Summer Cool Tea Recipe । ఉదయాన్నే ఒక కప్పు ఈ టీ తాగితే డీహైడ్రేషన్ కాదు, జీర్ణ సమస్యలు రావు!
Summer Cool Tea Recipe: వేసవిలో తాగాల్సిన సమ్మర్ కూల్ టీ రెసిపీని పోషకాహార నిపుణురాలు మున్మున్ పంచుకున్నారు. ఈ టీని ఎలా చేయాలో ఈ కింద సూచనలు చదవండి.
Hydrating Drinks: జూన్ మాసం వచ్చి పక్షం రోజులు గడుస్తున్నా నైరుతి చల్లదనం జాడలేదు, భానుడి భగభగలు ఆగడం లేదు. ఆరోగ్యవంతులైన పెద్దవారు సైతం ఈ ఎండలను, ఈ వేడిని తట్టుకోలేక నీరసించిపోతున్నారు. చిన్నపిల్లల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి వేడిలో డీహైడ్రేషన్ కాకుండా ఎన్ని నీళ్లు తాగినా తక్కువ. చాలా మంది తరచుగా డీహైడ్రేషన్ కు గురవుతూ ఇతర అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. కాబట్టి హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా అవసరం.
అయితే, మీ శరీరానికి తగినంత హైడ్రేషన్ లభించాలంటే కేవలం నీరు మాత్రమే తాగితే సరిపోదు. శరీరంలో నీటిని నిల్వ ఉంచే తాజా కూరగాయలు, పండ్లు వంటి ఆహారాలు. అలాగే శరీరం నుంచి నీటి నష్టం ఎక్కువ జరగకుండా శరీరాన్ని సహజంగా చల్లబరిచే పదార్థాలు తీసుకోవాలి. ఏలకులు, జీలకర్ర, ధనియాలు వంటి సుగంధ దినుసులు శరీరాన్ని చల్లబరిచే గుణాలను కలిగి ఉంటాయి. వీటిని కలిపి చేసే ఇన్ఫ్యూజ్డ్ డ్రింక్స్ తాగటం లేదా సమ్మర్ టీని తాగడం ఈ మండు వేసవిలో కచ్చితంగా చేయాలి. ఇది మీ శరీరాన్ని చల్లబరుస్తుంది, వేడి వేడిని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.
పోషకాహార నిపుణురాలు మున్మున్ వేసవిలో తాగాల్సిన సమ్మర్ కూల్ టీ రెసిపీని పంచుకున్నారు. ఈ టీని సులభంగా తయారు చేయవచ్చు, అంతేకాకుండా ఈ టీ తాగటం వలన వేసవిలో సాధారణంగా తలెత్తే ఎసిడిటీ, వికారం, ఉబ్బరం, ఆకలి నియంత్రణ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సమ్మర్ కూల్ టీని ఎలా చేయాలో ఈ కింద సూచనలు చదవండి.
పోషకాహార నిపుణురాలు మున్మున్ వేసవిలో తాగాల్సిన సమ్మర్ కూల్ టీ రెసిపీని పంచుకున్నారు. ఈ టీని సులభంగా తయారు చేయవచ్చు, అంతేకాకుండా ఈ టీ తాగటం వలన వేసవిలో సాధారణంగా తలెత్తే ఎసిడిటీ, వికారం, ఉబ్బరం, ఆకలి నియంత్రణ వంటి సమస్యల నుంచి ఉపశమనం కల్పించడంలో కూడా సహాయపడుతుంది. సమ్మర్ కూల్ టీని ఎలా చేయాలో ఈ కింద సూచనలు చదవండి.
Summer Cool Tea Recipe కోసం కావలసినవి
- 1.5 కప్పులు - నీరు
- 2 – లవంగాలు
- 1-2 – ఏలకులు
- 1/4 టీస్పూన్ - ధనియాలు
- 1/4 టీస్పూన్ - జీలకర్ర
సమ్మర్ కూల్ టీ తయారీ విధానం
- ముందుగా నీటిని వేడిచేస్తూ అందులో లవంగాల చూర్ణం, ఏలకులు, ధనియాలు, జీలకర్ర వేయండి.
- ఈ నీటిని 5-10 నిమిషాలు మరిగించండి.
- రుచికోసం కొద్దిగా మిశ్రి లేదా రాక్ షుగర్ కలపండి
- ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి, మీ సమ్మర్ కూల్ టీ రెడీ. దీనిని కప్పులో వడకట్టి ఒక్కో సిప్ తాగుతూ ఆస్వాదించండి.
ఉదయం నిద్రలేచిన తర్వాత లేదా సాయంత్రం వేళ ఖాళీ కడుపుతో తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
సంబంధిత కథనం