Vital Signs- Normal Ranges । ఆరోగ్యంగా ఉండాలంటే అన్నీ 'నార్మల్' గా ఉండాలి.. ఎంత ఉండాలో చెక్ చేసుకోండి!-being normal is healthy check normal vital sign ranges for the average healthy adult ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vital Signs- Normal Ranges । ఆరోగ్యంగా ఉండాలంటే అన్నీ 'నార్మల్' గా ఉండాలి.. ఎంత ఉండాలో చెక్ చేసుకోండి!

Vital Signs- Normal Ranges । ఆరోగ్యంగా ఉండాలంటే అన్నీ 'నార్మల్' గా ఉండాలి.. ఎంత ఉండాలో చెక్ చేసుకోండి!

HT Telugu Desk HT Telugu
Dec 12, 2022 09:15 AM IST

Vital Signs: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం అంటే మన శరీరానికి సంబంధించి ఉండాల్సిన బీపీ, షుగర్, నాడీ, శ్వాస, ఉష్ణోగ్రత మొదలనవి అన్నీ సాధారణ స్థాయిలో ఉండటం. ఆరోగ్యవంతమైన ఒక వ్యక్తికి ఉండాల్సిన సాధారణ స్థాయిలు ఇక్కడ తెలుసుకోండి.

Vital Signs- Normal Ranges
Vital Signs- Normal Ranges (Unsplash)

ఆరోగ్యం బాగుంటేనే మనిషి ఏదైనా సాధించగలడు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అది చాలా నిజం కూడా. కానీ ఈరోజుల్లో ప్రతీ వ్యక్తికి ఏదో ఒక సమస్య ఉంటుంది. అది శారీరకమైనది కావచ్చు లేదా మానసికమైనది కావచ్చు.

నేటి అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారంలో నాణ్యత లేమి, వాతావరణ కాలుష్యం మొదలైనవి అన్నీ కూడి మనిషి ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నాయి. అందుకే ప్రజలు నేడు వయసుతో సంబంధం లేకుండా రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు సహా అనేక దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. శరీరానికి సంబంధించి ప్రతీది సాధారణంగా ఉండాల్సిన స్థాయికి మించి ఉంటున్నాయి. ఏ వయస్సు వారికైనా BP, పల్స్ రేటు, ఉష్ణోగ్రత మొదలైనవి నార్మల్ గా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఏది ఎక్కువైనా, తక్కువైనా సమస్యే.

Normal Ranges of Vital Signs- శరీరంలోని కీలక సంకేతాల సాధారణ స్థాయిలు

ఈ కింద మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తికి ఉండాల్సిన BP, పల్స్ రేటు, ఉష్ణోగ్రత మొదలైన వాటి గురించిన సమాచారం ఇక్కడ ఉంది. 40 ఏళ్లు పైబడిన వారు ఇక్కడ జాబితా చేసిన అంశాలన్నింటిని సాధారణ స్థాయిల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

1. BP: 120/80

2. పల్స్: 70 - 100

3. ఉష్ణోగ్రత: 36.8 - 37

4. శ్వాసక్రియ రేటు: నిమిషానికి 12-20 ఉఛ్వాస నిశ్వాసలు

5. హిమోగ్లోబిన్:

పురుషులు -13.2-18

స్త్రీ - 11.50 - 16

6. కొలెస్ట్రాల్: 130 - 200

7. పొటాషియం: 3.50 – 5

8. సోడియం: 135 - 145

9. ట్రైగ్లిజరైడ్స్: 220

10. శరీరంలో రక్తం మొత్తం: PCV 30-40%

11. చక్కెర స్థాయి:

పిల్లలకు 70-130 mg/dL

పెద్దలకు: 70 - 115 mg/dL

12. ఐరన్: 8-15 మి.గ్రా

13. తెల్ల రక్త కణాలు WBC: 4000 - 11000

14. ప్లేట్‌లెట్లు: 1,50,000 - 4,00,000

15. ఎర్ర రక్త కణాలు RBC: 4.50 - 6 మిలియన్లు.

16. కాల్షియం: 8.6 -10.3 mg/dL

17. విటమిన్ D3: 20 - 50 ng/ml.

18. విటమిన్ B12: 200 - 900 pg/ml.

వయసు 40 సంవత్సరాలు పైబడిన వయోజనులు అందరూ ఈ పైన పేర్కొన్న అంశాలలో సాధారణ స్థాయిలు నిర్వహించడానికి ఈ కింది సూత్రాలను తప్పకుండా పాటించాలి.

తగినంత హైడ్రేషన్

మీకు దాహంగా ఉన్నా, లేకపోయినా శరీరానికి అవసర మేరకు నీరు త్రాగండి. సాధారణంగా చాలా వరకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు డీహైడ్రేషన్ కారణంగానే తలెత్తుతాయి.

శారీరక శ్రమ

ఒక్కచోట కూర్చోవడ, పడుకోవడం చేయకండి. వీలైనంత ఎక్కువ శరీరానికి పని కల్పించండి. చురుకుగ ఉండండి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా నడక, స్విమ్మింగ్, యోగా లేదా ఏవైనా క్రీడలు ఆడుతూ కూడా శరీరానికి కొంత వ్యాయామం అనేది అందివ్వాలి.

తక్కువ తినండి

వయసు పెరుగుతున్న కొద్దీ జీర్ణశక్తి తగ్గుతూ పోతుంది. అందువల్ల ఆకలి మేరకు తినండి, అతిగా తినడం మానుకోండి. అయితే శక్తివంతమైన ఆహారం తీసుకోండి. ప్రోటీన్లు, ఫైబర్, మంచి కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి.

కోపాన్ని వదిలేయండి

చాలా విషయాలు మనకు కోపాన్ని, ఆగ్రహాన్ని తెప్పిస్తాయి. అయినా కూడా మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిగ్రహంగా ఉండాలి. ప్రతి చిన్నవిషయానికి ఎక్కువ హైపర్ అవడం, అతిగా చింతించటం మానేయండి. ఒత్తిడి, ఆందోళనలు మిమ్మల్ని మానసికంగా శారీరాకంగా కుంగదీస్తాయి. సానుకూల వ్యక్తులతో మాట్లాడండి, వారి మాటలు వినండి.

డబ్బు కాదు, అనుబంధాలు ముఖ్యం

ఇంతకాలం మీరు డబ్బు సంపాదించి ఉంటారు. ఈ డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు మనశ్శాంతి కరువు అవుతుంది. మన అనే వాళ్లు దూరం అయి, డబ్బు మీద ఆశతో పరాయి వారు చేరువవుతారు. కాబట్టి డబ్బుతో అనుబంధాన్ని విడిచిపెట్టి, మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి, హాయిగా నవ్వండి, నవ్వుతూ మాట్లాడండి. రేపు అనే రోజు మిమ్మల్ని చూసుకునేది మీ ఆప్తులే కాని, మీ ఆస్తులు కావు అని గుర్తుంచుకోండి. మీ కుటుంబ సభ్యులను వ్యంగ్యంగా ఏమీ అనకండి, మీ ముఖం మీద చిరునవ్వు ఉంచండి.

పైన పేర్కొన్న 5 సూత్రాలను పాటిస్తే మీరు శారీరకంగా, మానసికంగా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతారు.

WhatsApp channel

సంబంధిత కథనం