Eid 2022 | దేశవ్యాప్తంగా ఈద్ ఉల్-ఫితర్ వేడుకలు.. ఎలా, ఎందుకు చేసుకుంటారో తెలుసా?-moon sighting and celebrations and history of eid ul fitr 2022 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Moon Sighting And Celebrations And History Of Eid Ul Fitr 2022

Eid 2022 | దేశవ్యాప్తంగా ఈద్ ఉల్-ఫితర్ వేడుకలు.. ఎలా, ఎందుకు చేసుకుంటారో తెలుసా?

HT Telugu Desk HT Telugu
May 03, 2022 07:02 AM IST

ఈద్ ఉల్-ఫితర్.. రంజాన్ ఉపవాస మాసం ముగింపును సూచిస్తుంది. ఇస్లామిక్ మాసమైన షవ్వాల్‌కు మొదటి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఎక్కడా నెలవంక కనిపించలేదు కాబట్టి.. దేశవ్యాప్తంగా ఈద్-ఉల్-ఫితర్ పండుగను మే 3వ తేదీన జరుపుకోవాలని మత గురువులు ప్రకటించారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా.. ఈ రోజున ముస్లింలు చేసే మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈద్ ఉల్-ఫితర్ 2022
ఈద్ ఉల్-ఫితర్ 2022

Eid Ul Fitr 2022 | సోమవారం దేశంలో షవ్వాల్ నెలవంక కనిపించలేదని... అందుకే భారతదేశం అంతటా ముస్లింలు మే 3వ తేదీన అనగా మంగళవారం ఈద్-ఉల్-ఫితర్​ను జరుపుకోవాలని కర్ణాటకకు చెందిన రుయాత్-ఇ-హిలాల్ కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ప్రకటించారు. ఈద్-ఉల్-ఫితర్‌ను ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు నిర్వహిస్తారు. ఇస్లామిక్ పవిత్ర మాసమైన రంజాన్ ముగింపును ఇది సూచిస్తుంది.

ఇస్లామిక్ విశ్వాసం ప్రకారం.. ప్రవక్త ముహమ్మద్‌ రచించిన ఖురాన్ మొదటి అవతరణ జ్ఞాపకార్థం నిమిత్తం రంజాన్‌ను ఉపవాస నెలగా పాటిస్తారు. రంజాన్ ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల. ఇందులో దాదాపు 30 రోజుల పాటు కఠినమైన ఉపవాసం ఉంటుంది. ఈ నెలలో ముస్లింలు తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఆహారం లేదా నీరు తీసుకోరు. వారు సెహ్రీ (ఉదయానికి ముందు భోజనం) తింటారు. సాయంత్రం 'ఇఫ్తార్'తో తమ పగటిపూట ఉపవాసాన్ని విరమిస్తారు. నెలవంక దర్శనాన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా వివిధ రోజులలో ఈద్ జరుపుకుంటారు.

1. వేడుకలు

ఈద్ రోజున ముస్లింలు కొత్త బట్టలు ధరించి.. ఒకరికొకరు 'ఈద్ ముబారక్' శుభాకాంక్షలు తెలుపుకుంటారు. పిల్లలు పెద్దల నుంచి ‘ఈద్ (బహుమతులు లేదా డబ్బు) పొందుతారు. ముస్లిం సోదరులు వారి కుటుంబాలు, స్నేహితులతో కలిసి పండుగ జరుపుకుంటూ.. రుచికరమైన సేమ్యా, బిర్యానీ, కబాబ్‌లు, మొదలైన వంటకాలను తింటారు.

2. ఈద్-ఉల్-ఫితర్ పండుగ

వెర్మిసెల్లి (సేమ్యా), రోజ్ వాటర్, డ్రైఫ్రూట్స్, కుంకుమపువ్వు, ఏలకులతో.. షీర్ ఖుర్మాను కచ్చితంగా తయారు చేస్తారు. ఈద్ ప్రార్థనలు ముగిసిన తర్వాత దీనిని కచ్చితంగా సేవిస్తారు. అంతేకాకుండా స్నేహితులు, బంధువులకు పంపిణీ చేస్తారు.

3. ఈద్ తేదీ

హిజ్రీ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఈద్ తేదీ మారుతుంది. ఇది చంద్రుని దశల ఆధారంగా ఉంటుంది. భారతదేశంలో ఈ సంవత్సరం నెలవంక దర్శనం ప్రకారం.. మే 3వ తేదీన జరుపుతున్నారు.

4. ప్రపంచ వ్యాప్తంగా ఈద్ వేడుకలు

సౌదీ అరేబియా, ఫిలిప్పీన్స్, మలేషియా, థాయ్‌లాండ్, బ్రూనై వంటి దేశాలు గత రాత్రి నెలవంక దర్శనం పొందాయి. ఈ క్రమంలో వారు మే 2వ తేదీన ఈద్​ను పాటించాయి.

5. పబ్లిక్ హాలిడే

పండుగను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సెలవును ప్రకటించి.. ప్రభుత్వ సంస్థలను మూసివేస్తారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్