Summer Exercises । వేసవిలో ఈతకొట్టడం గొప్ప వ్యాయామం, ప్రయోజనాలు ఇవే!-best summer exercises swimming a cool body workout during hot season check benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Summer Exercises । వేసవిలో ఈతకొట్టడం గొప్ప వ్యాయామం, ప్రయోజనాలు ఇవే!

Summer Exercises । వేసవిలో ఈతకొట్టడం గొప్ప వ్యాయామం, ప్రయోజనాలు ఇవే!

HT Telugu Desk HT Telugu
Apr 18, 2023 08:38 AM IST

Summer Exercises: వేసవిలో కూడా కొన్ని వ్యాయామాలు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తాయి, అందులో ఈత (Swimming) ఒకటి. ఈత కొట్టడం ద్వారా ఎలాంటి వ్యాయామం లభిస్తుందో ఇక్కడ తెలుసుకోండి.

Summer Exercises- swimming
Summer Exercises- swimming (Unsplash)

Summer Exercises: ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం (Regular Exercise) చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ అలవాటు గుండె జబ్బులు (Heart Diseases), స్ట్రోక్, మధుమేహం (Diabetes) వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఉదయం చేసే వ్యాయామం మీ మెదడు ఆరోగ్యానికి కూడా మంచిది ఒక అధ్యయనం ప్రకారం క్రమం తప్పకుండా, ఏరోబిక్ వ్యాయామం (aerobic exercise) చేయడం వల్ల హిప్పోకాంపస్ పరిమాణం పెరుగుతుంది, తద్వారా నేర్చుకునే సామర్థ్యం, జ్ఞాపకశక్తికి మరింత మెరుగుపడుతుంది.

అయితే వేసవి కాలంలో వ్యాయామం (Working out in summer) కాస్త కఠినంగా ఉంటుంది. ఎందుకంటే ఎండవేడి కారణంగా శరీరం సాధారణంగానే చెమటలు పడుతుంది, దీనికి తోడు వ్యాయామం చేయడం వల్ల కలిగే అదనపు చెమట (Excessive sweat) వలన శరీరం మరింత ఎక్కువ నీటిని కోల్పోతుంది, వేగంగా అలసిపోతారు, ఇది నిర్జలీకరణం (Dehydration) కు కూడా దారితీయవచ్చు. వేసవి సీజన్‌లో ప్రత్యేకించి మీరు అవుట్‌డోర్ వర్కౌట్‌లను చూస్తున్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. తగినంత నీరు తాగటంతో పాటు, అలసిపోకుండా మంచి పోషకాహారం కూడా తీసుకోవాలి.

ఇదిలా ఉంటే, వేసవిలో కూడా కొన్ని వ్యాయామాలు (Cooldown Excercises) ఆహ్లాదకరంగా ఉంటాయి. మీరు అసలు కష్టపడుతున్నట్లే అనిపించదు, ఉత్సాహంతో ఈ వ్యాయామం చేస్తారు. చల్లగా కూడా ఉంటారు. అదే ఈతకొలనులు చేసే స్విమ్మింగ్. ఇది ఈ వేసవి నెలల్లో మిమ్మల్ని చురుకుగా ఉంచటానికి సహాయపడే ఒక బహిరంగ వ్యాయామం. మీకు మోకాలి నొప్పులు లేదా కీళ్ల నొప్పులు ఉన్నా, మీరు ఈ వేసవిలో వ్యాయామం చేసేటపుడు కలిగే అధిక చెమటను ద్వేషించేవారైనా మీకు ఈత మంచి ఆప్షన్. ఇది శ్రమ తక్కువగా ఉండి, వినోదాత్మకంగా అనిపించే ఒక ప్రభావవంతమైన కార్డియో వ్యాయామం.

Swimming Workout Impact- ఈతతో పని చేసే కండరాలు

స్విమ్మింగ్ అనేది చెమట చికాకులు, అలసటలు లేని పూర్తి శరీర వ్యాయామం. ఈత కొట్టేటపుడు మీరు మీ చేతులు, వీపు, కాళ్ళు, తొడలు ఇతర అన్ని కండరాలకు పని కల్పించవచ్చు. ఇది ఒక గొప్ప కార్డియోవాస్కులర్ వర్కవుట్. మీ ఫిట్‌నెస్ స్థాయిని మెరుగుపరిచే ఎక్సర్‌సైజ్.

Swimming Benefits- ఈత ప్రయోజనాలు

మెరుగైన శ్వాస నియంత్రణ (Improved Breathing), మెరుగైన కార్డియో ఓర్పు లభించడంతో పాటు ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా మీ శరీరంలోని కండరాలన్నింటికి వ్యాయామం లభించి అవి సరైన ఆకృతిలో ఉంటాయి. మీరు ప్రతిరోజూ వ్యాయామంగా ఈత కొట్టడం అభ్యాసం చేయండి, ఇది రన్నింగ్, జాగింగ్ వంటి కార్డియో కార్యకలాపాల కంటే సులభంగా ఉంటుంది. గాయాలు అయ్యేందుకు ఆస్కారం ఉండదు. మీరు ఎంత వేగంగా ఈత కొడితే, అంత ఎక్కువ కేలరీలను బర్న్ చేయవచ్చు. 70 కేజీల బరువున్న వ్యక్తి 30 నిమిషాల పాటు మామూలుగా ఈత కొడితే దాదాపు 250 కేలరీలు బర్న్ అవుతాయి; వేగంగా ఈత కొడితే 30 నిమిషాల్లో 350 కేలరీలు బర్న్ చేయగలడు. మీరు కేవలం ఈతకొట్టడమే కాకుండా స్విమ్మింగ్ చేస్తూ ఆటలు కూడా ఆడవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం