Gram Flour Benefits : శెనగపిండితో ఇలా చేస్తే వారం రోజుల్లో ముఖం మెరిసిపోతుంది-apply gram flour with these things mixed on skin check face glow after 1 week ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gram Flour Benefits : శెనగపిండితో ఇలా చేస్తే వారం రోజుల్లో ముఖం మెరిసిపోతుంది

Gram Flour Benefits : శెనగపిండితో ఇలా చేస్తే వారం రోజుల్లో ముఖం మెరిసిపోతుంది

Anand Sai HT Telugu
Mar 16, 2024 11:34 AM IST

Gram Flour Beauty Tips : ముఖం మెరిసేందుకు నానా రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే శెనగపిండిని సరిగా ఉపయోగించుకుంటే మీరు వారంలో రోజుల్లో మెరిసిపోవచ్చు.

శెనగపిండి ప్రయోజనాలు
శెనగపిండి ప్రయోజనాలు (Unsplash)

ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొంతమంది ఇంట్లో స్కిన్ కేర్ కోసం చాలా డబ్బులు ఖర్చు చేస్తారు. కొందరు పార్లర్‌కి వెళతారు. ఇంట్లోనే శెనగపిండిలో ఈ కొన్ని పదార్థాలను మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే 7 రోజుల్లో మీ ముఖం మెరిసిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్‌ను తయారు చేసే సరైన విధానం, దాని ప్రయోజనాలను తెలుసుకుందాం.

టొమాటో రసం-శెనగపిండి ప్యాక్

టొమాటో రసంలో 2 టేబుల్ స్పూన్ల శెనగపిండిని కలిపి పేస్ట్ చేయండి. దీన్ని మీ ముఖంపై 10 నిమిషాలు అప్లై చేయండి. ఆపై కడిగేయండి. ఈ ఫేస్ ప్యాక్ ముడతలు, ఇతర యాంటీ ఏజింగ్ సమస్యలను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. టొమాటో రసం మీ స్కిన్ అందంగా మారేందుకు ఉపయోగపడుతుంది. ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్న కాసేపటికి చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఈ పదార్థాలో ఫేస్ ప్యాక్

2 టేబుల్ స్పూన్ల శెనగపిండి, అర టేబుల్ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు, పెరుగు అవసరాన్ని బట్టి తీసుకోండి. వాటిని బాగా కలపండి. మీ ముఖానికి 20 నిమిషాల పాటు ప్యాక్ వేయండి. కడిగిన తర్వాత, మాయిశ్చరైజర్ రాయండి. ఈ ప్యాక్ డార్క్ స్పాట్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. మీ ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

గ్రీన్ టీ బ్యాగ్-శెనగపిండి ప్యాక్

గ్రీన్ టీ బ్యాగ్‌ని వేడి నీళ్లలో నానబెట్టి, చల్లారగానే శెనగపిండిని వేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి 15 నిమిషాలు పట్టించి, ఆపై నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఇది డార్క్ సర్కిల్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మీ ముఖాన్ని అందంగా మారేందుకు సాయపడుతుంది.

అరటిపండుతో ఫేస్ ప్యాక్

పొడి చర్మానికి అరటిపండు కూడా ఒక గొప్ప ఎంపిక. పండిన అరటిపండును మెత్తగా చేసి అందులో పాలు లేదా రోజ్ వాటర్ కలపాలి. ఆ తర్వాత శెనగపిండి వేయాలి. కాసేపు బాగా కలుపుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని అప్లై చేసి కొన్ని నిమిషాల తర్వాత మీ ముఖాన్ని కడగాలి. ఉత్తమ ఫలితాల కోసం మీ ముఖాన్ని మాయిశ్చరైజ్ చేయండి.

ఆరెంజ్ జ్యూస్-శెనగపిండి ప్యాక్

ఆరెంజ్ జ్యూస్‌తో 2 టేబుల్‌స్పూన్ల శెనగపిండిని కలిపి పేస్ట్‌లా తయారు చేయండి. దీన్ని మీ ముఖంపై 30 నిమిషాల పాటు అప్లై చేసి, ఆపై గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి. మంచి ఫలితాల కోసం, ఈ ప్యాక్‌ని వారానికి రెండు సార్లు వాడండి, ట్యానింగ్ సమస్యల నుండి బయటపడండి.

పైన చెప్పిన చిట్కాలను వారం రోజులు పాటిస్తే చాలు మీ ముఖం మెరిసిపోతుంది. కాంతివంతంగా తయారవుతుంది. శెనగపిండి మీ చర్మాన్ని తెల్లగా చేస్తుంది. దీనితో మీరు అందంగా కనిపిస్తారు. చాలా మంది ముఖం అందంగా కనిపించేందుకు మార్కెట్లో దొరికే పదార్థాలను ఉపయోగిస్తారు. దీనితో చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. మెుటిమలతోపాటుగా ఇతర సమస్యలు కూడా వస్తాయి. మార్కెట్లో దొరికే వాటితో కాకుండా సహజ పదార్థాలను మీ ముఖానికి ఉపయోగిస్తే మంచిది. అందులో ఒకటి శెనగపిండి.

Whats_app_banner