Ramadan 2023 । రంజాన్ పండగ ఎప్పుడు? ఇస్లామిక్ పవిత్ర మాసంలోని ముఖ్య తేదీల వివరాలు!
Ramadan 2023: పవిత్ర రంజాన్ మాసం దాదాపు వచ్చేసింది. రంజాన్ మాసంకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, భారతదేశంలో సెహ్రీ, ఇఫ్తార్ విందులకు సంబంధించిన సమాచారం చూడండి.
Ramadan 2023: ముస్లింలకు సంవత్సరంలో ఎంతో ప్రత్యేకమైన, పవిత్రమైన రంజాన్ మాసం దాదాపు వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు అంతా అత్యంత వైభవంగా రంజాన్ పండుగను జరుపుకుంటారు. పండుగకు నెల రోజుల ముందు నుంచే కఠినమైన ఉపవాస దీక్షలు కొనసాగిస్తారు, మసీదులలో ప్రార్థనలు, దాన ధర్మాలు చేస్తూ ఆధ్యాత్మిక స్ఫూర్తిని కనబరుస్తారు. ఇస్లామిక్ సంస్కృతి ప్రకారం, లూనార్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెలను రంజాన్ మాసంగా పరిగణిస్తారు. ఇది వారికి అత్యంత పవిత్రమైన మాసం.
ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, 2023 ఏడాదిలో రంజాన్ మాసం మార్చి 22న ప్రారంభమై ఏప్రిల్ 21న ముగుస్తుంది. ఇది వారికి అత్యంత పవిత్రమైన మాసం. ఈ సమయంలో, ముస్లింలు సూర్యోదయానికి ముందే ఆహారం తీసుకుంటారు, దీనిని సెహ్రీ అంటారు. ఆ తర్వాత రోజంతా ఉపవాసం ఉంటారు, దీనిని రోజాహ్ అంటారు, సూర్యాస్తమయం తర్వాత ఉపవాసం విరమిస్తారు, దీనిని ఇఫ్తార్ అంటారు.
When is Ramadan in 2023- రంజాన్ ఎప్పుడు?
ఇస్లామిక్ క్యాలెండర్ చంద్రుని దశలను అనుసరిస్తుంది, దీనిని సాధారణంగా చంద్ర చక్రం అని పిలుస్తారు. ఫలితంగా, గ్రెగోరియన్ క్యాలెండర్‌లో ప్రతి సంవత్సరం రంజాన్ పవిత్ర మాసం సుమారు 10 రోజుల ముందు వస్తుంది. ఈ సంవత్సరం, రంజాన్ మాసం మార్చి 22వ తేదీ బుధవారం నుండి ప్రారంభం కానుంది. అయితే ఇది మక్కాలో చంద్రుని దర్శనానికి లోబడి ఉంటుంది. ఉపవాస కాలం 30 రోజుల పాటు కొనసాగుతుంది, ఏప్రిల్ 21 శుక్రవారం ముగుస్తుంది. ఆ తర్వాత ఈద్ అల్-ఫితర్ వేడుకలు ప్రారంభం అవుతాయి. చంద్ర దర్శనం ఆధారంగా ఏప్రిల్ 22వ తేదీ శనివారం లేదా ఏప్రిల్ 23వ తేదీ ఆదివారం రంజాన్ పండుగను జరుపుకుంటారు.
రంజాన్ పండగకు సంబంధించి ముఖ్యమైన తేదీలు ఇక్కడ చూడండి
రంజాన్ ప్రారంభం: మార్చి 22, బుధవారం
రంజాన్ ముగింపు: ఏప్రిల్ 21, శుక్రవారం
లైలత్ అల్-ఖద్ర్: ఏప్రిల్ 17, సోమవారం
ఈద్ అల్-ఫితర్ ప్రారంభం: ఏప్రిల్ 22, శనివారం
ఇఫ్తార్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
భారతదేశంలోని వివిధ నగరాలలో సెహ్రీ, ఇఫ్తార్ సమయాలు ఇక్కడ చూడండి.
ముంబై - ఉదయం 05:33 నుండి సాయంత్రం 06:49 వరకు
ఢిల్లీ - ఉదయం 05:11 నుండి సాయంత్రం 06:32 వరకు
చెన్నై - ఉదయం 05:05 నుండి సాయంత్రం 06:20 వరకు
హైదరాబాద్ - ఉదయం 05:11 నుండి సాయంత్రం 06:29 వరకు
బెంగళూరు-ఉదయం 05:16 నుండి సాయంత్రం 06:34 వరకు
అహ్మదాబాద్ - ఉదయం 05:33 నుండి సాయంత్రం 06:50 వరకు
కోల్‌కతా - ఉదయం 04:30 నుండి సాయంత్రం 05:47 వరకు
పూణె- ఉదయం 05:29 నుండి సాయంత్రం 06:48 వరకు
జైపూర్ - ఉదయం 05:18 నుండి సాయంత్రం 06:39 వరకు
లక్నో - ఉదయం 04:57 నుండి సాయంత్రం 06:17 వరకు
కాన్పూర్ - ఉదయం 05:00 నుండి సాయంత్రం 06:20 వరకు
ఇండోర్ - ఉదయం 05:20 నుండి సాయంత్రం 06:40 వరకు
పాట్నా- ఉదయం 04:41 నుండి సాయంత్రం 06:00 వరకు
చండీగఢ్ - ఉదయం 05:11 నుండి సాయంత్రం 06:35 వరకు
అయితే, సూర్యుని స్థానం/ చంద్ర గమనం ఆధారంగా ప్రదేశాలను బట్టి సెహ్రీ లేదా సుహూర్, ఇఫ్తార్ సమయాలలో మార్పు ఉంటుందని గమనించడం ముఖ్యం.
సంబంధిత కథనం
టాపిక్