గొప్ప నివారణగా పరిగణించబడతాయి.
వేసవి కాలంలో చింతపండు పానీయాలను తయారు చేసి ఎక్కువ పరిమాణంలో తీసుకుంటారు. వేసవి తాపం నుండి శరీరాన్ని రక్షించడానికి, శరీరంలోని వేడిని తగ్గించడానికి చింతపండు అద్భుతమైన రెమెడీగా చాలా సహాయపడుతుంది.
కంటి సమస్యలకు ఉపయోగం
చింతపండు రసంలో ఉండే వివిధ పోషకాలు కంటి వ్యాధులు, దృష్టి లోపాలను మెరుగుపరుస్తాయని వివిధ పరిశోధన ఫలితాలు సూచించాయి. కంటి శుక్లాలు, కళ్లలో నీరు కారడం వంటి సమస్యలకు కూడా ఇది ఔషధంగా పరిగణిస్తారు. అయితే దీనికంటే ముందు కంటికి దెబ్బతినకుండా ఉండేందుకు సరైన సమయంలో తగిన వైద్యుడిని సంప్రదించి చెక్ చేయించుకోవడం చాలా ముఖ్యం.
చింతపండు రసం అధికంగా తీసుకోవద్దు
ముఖ్యగమనిక ఏంటంటే చింతపండును అధికంగా తీసుకుంటే విరేచనాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా తక్కువ మెుత్తంలో తీసుకోవాలి. అప్పుడే దాని నుంచి ప్రయోజనాలు పొందుతారు. ఏదైనా కొత్తగా ప్రయత్నించే ముందు వైద్యుడిని సంప్రదించడం మరిచిపోవద్దు.