Bladder Cancer । మూత్రాశయ క్యాన్సర్‌కు అదే కారణం.. ముప్పు తప్పించుకోండిలా!-bladder cancer risk factors treatments and tips to manage it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bladder Cancer । మూత్రాశయ క్యాన్సర్‌కు అదే కారణం.. ముప్పు తప్పించుకోండిలా!

Bladder Cancer । మూత్రాశయ క్యాన్సర్‌కు అదే కారణం.. ముప్పు తప్పించుకోండిలా!

HT Telugu Desk HT Telugu
Jun 17, 2023 03:29 PM IST

Bladder Cancer: మూత్రాశయం లైనింగ్‌లో అసాధారణ కణజాల పెరుగుదల కనిపించినప్పుడు, దానిని మూత్రాశయ క్యాన్సర్ అని పిలుస్తారు, ఈ వ్యాధి రావడానికి ముఖ్య కారణాలు తెలుసుకోండి.

Bladder Cancer
Bladder Cancer (istock)

Bladder Cancer: క్యాన్సర్ చాలా రకాలుగా ఉంటుంది. శరీరంలో వ్యాధి అభివృద్ధి చెందే భాగాన్ని బట్టి దానికి ఆ పేరు వస్తుంది. ఈ జాబితాలో మూత్రాశయ క్యాన్సర్ కూడా ఒకటి. మూత్రాశయం (Bladder) అనేది పొత్తికడుపు దిగువ భాగంలో మూత్రాన్ని నిల్వ చేసే బోలు, బెలూన్ ఆకారపు అవయవం. మూత్రపిండాలు ఉత్పత్తి చేసిన మూత్రాన్ని ఇది నిల్వ చేస్తుంది. ఈ మూత్రాశయం లైనింగ్‌లో కణితి ఏర్పడినప్పుడు లేదా మూత్రాశయం లైనింగ్‌లో అసాధారణ కణజాల పెరుగుదల కనిపించినప్పుడు, దానిని మూత్రాశయ క్యాన్సర్ అని పిలుస్తారు, అయితే కణితి చుట్టుపక్కల అవయవాలకు లేదా కండరాలకు వ్యాపిస్తుంది.

HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, యూరాలజిస్ట్ డాక్టర్ ప్రణవ్ ఛజెడ్, మూత్రాశయ క్యాన్సర్, ప్రమాద కారకాలు, దానిని నివారింటానికి చిట్కాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. “యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ అనేది క్యాన్సర్ లోని అత్యంత సాధారణ రూపాలలో ఒకటి. దీనిని వైద్యభాషలో యురోథెలియల్ కార్సినోమా, ట్రాన్సిషనల్ సెల్ కార్సినోమా అని కూడా పిలుస్తారు, ఇది మూత్రాశయ క్యాన్సర్ అత్యంత ప్రబలమైన రకం. గ్లోబోకాన్ విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం 21,000 కంటే ఎక్కువ మూత్రాశయ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే ఈ బ్లాడర్ క్యాన్సర్ బారినపడి ప్రతి సంవత్సరం 11,000 పైగా జనం మరణిస్తున్నారు. ఈ క్యాన్సర్ రకానికి చికిత్స విజయవంతమైన తర్వాత కూడా ప్రారంభ దశ మూత్రాశయ క్యాన్సర్ పునరావృతమవుతుంది. అందువల్ల, మూత్రాశయ క్యాన్సర్ కు సమర్థవంతమైన వ్యాధి నిర్వహణపై దృష్టి పెట్టడం అత్యవసరం, రోగులు క్రమం తప్పకుండా సంవత్సరాల పాటు పరీక్షలు చేసుకోవడం అవసరం ఉంటుంది" అని డాక్టర్ ప్రణవ్ అన్నారు.

మూత్రాశయ క్యాన్సర్‌ ప్రమాద కారకాలు

డాక్టర్ ప్రణవ్ ఛజెడ్ ప్రకారం, మూత్రాశయ క్యాన్సర్‌ సంభవించడానికి వివిధ ప్రమాద కారకాలు ఉన్నాయి. ఈ వ్యాధి రావడానికి ముఖ్య కారణాలు ఇలా ఉన్నాయి..

· ధూమపానం, పొగాకు వినియోగం

· ఊబకాయం, జీవనశైలి

· రసాయనాలు, సుగంధ అమైన్‌లకు గురికావడం

· పునరావృతమైన లేదా దీర్ఘకాలిక మూత్ర ఇన్ఫెక్షన్లు

· అంతకుముందు మూత్రాశయ క్యాన్సర్‌కు చికిత్స తీసుకొని ఉండటం

· కుటుంబ సభ్యుల్లో ఎవారికైనా ఈ వ్యాధి ఉండటం, వంశపారం పర్యంగా రావచ్చు.

మూత్రాశయ క్యాన్సర్‌కు చికిత్స

మూత్రాశయ క్యాన్సర్‌కు సమర్థవంతమైన చికిత్స కోసం, డాక్టర్ ప్రణవ్ ఈ కింది చికిత్సా విధానాలను సూచించారు:

- శస్త్రచికిత్స

- కీమోథెరపీ

- రేడియోథెరపీ

- ఇమ్యునోథెరపీ

- టార్గెటెడ్ థెరపీ

మూత్రాశయ క్యాన్సర్‌ నివారణ మార్గాలు

ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడం, అధిక మొత్తంలో పండ్లు, కూరగాయలతో సమతుల్య ఆహారం తీసుకోవడం, మితంగా శారీరక వ్యాయామం చేయడం వంటివి చేయాలి. అలాగే, క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి ఆల్కహాల్, పొగాకు వినియోగానికి దూరంగా ఉండాలి, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. వైద్య నిపుణులతో రెగ్యులర్ గా సంప్రదించడం ద్వారా మూత్రాశయ క్యాన్సర్‌ను నివారించడం సాధ్యమవుతుంది అని వైద్యులు సూచిస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం