Papaya Breakfast | బ్రేక్‌ఫాస్ట్‌లో బొప్పాయిని తినండి.. ముఖ్యంగా ఉపవాసం ఉండే వారు!-break your fasting with papaya fruit that control blood sugar and gives instant energy know more details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Papaya Breakfast | బ్రేక్‌ఫాస్ట్‌లో బొప్పాయిని తినండి.. ముఖ్యంగా ఉపవాసం ఉండే వారు!

Papaya Breakfast | బ్రేక్‌ఫాస్ట్‌లో బొప్పాయిని తినండి.. ముఖ్యంగా ఉపవాసం ఉండే వారు!

HT Telugu Desk HT Telugu
Mar 30, 2023 09:35 AM IST

Papaya Breakfast: ఉదయం ఖాళీ కడుపుతో అల్పాహారంగా బొప్పాయి పండు తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు, ఎందుకు తినాలో తెలుసుకోండి.

Papaya health benefits
Papaya health benefits (Pixabay)

Papaya Breakfast: ఇది పండుగల సీజన్, చాలా మంది ఉపవాసాలు కూడా ఉంటారు. అయితే మీరు లేదా మీ కుటుంబ సభ్యులు తరచుగా ఉపవాసాలు ఉండే వారైతే మీ కోసమే ఈ సమాచారం. ఉపవాసం తర్వాత ఉదయం ఎలాంటి అల్పాహారంతో బ్రేక్‌ఫాస్ట్ చేయాలనేది చాలా మంది ఆలోచించరు. అయితే బొప్పాయి పండును అల్పాహారంగా తీసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే సుదీర్ఘమైన భోజన విరామం తర్వాత మీరు ఏదైనా ఆహారాన్ని తీసుకుంటే అది సరిగ్గా జీర్ణం కాదు, జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు కలుగుతాయి, కడుపు ఉబ్బరం, కడుపులో మంట ఉండవచ్చు. ఇది ఇతర అనారోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.

అయితే భోజన విరామం తర్వాత బొప్పాయి పండును (Papaya after fasting) మీ అల్పాహారంలో చేర్చుకుంటే అది మీ జీర్ణవ్యవస్థను తిరిగి చురుకుగా చేస్తుంది, మీ జీవక్రియను ప్రేరేపిస్తుంది. బొప్పాయి పండు పాపైన్ అనే ఎంజైమ్‌ను కలిగి ఉంటుంది, ఇది ఆహారాన్ని త్వరగా విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది, ప్రోటీన్ల విచ్ఛిన్నతను కూడా వేగవంతం చేస్తుంది. ఉపవాసంలో మీ శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి వేగంగా గ్రహించేలా చేస్తుంది. బొప్పాయిని ఖాళీ కడుపుతో తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం వంటి ఎలాంటి జీర్ణ సమస్యలు రాకుండా నివారిస్తుంది. దీనిలో చైమోపాపైన్ అనే మరొక ఎంజైమ్ కూడా ఉంటుంది. ఇది మంట, నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

బొప్పాయిలో ఫైబర్‌ సమృద్ధిగా ఉంటుంది, కాబట్టి ఈ పండు తిన్నప్పుడు కడుపు నిండిన సంతృప్తి కలుగుతుంది. కాబట్టి ఉపవాసం తర్వాత ఆకలితో అతిగా తినడాన్ని ఇది నివారిస్తుంది. ఇంకా ఇందులో కేలరీలు తక్కువ ఉంటాయి, నీటి శాతం ఎక్కువ ఉంటుంది. ఇది మీ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది (Helps Digestion), ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది, మిమ్మల్ని రీహైడ్రేట్ చేస్తుంది.

Papaya Health Benefits- బొప్పాయి పండుతో ప్రయోజనాలు

అదనంగా ఈ పండులో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ త్వరగా శరీరంలో శక్తి స్థాయిలను భర్తీ చేస్తాయి. బొప్పాయిలోని ఫోలిక్ యాసిడ్, ఐరన్ రక్తహీనత, అలసటను దూరం చేస్తాయి. ఇందులోని విటమిన్ ఎ ఊపిరితిత్తుల వాపు నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది

మధుమేహ (Diabetes) వ్యాధిగ్రస్తులకు బొప్పాయి మంచిది. బొప్పాయిలో మితమైన గ్లైసెమిక్ ఇండెక్స్, అధిక ఫైబర్ కంటెంట్ ఉంది. ఇది రక్తంలో చక్కెర శోషణను నెమ్మదిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

గుండెకు మంచిది

బొప్పాయిలోని ఫోలేట్ రక్తప్రసరణ జరిగేటపుడు రక్తనాళాలను దెబ్బతీసే హోమోసిస్టీన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, తద్వారా గుండె జబ్బులను (Heart Diseases) నివారిస్తుంది. అధిక ఫైబర్ కంటెంట్ రక్తంలో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ శోషణను నిరోధిస్తుంది, అయితే పొటాషియం వాసోడైలేటర్, ఇది రక్త ప్రసరణను సులభతరం చేస్తుంది , రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

బొప్పాయిని వీరు తినకూడదు

ఉపవాసాన్ని విరమించుకోవడానికి బొప్పాయి తినడం వల్ల ప్రయోజనాలు అలుగుతునప్పటికీ, ఈ పండు కొందరికి సరిపడదు. ఈ పండులో ఫైబర్ పుష్కలంగా ఉన్నందున పేగు అనారోగ్య సమస్యలు (IBS) లేదా ఇన్ల్ఫమేటరీ ప్రేగు వ్యాధి (IBD) వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారు దీనిని నివారించాలి ఎందుకంటే ఇది ఉబ్బరం, అతిసారం లక్షణాలను మరింత పెంచుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు (Pregnant women) కూడా బొప్పాయిని నివారించాలి, ఎందుకంటే పాపాయిన్ గర్భాశయ సంకోచాలకు కారణమవుతుంది. ఇది ముందస్తు ప్రసవానికి లేదా గర్భస్రావం అయ్యేందుకు దారీతీయవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం