Ramadan 2022 | నేటి నుంచి రంజాన్ మాసం.. ఉపవాస దీక్షలు ప్రారంభించనున్న ముస్లింలు-ramzan 2022 month to begin from today in india ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ramadan 2022 | నేటి నుంచి రంజాన్ మాసం.. ఉపవాస దీక్షలు ప్రారంభించనున్న ముస్లింలు

Ramadan 2022 | నేటి నుంచి రంజాన్ మాసం.. ఉపవాస దీక్షలు ప్రారంభించనున్న ముస్లింలు

HT Telugu Desk HT Telugu
Apr 03, 2022 06:01 AM IST

ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం నేటి నుంచి ప్రారంభమవుతుంది. నేడు ఆదివారం, ఏప్రిల్ 3, 2022న సాయంత్రం తొలి ఉపవాసం ప్రారంభించటం ద్వారా దీక్ష ప్రారంభం అవుతుంది. నెలరోజుల పాటు చేపట్టే ఈ ఉపవాస దీక్ష రంజాన్ పర్వదినం వరకు కొనసాగుతుంది.

<p>Ramzan 2022</p>
Ramzan 2022 (HT Photo)

నెలవంక దర్శనంతో ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం నేటి నుంచి ప్రారంభమవుతుంది. నేడు ఆదివారం, ఏప్రిల్ 3, 2022న సాయంత్రం తొలి ఉపవాసం ప్రారంభించటం ద్వారా దీక్ష ప్రారంభం అవుతుంది. నెలరోజుల పాటు చేపట్టే ఈ ఉపవాస దీక్ష రంజాన్ పర్వదినం వరకు కొనసాగుతుంది.

ఇస్లామిక్ క్యాలెండర్ చంద్రమానం ఆధారంగా ఉంటుంది కాబట్టి రంజాన్ ఉపవాస తేదీలు ప్రతీ ఏడాది ఒకేలా ఉండవు. ప్రారంభ, ముగింపు తేదీలు నెలవంక దర్శనంపై ఆధారపడి ఉంటాయి. ఈమేరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభం అయిందని మార్కాజీ రూట్ ఇ హిలాల్ కమిటీ శనివారం సాయంత్రం ప్రకటించింది.

రంజాన్ అనేది ఇస్లామిక్ క్యాలెండర్‌లో వచ్చే తొమ్మిదవ నెల. ఇది 720 గంటల పాటు ఉంటుంది. అంటే నాలుగు వారాల రెండు రోజుల పాటు కొనసాగుతుంది. ముస్లింలు పవిత్రంగా భావించే ఈ మాసంలో తెల్లవారుజాము నుంచి సూర్యాస్తమయం వరకు కఠిన ఉపవాస దీక్షలో ఉంటారు.

దీక్షలో ఉండే వారు ఈ నెల ఆసాంతం శాంతి, సహనంతో వ్యవహరిస్తూ తమకు సరైన మార్గనిర్దేశనం చేయాలని భగవంతుణ్ని (అల్లాను) ప్రార్థిస్థారు. అలాగే వారు జీవిస్తున్న సమాజానికి దానధర్మాల రూపంలో ఎంతో కొంత తిరిగి చెల్లిస్తారు. నిరుపేదలకు ఆహారం అందించడం, జకాత్ ఇవ్వడం, మానవతా దృక్పథంతో మెలుగుతారు.

Whats_app_banner

సంబంధిత కథనం