Ramadan 2023 । భారతదేశంలో నెలవంక దర్శనం ఎప్పుడు, మొదటి రోజు ఉపవాస తేదీల వివరాలు!-ramadan 2023 moon sighting time in india here s when you can spot the crescent moon iftar timings ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ramadan 2023 । భారతదేశంలో నెలవంక దర్శనం ఎప్పుడు, మొదటి రోజు ఉపవాస తేదీల వివరాలు!

Ramadan 2023 । భారతదేశంలో నెలవంక దర్శనం ఎప్పుడు, మొదటి రోజు ఉపవాస తేదీల వివరాలు!

HT Telugu Desk HT Telugu
Apr 04, 2023 05:17 PM IST

Ramadan 2023: నెలవంక దర్శనం తర్వాత రంజాన్ మాసం ప్రారంభం అవుతుంది. భారతదేశంలో నెలవంక దర్శన సమయం, ఇఫ్తార్ సమయాల వివరాలు చూడండి.

Ramadan 2023- Moon Sighting Details
Ramadan 2023- Moon Sighting Details (Unsplash)

Ramadan 2023: రంజాన్ అనేది ఇస్లామిక్ క్యాలెండర్‌లో వచ్చే తొమ్మిదవ నెల, ఇది 720 గంటల పాటు జరుగుతుంది, అంటే నాలుగు వారాల రెండు రోజులు. ఇస్లాం మతంలో ఇది అత్యంత పవిత్రమైన నెల. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు అందరూ చాలా వైభవంగా, భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలను జరుపుకుంటారు. రంజాన్ మాసంలో ముస్లింలు తెల్లవారుజాము నుండి సూర్యాస్తమయం వరకు తినడం, మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లను త్యజిస్తారు. చెడు ఆలోచనలు, చెడు చర్యలకు కూడా దూరంగా ఉంటారు. అదనంగా, నెల రోజుల పాటు తెల్లవారుజాము నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. శాంతి, మార్గదర్శకత్వం కోసం ప్రార్థిస్తారు, స్వచ్ఛంద సేవా రూపంలో సమాజానికి తిరిగి చెల్లిస్తారు. మానవతా సేవా కార్యకలాపాలలో పాల్గొంటారు.

ఈ సంవత్సరం, భారతదేశంలో రంజాన్ మార్చి 22, 2023 బుధవారం మక్కాపై చంద్రుని వీక్షించిన తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది, నెల రోజుల తర్వాత శుక్రవారం, ఏప్రిల్ 21, 2023న ముగుస్తుంది. ఈద్-ఉల్-ఫితర్ శనివారం, ఏప్రిల్ 22, 2023న జరుపుకుంటారు. అయితే ఈ తేదీలు అన్నీ నెలవంక దర్శనంపై ఆధారపడి ఉంటాయి. రంజాన్ కు సంబంధించిన తేదీలు దేశాలను బట్టి మారవచ్చు.

రంజాన్ మాసం ప్రారంభం ఎప్పుడు?

క్రెసెంట్ మూన్ వాచ్ ప్రకారం, రంజాన్ అమావాస్య మార్చి 21న 17:23 GMTకి (మక్కా సమయం 8:23 గంటలకు) ప్రారంభమవుతుంది, ఆ రాత్రి ఏ విధమైన వీక్షణలు ఆశించలేం, అల్ జజీరా నివేదించింది. ఈరోజు, సమయం, తేదీ ప్రకారం, చంద్రోదయం ఉదయం 6:49 గంటలకు అలాగే సాయంత్రం 7:19 గంటలకు అస్తమిస్తుంది.

ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశం, ఇరాన్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా అంతటా ఆకాశం స్పష్టంగా ఉన్నట్లయితే ఆప్టికల్ సహాయం లేకుండా అమావాస్యను చూడవచ్చు. చంద్రుడు దర్శనమిస్తే, రంజాన్ మొదటి ఉపవాస దినం కూడా మార్చి 23. కాకపోతే, మొదటి రోజు మార్చి 24 నుంచి ప్రారంభం అవుతుంది.

దేశంలోని వివిధ నగరాలలో ఇఫ్తార్ సమయాలు

ముంబై - ఉదయం 05:33 నుండి సాయంత్రం 06:49 వరకు

ఢిల్లీ - ఉదయం 05:11 నుండి సాయంత్రం 06:32 వరకు

చెన్నై - ఉదయం 05:05 నుండి సాయంత్రం 06:20 వరకు

హైదరాబాద్ - ఉదయం 05:11 నుండి సాయంత్రం 06:29 వరకు

బెంగళూరు-ఉదయం 05:16 నుండి సాయంత్రం 06:34 వరకు

అహ్మదాబాద్ - ఉదయం 05:33 నుండి సాయంత్రం 06:50 వరకు

కోల్‌కతా - ఉదయం 04:30 నుండి సాయంత్రం 05:47 వరకు

పూణె- ఉదయం 05:29 నుండి సాయంత్రం 06:48 వరకు

జైపూర్ - ఉదయం 05:18 నుండి సాయంత్రం 06:39 వరకు

లక్నో - ఉదయం 04:57 నుండి సాయంత్రం 06:17 వరకు

కాన్పూర్ - ఉదయం 05:00 నుండి సాయంత్రం 06:20 వరకు

ఇండోర్ - ఉదయం 05:20 నుండి సాయంత్రం 06:40 వరకు

పాట్నా- ఉదయం 04:41 నుండి సాయంత్రం 06:00 వరకు

చండీగఢ్ - ఉదయం 05:11 నుండి సాయంత్రం 06:35 వరకు

రంజాన్ మాసంలో ముస్లింలు ప్రార్థనలు, ఖురాన్ పఠనంలో ఎక్కువ సమయం గడుపుతారు. మసీదులు కూడా అదనపు సేవలను అందిస్తాయి, అదనంగా తరావీహ్ ప్రార్థనలు జరుగుతాయి, ఇవి సాధారణ రోజువారీ ప్రార్థనల కంటే ప్రత్యేకమైనవి, ఎక్కువగా రాత్రిపూట చేసే ప్రత్యేక ప్రార్థనలు.

Whats_app_banner

సంబంధిత కథనం